Several Ekaadasis
ఏకాదశి మహత్యము లేక గందర గోళము :
మనకు అమావాస్య నుంచి అమావాస్యకి 29.5 దినాలు ఒక చంద్ర మాసం.
ఆషాడ శు ద్ధ ఎకాదశి ( తొలి ఏకాదశి ) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చత్ర్మాసాలు ( నాలుగు చంద్ర మాసాలు జాగ్రత్తగా భోజనం చేయాల్సిన దినాలు. సాధారణంగా ఆషాడ మాసం ఆగస్ట్ లోను కార్తీకం నవంబర్లోను వస్తాయి.
మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అర్జునుడికి కృష్ణుడు గీత బోధించిన దినం అనగా గీతా జయంతి.
ఒక నెల తరవాత మాఘ మాస శుద్ధ ఏకాదశి నాడు భీష్ముడు చనిపోయిన దినం
సూర్యుడు మకర రేఖ దాటీ దినం మకర రేఖా సంక్రమణం సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే దినం మకర( రాశి ) సంక్రమణం
సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెల ధనుర్ మాసం
సూర్యుడు ఒకొక్క రాశిలో 30 పైచిలుకు దినాలు ఉండును
కురు సంగ్రామం జరిగిన దినాల్లో, మకర రేఖ దాటడం ఉత్తరాయణ ప్రారంభం , మకర రాశి సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం , ఒకే సారి జరిగేవి. ఇప్పుడు విషు చలనం ( భూమి అక్షం ,క్రాంతి వృత్తం కి లంబం గా ఉండక వంకరగా ఉండి తిరగటం ) వలన విడి విడి గా వస్తున్నాయి. మనం ఉత్తరాయణ పుణ్యకాలం గ గుర్తించేది మకర
(రాశి )సంక్రమణం ( సంక్రాంతి ) తరవాత . రేఖా సంక్రమణం తరవాత కాదు. !
ధనుర్మాసం లో వచ్చే శు ద్ధ ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అంటారు.
మన వాళ్ళ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అపారం
💐💐💐
lokanampriya
December 29, 2017 at 4:47 am