Kavana Sarma Kaburlu

All Rights Reserved

Geetham

leave a comment »

గీతం :త్రిమూర్తులు : 3. పరమ ఈ శ్వరుడు : ( ఎవరికీ అందనం త ఎత్తులో కొండ మీద కొలువై ఉన్నవాడు ) . :గీతం కళాశాలకి చైర్మన్ MVS మూర్తి గారు.
నేను ఇంకా విద్యార్థి గా ఉన్న రోజుల్లోనే గోల్డ్ స్పాట్ మూర్తి గారు గా MVSM గారు విశాఖలో ప్రసిద్ధులు. అందుచేత ఆయన నాకంటే పెద్ద వారని నేను అనుకుంటున్నాను . కానీ ఆయన చదువులో నా సమకాలీకుడైన DR .ముష్టి నారాయణ రావు (MNR)కి సహాధ్యాయి ట
Prof . MN రావు నాకు నా ఆస్ట్రేలియా రోజులు అంటే 1971 నుంచి పరిచయం .ఇద్దరం బెంగుళూరులో 1980-90 ల మధ్య ఎన్నో consultancy ప్రాజెక్ట్స్ లోను, academic commitees లోను సెమినార్ల లోను కలిసి పనిచేసాము. ఆయన నేను 1960 లో BE పాస్ అయినావారిమి .ఇద్దరం AU నుంచే కానీ ఆయన కాకినాడ నుంచి నేను విశాఖ నుంచి
నేను గీతం లో చేరాక MNR ఒకసారి ‘మీ మూర్తి గారు నేను కపిలేశ్వర పురం లో సహాధ్యాయులమి " అన్నారు
నాకంటే పెద్ద వారైన వారు నాక్లాసు లో, సహాధ్యాయులుగా , శిష్యులుగా ఉండటం నాకు అనుభవమే. సాధారణంగా పల్లెలలో బ్రాహ్మణేతర విద్యార్థులు ఆలస్యం గా బళ్ళలో చేరటం మామూలే. బహుశా మూర్తి గారు నా బాచ్ మేట్ కి క్లాస్ మేట అయ్యే ఉంటారు. కానీ ఆయన ప్రభువు ఆయన వద్ద నేను జీతగాడిని .అందుకని నేను చాల జాగ్రత్తగా మసులుకునే వాడిని. ఆయనకి నేను Prof . MN Rao కి చాలా దగ్గిరవాడినని తెలిసే ఆవకాశం లేదు.
ఆయన కూడా నా పట్ల గౌర భావం ఇతరుల వద్ద ప్రకటించేవారని వార్త .
నేను కాలేజీ లో చేరగానే "మనం next ప్రిన్సిపాలు ని వెతుక్కోనక్కరలేదు " అన్నారని , అది నచ్చని వారు, నేను బ్రాహ్మణ సంఘం పెట్టి దానికి president ను అయ్యానన్న ప్రచారానికి దిగారని విన్నాను. అయితే నేను ఆ ప్రమాదం వారికి లేకుండానే గీతం వదిలేసాను అని ఇంతకు ముందు ఒక సారి చెప్పాను
అదే కళాశాలలో ప్రయాగ సుబ్రహ్మణ్యం అనే ఆంగ్లో బోధకులు ఒకరు ఉండేవారు. ఆయన చాలామందికి నోట్లో నాలిక లాంటి వాడు. సాహిత్య పరిచయం ఉంది . ఇంగ్లీష్ బాగా వచ్చు. అవసరమైన వారికి మాట ( ఘోస్ట్) సాయం చేయ గలడు .
ఆయన ఒకరోజు నా వద్దకు వచ్చి " మేస్టారూ !మూర్తి గారు , కాలేజీ magazine తీసుకు వచ్చే బాధ్యత. మీ నెత్తి మీదా , నా నెత్తి మీదా పెట్టారు " అన్నాడు
"ఎంత బడ్జెట్ ? " అని అడిగాను .
" మనం ఎంత పోగేసుకోగలిగితే అంత "
" వారు కాలేజీ తరఫునుంచి ఏమీ ఇవ్వ రా ? "
" ఆయనకీ మీ ,నా కాంటాక్టుస్ పై గొప్ప నమ్మకం .అని చెప్పారు"
" అంటే ఇవ్వరన్న మాట !"
"అంతే మరి"
మేము ఆ magazine ప్రచురించిన కథా విధానం మరో ఎపిసోడ్ లో చెప్తాను . మూర్తి గారికి నా మీద ఉన్న అపార నమ్మకానికి ఇదే కాకుండా మరో నిదర్శనం కూడా ఉన్నది .
నేను పూర్వం పని చేసిన మొనాష్ యూనివర్సిటీ (Melbourne Australia ) నుంచి ఒక బృందం Privatisation of Urban Water Supplies అనే విషయం పై పెట్టిన ఒక సమావేశం లో విశాఖ పట్నం గురించి ,గీతం వారిని present చేయ మన్నారు
గీతం లో అప్పటికే ఆ విషయం లో నిష్ణాతులైన ఇద్దరు ఆచార్యులు అస్మద్గురు వరేణ్యులు ఉన్నారు .ఒకరు జగత్ విఖ్యాత శివాజీ రావు గారు. రెండో వారు M V వెంకట రావు గారు .నా నెత్తిన ఆ బరువు పడదనుకున్నాను నెత్తిన పెట్టుకోవటానికి శి వాజీ రావు గారు సంసిద్ధులై ఉన్నారు.. వెంకట రావు గారు visiting faculty . ఆయన అక్కడ ఆ సమయం లో లేరు . " మీకు ఆ శ్రమ వద్దు మీ శిష్యుడు శర్మ గారిని ప్రెసెంట్ చెయ్యమంటాను ఆయన Australia లో పని చేసి వచ్చాడు. పైగా బెంగళూరు Water supply and sewrage Board కి ఆయన ఒకప్పుడు పెద్ద కన్సల్టెంట్ కూడా కదా " అన్నారు మూర్తి గారు. మూర్తి గారికి నా గురించి ఎంత తెలుసు !నేనంటే ఎంత గౌరవము !తల వంచాను కిరీటం పెట్టేసారు .
మెల్లిగా వెంకట రావు గారి వద్దకు వెళ్లి ‘అచ్చిక బుచ్చికలాడి ‘ మచ్చిక చేసుకుని , నా నెత్తి మీద ఉన్న కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టేసాను ఆయనన జాయింట్ author గానే కాక ఫస్ట్ author గా ఉండటానికి కూడా ఒప్పుకున్నారు . .
వారి సమక్షం లో నేను present చేయటం శోభస్కరం గా ఉండదు పరువూ దక్కదు .అందుకని వారినే ప్రెసెంట్ చేయమని సభలో కోరాను .వచ్చిన Australians తో బంధుత్వం కలుపుకునే PR పనులు నేను చేసా ను .
అయితే కరపత్రం లో నాపేరు మాత్రమే పడింది పొరపాటున . దాంతో వార్తాపత్రికల్లో మర్నాడు కవన శర్మగారు బ్రహ్మాండం గా మాట్లాడారు అని వచ్చేసింది . మనకి వచ్చే పేరు ప్రతిష్ట లకి మనం బాధ్యులం కాం . పత్రికల వారిదే ఆ బాధ్యత !
ఇంకొక్క విషయం చెప్పాలి
మా ప్రిన్సిపాల్ Prof Ragam Pandu Ranga Natham గారికి 60 ఏళ్ళు నిండిన సందర్భం లో ( 1997) ఆయనగౌరవార్ధం ఒక నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆయన శిష్యులము అయిన నేను( KVN) ,మంగళం పల్లి లక్ష్మీ నరసింహం( MLN) అనే AU Prof. , జనార్దన రెడ్డి ( JR)అనే భీమవరం ప్రిన్సిపాల్ , అయ్యంకి మురళీ కృష్ణ( IVMK) అనే JNTU Prof నిర్ణయించు కున్నాము సెమినార్ ముగిసా క గురువుగారికి వారి పత్నికి చిన్న సన్మానం అనుకున్నాము దానికి అధ్యక్షులుగా MVS మూర్తి ( MVS )గారిని అనుకున్నాం.
నేను MLN , MVS గారిని కలుసుకోవడానికి appointment తీసుకుని పొద్దున్న 8 గంటలకు ఒక శుభ దినాన్న వారి ఇంటికి వెళ్ళాం. నేను వారి ఇంటికి వెళ్ళటం అదే మొదట సారి చివరి సారి.
మేడ మీద పెద్ద బాల్కనీ. ఆ బాల్కనీ లో అప్పటికే ఓ 20 మంది వారి కోసం వచ్చిన వారు నిరీక్షిస్తున్నారు మమ్మలిని అక్కడే కూర్చో పెట్టారు వారి సహాయకులు. ఒక పావు గంట గడిచాక మూర్తి గారు స్నాన పానాలు , అలంకరణలు ( అనుష్టానాలు ) ముగించుకుని వచ్చి సుఖాసీనులయ్యారు. నాకే నేను ఆ విధంగా ఆసీనుడనవటం సుఖంగా లేదు .ఎందుకంటే నేను కూర్చున్న బాల్కనీ కి ఆయన కూర్చున్న బాల్కనీ కి మధ్య పది గజాల దూరం ఉంది మధ్యలో ఆకాశం ఉంది .ఆయన కాసేపటికి ,జనతా దర్బార్ ముగించుకుని లేచి లోప లకి వెళ్లిపోయారు .నేను MLN లేచి బయటకు నడిచాము ఆయనతో మాట్లాడకుండానే. గేట్ దగ్గరకి వెళ్లే సరికి మా పక్కన MVS గారి కారు వచ్చి ఆగింది. . " ఏమిటిలా వచ్చారు ?" అని అడిగారు ఆయన మేము చెప్పాము
" ఏమిటి పిన్సిపాల్ గారు 60 నిండాయి కనక పని మానుకుని వెళ్లి పోతారా ? " అని అడిగారు.
MLN లౌక్యుడు .అతను అన్నాడు కదా " మీరు extension కి ఆజ్ఞ ఇస్తే ఆయన ఎల్లా కాదంటారు? ఈ సన్మానం మా ప్రేమ . మీరు ఆ సభ ని మీ ఆధ్వర్యం లో నడిపించాలి " అన్నాడు. ఆయన " సరే "అన్నారు
రెండు రోజుల పాటు Conference వైభవం గా జరిగింది . దానికి నా శిష్యులు ,ప్రొఫెసర్ లు బెంగళూరు నుంచి చాలామందే వచ్చి పేపర్లు ప్రెసెంట్ చేశారు .
సన్మాన సభ ప్రారంభమవటానికి కొద్దీ సమయమున్నది MVS గారింకా రాలేదు హైడ్రాలిక్స్ కి గురు వృద్ధులైన కొత్త కోటేశ్వర రావు( KK ) గారు సభ ముందు వరసలో కూర్చుని ఉన్నారు అధ్యక్షుల వారు వచ్చే వరకు . భీమవరం నుంచి వచ్చిన Hydraulics lecturer సుదర్శన రావు సభని రంజింపచేస్తాడు అనుమతి ఇమ్మని ఎవరో చెప్తే సరే అన్నాను .
సుదర్శన రావు అప్పటికే( 1993 కే ) మిస్టర్ పెళ్ళాం సినిమాలో పక్కింటి లావుపాటి పిన్నిగారి భర్తగా వేసి ఉన్నాడు ‘అంతా విష్ణు మాయ ‘ డైలాగ్ తో అందరికి తెలిసాడు
ఇతను ఆ తర్వాత JNTU లో నా శిష్యుడు IVMK వద్ద GIS వద్ద Ph.D చేసాడు అంటే నా ప్రశిష్యుడు
అతను భీమవరం లొనే ఉంటె ఐఈ పాటికి కనీసం 120000 రూ నెలకి సంపాదిస్తూ ఉండేవాడు . అది వదులుకుని ఇప్పుడు బోడి గుండు పంతులు వేషాలు వేస్తున్నాడు. అతని భార్య మహా సాధ్వి అయి ఉండాలి .ఆ విషయం పక్కన పెట్టి ఆ రోజు కథకి వస్తాను . అతను ప్రదర్శన లో ఒక రాజకీయ నాయకుడి సభ ఎలాఉంటుందో ప్రత్యక్షపురాణం చెప్తున్నాడు.
" అరుగో రెడ్డి గారు వస్తున్నారు. రండి రెడ్డి గారు వేదిక మీదకి వచ్చేయండి. ఆ చివర చౌదరీ గారు నిలబడి ఉన్నారు నాయుడూ ! ఆ యన్ని ఆయనతో పాటు ఒక కుర్చీని తెచ్చి వేదిక మీద వేసి కూర్చో పెట్టు . అరుగో మూర్తి గారు వచ్చారు ఇంకా సభ మొదలు పెట్టండి. అయ్యా మూర్తి గారూ ! మీరు రాకుండా సభ ఎలా మొదలుపెడతాం.పెట్టలేదు ఉత్తనే మైక్ టెస్ట్ చేస్తున్నాను " అన్నాడు
అందరు నవ్వుతుంటే సుదర్శన రావు నవ్వి వేదిక దిగి పోయాడు
సభ మొదలైందో లేదో మూర్తి గారికి కావలసిన ఒక పెద్దమనిషి సభకి వచ్చారు ;ఆయన సుదర్శన రావు మిమిక్రీ లో లాగా "రండి రావు గారు మీరు అక్కడ కాదు నా పక్కన వేదిక మీద కూర్చోండి " అన్నారు MVS గారు గొప్ప స్పోర్టివ్ గా .నవ్వుతూ
గీతం లో అందరికి హాస్య ప్రియత్వం ఉండటం నాకు చాలా నచ్చిన విషయం

Advertisements

Written by kavanasarma

June 16, 2018 at 5:20 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: