Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

marupulekapovatamu saapamaa?

నాకు పరిచయము ఐన వారిని మూడు వర్గాలుగా విభజిస్తాను 1 పరిచయం ఐనప్పటి నుంచి ఇనాటికి నాకు వాళ్ళు వాళ్లకి నేను గుర్తున్నవాళ్ళు ఇగుంపు పెద్దది
2 నాకు వాళ్ళు గుర్తున్నారుకాని వాళ్లకి నేను లేను ఈ గుంపు ఎంతపెద్దదో తెలియదు .అందులో చాలామందిని మళ్లీ కలుసుకోలేదు కనక తెలియదు
కలుసుకున్న వారిలో వారికి నేను గుర్తులేనని వాళ్ళు చెప్పటము వల్ల వారి సంఖ్యా పెద్దదే అని తెలిసింది . వాళ్లకి నేను గుర్తున్దకపోడానికి కారణము నాలో ఎ ప్రత్యేకత లేదన్న జ్ఞానం కొంచం బాధ కలిగించేది మొదట్లో . కాని ఆ సంఖ్యా పెరిగినకొద్దీ బాధ తగ్గింది.
నాకు గుర్తున్న అన్ని పేర్లు కాకపోయినా వారికి నేను గుర్తుండి కలుసుకుంటే బావుండును అన్న పేర్లు మాత్రమే ఈ బ్లాగు లో వ్రాస్తున్నాను
3 వారికి నేను గుర్తుండి నాకు వారు గుర్తు లేని వారు . నా జీవితములో (71 సంవత్సారాల) అటువంటి వారు ఇద్దరే తగిలారు వారి విషయములో అన్ని గుర్తున్న పేర్లు గుర్తు లేక పోయాయి
1948 -49 లలో దాబాగార్దేన్సు లో సరస్వతి హాలు ఎదురింట్లో మేము అద్దెకున్న ఇంట్లో మరో భాగములో ఉంటున్న వింజమూరి శాస్త్రి అన్న నా స్నేహితుడు నేను ౨౦౧౦ జూలై లో కాకినాడలో నన్ను గుర్తుంచుకుని నన్ను ఆనందంలో ముంచితే ఆ రోజుల్లో అతను ద్రోహి సినిమా లో L .వ ప్రసాద్ నటనను అనుకరిస్తూ ఉండేవాడని అతనికి గుర్తు తెచ్చాను

అటువంటి తేనె బొట్లు రుచిగా వుంటాయి

Written by kavanasarma

September 29, 2010 at 9:09 am

Posted in Uncategorized

%d bloggers like this: