Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

17 June, 2018 12:02

గీతం : పెద్దన్న గారు ఆంధ్రా యూనివర్సిటి :

రాచకొండ ఒక చోట బోగం కంపెని నడి పే అమెచేత పొలిసు వాళ్ళ తో " కేసులకీ నాగుంటలే ,ఊసులకీ నాగుంటలే మీక్కావాల " అనిపిస్తాడు . సరిగ్గా ఆ గుంట ల పరిస్థితిలోనే అనుబంధ కళాశాలలలోని ఉపాధ్యయవర్గం ఉంటుంది ఈ విషయమే నేను KITS( 92-93) లో పని చేసిన రోజుల్లో ‘చెత్త కుండీ " అన్న కథలో వ్రాసాను .ఇప్పటికీ నాకు ఆ అభిప్రాయం మారలేదు

మా గురువుగారు ,ఒకప్పటి సహోద్యోగి అయిన దయా రత్నం గారు JNTU VC గా ఉన్నప్పుడు , సివిల్ ఇంజినీరింగ్ కరిక్యులం ని మెరుగు పరచాలనుకుని " మనం మన కరిక్యులం లో computer ఓరియెంటెడ్ కోర్స్ లు కనీసం ఒకటో రెండో ఉంటె బావుంటుంది అని అనుకుంటున్నాను మీ అభిప్రాయం తెలియ చేయండి "అని అన్ని యూనివర్సిటి సివి ఇంజినీరింగ్ డిపార్టుమెంటు లకి ఉత్తరాలు వ్రాసారు. ఆంధ్రా యునివర్సిటి తలకాయ తమ డిపార్మెంట్లో ఉన్న అంతమంది తోను ,తమ కింద కింద అనుబంధం గా ఉన్న గీతం. , భీమవరం కళాశాలల సివిలింజినీరింగ్ తలకాయల తోను ఒక కమిటీ వేసి మీటింగ్ పెట్టారు
నేను గీతం HOD హోదాలో జవాబు వ్రాసాను " అయ్యా ! అసలే సివిల్ విద్యార్థులకి మిగిలిన వారి కంటే కాంటాక్ట్ అవర్స్ ఎక్కువ .AICTE సూచించిన సంఖ్య కంటే బాగా ఎక్కువ . అటువంటప్పుడు ఒక కొత్త కోర్సు పెట్టాలంటే ఒకపాత కోర్సును తీసివేయక తప్పదు ఏది తీసి వేయాలో సెలవీయండి . పైగా ఇక్కడ గీతం లో ఎంతో అనభవ జ్ఞులు అయిన వారు ఉన్నారు . అందులో కొందరికి మీరే ఇచ్చిన డాక్టరేట్ లు ఉన్నాయి .వారికి ఆ కమిటీ లో స్థానం లేక పోవటం , మీ డిపార్టుమెంటు లో నిన్నో మొన్నో జేరిన వారికి ఉండటం నాకు సమ్మతం కాదు " అంటూ .
దానికి వారు ఆగ్రహం చెందారని విన్నాను. అయితే ఒక కోర్సు తీసి వేయాల్సి ఉంటుంది అన్న నాసూచనని ఒప్పుకోక తప్పని పరిస్థితి . ఒకసారి ఏ ఉపాధ్యాయుడైనా ఒక కోర్సు కి లెక్చర్ నోట్స్ తయారుచేసుకుంటే తను రిటైర్ అయ్యేదాకా అదే నోట్స్ వాడతాడు కదా ! అది తీసేస్తాం నువ్వు ఆ కొత్త కోర్సు చెప్పు అంటే ఒప్పుకునే వారు ఎవరు. ? కాదు ఒకరు ఆ కొత్త కోర్స్యు చెప్పటానికి ఒప్పుకున్నా అతని పాత కోర్సు మరొకరు చెప్పాలి కాదా !అందుకని " మీ సూచన ని మేము సూత్రప్రాయంగా అగ్నీకరించినా ,అమలుపరిచలేని పరి స్థితి" అని పెద్ద సారుకి జవాబు వ్రాసి ఊపిరి పీల్స్చుకున్నారు .
అయితే నా మీద వచ్చిన కోపం పోలేదు యునివర్సిటి పరీక్షల జవాబు పత్రాలు దిద్దవలసిన సమయంలో కట్టలు తెంచుకుని బయటపడింది .’వ్రాసుకోని నిబంధన ఏమిటంటే మన కళాశాల నుంచి ఎంతమంది ఒక పరీక్ష వ్రాస్తే మన కళాశాలలో ఆ పాఠం బోధించిన సదరు ఉపాధ్యాయుడు, కనీసం అన్ని answer స్క్రిప్ట్స్ దిద్దటానికి బాధ్యుడు .అయితే అన్నలు తమ్ముళ్ళ చేత తమ కోటా కూడా దిద్దించుకోవటం వటం ఆనవాయితి .నా శాఖలో విద్యార్థుల సంఖ్య 60 అంటే ఒక ఉపాధ్యాయుడికి 3 రోజుల కంటే పట్టరాదు పేపర్ కి 10 నిముషాలు దిద్దటానికి పట్టినా .కనక 3 రోజులే OD ( on duty ) ఇవ్వసాగాను అది అన్నలకి ఇబ్బంది కలిగించింది .
వారి తలకాయ నాకు ఫోను చేసి "ఏమిటి మీరు ఎక్కువ రోజులు OD ఇవ్వనంటున్నారుట ?" అని అడిగారు.
"వారి కోటా వారు దిద్దటం లేదా ? " అని అడిగాను.
" మీ వాళ్లు ఎక్కువ దిద్దితే అలిసి పోతారా ? "’
" వాళ్లు అలిసి పోరు.కానీ వారి పని ఇక్కడ చేయాల్సిన వారు ,అలిసి పోతున్నారు ? " అన్నాను
" ఒక ఎఫిలియేటెడ్ కళాశాల డిపార్ట్మెంట్ హెడ్ అయినా మీరే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని మాట్లాడితే ,గీతం కంటే గొప్ప సంస్థ అయినా యూనివర్సిటీ లో హెడ్ గా ఉన్న నేను ఎక్కడ కళ్ళు పెట్టుకోవాలి ట "
"గీతం కంటే AU గొప్ప సంస్థ నిజమే! మీకు కోపం రావటం ధర్మమే. కానీ అదే కొలత ప్రకారం , IISc మరి AU కంటే గొప్ప సంస్థ అనుకుంటాను. మీరు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో చూసి అంతకంటే ఎత్తులో నావి "పెట్టుకుంటాను అన్నాను
నేను IISc లో VRS తీసుకుని కిట్స్ కి రాగానే , అంత వరకు నన్ను గౌరవం గా చూస్తూ వచ్చిన REC నన్ను చులకనగా చూసింది. AP ప్రభుత్వం ‘తోళ్ల పరిశ్రమ వ్యర్థజలాలని’ శు ద్ధి పరిచే మార్గం సూచించే consultancy కి నన్ను అనర్హుడిగా నిర్ణయించి REC లోని ఒక లెక్చరర్ కి ఇచ్చింది ఆయన తనకి తెలియదని మొత్తుకుంటున్నా ! కాకతీయ యూనివర్సిటీ నన్ను సివిల్ ఇంజినీరింగ్ విభాగ పు బోర్డు అఫ్ స్టడీస్ కి చైర్మన్ గా చేయటం వలన REC సీనియర్స్ ఆచార్యు లు అందులో సభ్యులుగా ఉండటానికి నిరాకరించారు. External expert గా నన్ను AU ఒక విషయం లో అనుకున్నా నేను కిట్స్ కి మారగానే నా పేరు తొలగించారు .
నాకు మాయా బజార్ లో హిడింబి అన్న మాటలు ,"రాజ్యాలు ( పదవులు ) పోయినా శాశ్వతమైన ప్రతాపాలు ఎక్కడికిపోతాయి అనుకున్నారు ? " గుర్తుకు వచ్చాయి .
అది పక్కన పెట్టి అసలు కథలోకి వస్తాను ." మీరు బోధించిన FM పేపర్లు దిద్దటానికి మీ assistant లను పంపక మీరే రావాలి" అని నాకు AU నుచి కబురు వచ్చింది . వస్తుంది ని ఎరిగి ఉండటం వలన దిద్దటానికి ముందే తయారు చేసుకున్న ‘Key ‘తో వెళ్ళాను . నాకు GATE లో పేపర్లు దిద్దే అ లవాటు మరి .

మొదటి రోజున. ప్రతి జవాబు శ్రద్ధగా చూస్తూ తప్పుల చుట్టూ ఎర్ర సిరా తో చక్రాలు చుడుతూ steps సరి చూసుకుంటూ మార్కులు వేసుకుంటూ పోయాను .నా పేపర్లు మరొకరికి దిద్దటానికి ఇచ్చినా మార్కులు మరోలా వేయటానికి నేను అవకాశం ఇవ్వ లేదు . రెండో రోజున నేను వెళ్లేసరికి అక్కడ దిద్దటాలు చూసుకుంటున్న ఆయన చాలా గౌరవం గా ‘ మేష్టారూ ! మీకు గీతం లో చాలా పనులుంటాయి కదా . మీరు ఇంక దిద్దక్కరలేదు. ఇంకోరు దిద్దుతారు లెండి " అని నన్ను పంపించేసారు
తరవాత దాసరి శ్రీనివాస్ చెప్పాడు " మీ చేతుల్లో AU పిల్లలు పచ్చడి అయి పోయారు నిన్న . మరీ అంత strict గా దిద్దితే ఎలా ? " అన్నాడు నవ్వుతూ
" నేను నిన్న దిద్దినవి AU పిల్లలవని మీకు ఎలా తెలుసు ? Renumbering చేసి పై ముక్క చింపేస్తారు కదా ? " అన్నాను
" తెలిసేలాగా, పిల్లలు వారివే అయిన పద్ధతులు వాడతారు " అని ఆ ట్రిక్ నాకు చూపించాడు శ్రీనివాస్ .
నాకు ఆ పేపర్లు దిద్దటం వలన వచ్చే సొమ్మూ అక్కరలేదు .శ్రమా అక్కరలేదు . కనక నన్ను తప్పించినందుకు సంతోషించాను

Written by kavanasarma

June 17, 2018 at 12:02 pm

Posted in Uncategorized

%d bloggers like this: