viswanaadha kathalu
‘చర్చ’ బృందం నవంబర్ నెల లో విశ్వనాధ వారి కథలని చర్చించ టానికి నిర్ణయించు కున్నారు. వివిన మూర్తి గారు 4 కథలని ఎంపిక చేసారు వాటిని పరిచయం చేయాల్సిన ఆచార్యులు చదలవాడ వెంకట రామ మోహన్ గారు అన్యపుణ్య కార్యం వలన రాలేక పోతున్నారు అందుకని పెద్దలు మరొకరు బాధ్యత వహించే దాకా నేను నా భుజాల మీదకు బరువు ఎత్తుకున్నాను . ఈ కథలు పూర్వం చదివినట్టు గుర్తు . మూర్తి గారు పంపాక మళ్ళి చదివాను. మళ్ళి అర్ధం కాలా! మోహన్ గారు చెప్తారు మూర్తి గారు విశదీక రిస్తారు , రజనికాంత్ గారు చర్చని కేంద్రీకరిస్తారు, అప్పుడు ఆలోచించ వచ్చు అనుకొన్నాను. .మోహన్ గారు అవసరానికి దాచుకున్న సెలవు పెట్టారు నేనే ఏదో అంటే పోలా! అనుకుని మళ్లీ చదివాను ఈ సారి శ్రద్ధగా . నారికేళపాకం అంటే అర్ధం తెలిసింది1. వ కథ జీవుడి ఇష్టం .: జీవుడు అంటే ఏమిటి ? ఈ ప్రశ్నకి అర్ధం తెలియాలని పించింది
2వ ఖథ. కపర్ది : కపర్ది ఎవరు ? సంస్కారి ? కట్టుబాట్లు దాటలేని పిరికి వాడు? కళా జీవి ? రసజ్ఞుదు? మధుర భాషణుడు ? తన మనుసులోని మాట చెప్పి ఒప్పించ లేనివాడు ?
3 వ కథ మాక్లి ద్ర్గం లో కుక్క: " రెండో తరం కుక్క సంవర్త మహర్షి " ఎవరీతడు ?ఈ కథలో ఆ కుక్క ని ఆయన తో ఎందుకు పోల్చాడు కవి/రచయిత ?
4. ముగ్గురు బిచ్చగాళ్ళు : ఈ ముగ్గురు ఎవరు ? చేతుల కుంటి ఏమిటి సూచిస్తోంది?
కొత్తగా వచ్చిన నాలుగో బిచ్చ గాడు అందరిలోకి తనే ఎందుకు గొప్ప వాడిని అనుకుంటున్నాడు ?
ఈ ప్రశ్నలు నాకు కలిగాయి . కొంత అర్ధం అయినట్టే యుండెను పూర్తిగా తెలియకుండెను అది నిద్రా ? మెలకువా ?తెలియకుండెను
చర్చ చివరలో నాకు తోచిన సమాధానాలు చెప్పాల్సి వస్తే చెప్తాను
కవన శర్మ
నవెంబర్ నెల చర్చా కార్యక్రమము
విశ్వనాథ వారి కథలు 0515 pm on 21-11-2015
దీపావళి వలన 14నుండి 21 న వాయిదా పడిన ఈ నెల చర్చా వేదిక, కారణాంతరాలవలన నేనురాలేని చర్చావేదిక, శ్రీ కవన శర్మగారి టపాతో అంతర్జాలంలో,శుభారంభంఅయ్యింది.చర్చ కు విస్తృత వేదిక లభ్యమైంది.
ఈ టపా ద్వారా నాకు కూడా పాలు పంచుకొనే అవకాశం దొరికింది.
1. జీవుడి ఇష్టం (28-03-1941)
జీవుడు(పుం.లింగం)అంటే ఆత్మcommon gender) అనుకుంటే సరిపోతుందేమో.
హిందూ మతం లో దేవతలకు ఆధ్య స్థానం ఇచ్చిన మనం స్త్రీ లో జీవుడి ఇష్టం గురించి అనుకోవడం అంత బాగా లేదు.
స్త్రీ అలమటించి చావాలనుకొని ఉరి పోసికొనలేదు(వేసుకొనలేదు అనడం సరిపోతుందేమో!)
అలాగే ‘డిటొ ప్రకారం జరిగి పోయిందీ -విశ్వనాథ వారి శైలికి నప్ప లెదు.
2.. కపర్ది : కపర్ది ఎవరు? కపర్ది శ్రీమంతుడు, కులీనుడు, విద్యావంతుడు,న్యాయవాది, కానీ, తనకంటే ఎంతో చిన్నదైన,అందమైన రోయి ఇంటి పిల్ల-మృణాలినిని మనసు పడి డబ్బు తో అనుభవించి, పెళ్ళికి కాని, ఆ పరిస్థితులనుండి,పిల్లను తప్పించను కూడా నిష్ఠగా ప్రయత్నించక, అకస్మాత్తుగా రెండేళ్ళ న్యాయవాద చదువు కు వెళ్ళిపోయి వదిలించుకున్న అల్ప మనస్కుడు. సాని ఇంటి పిల్లను ‘ఆమె’ అని కూడా పిలవకుండా ‘దాని’ అని మాత్రమే పిలిచే (కు)సంస్కారి. కపర్ది ఎవరు? నా జవాబు-కపటి. కానీ ఆమెకు పాశ్చాత్యుని సంపర్కం వల్ల పుట్టిన పిల్లవాడు, రోనాల్డుని ఆమె మరణాంతరం కొడుకు లాగ (అపరాధ భావన తో) దగ్గరకు తీస్తాడు, పెంచుకుంటాడు.
3. మాక్లీ దుర్గం లో కుక్క (01-08-1036)
విశ్వనాథవారి నాలుగుకథలలో,నాకు నచ్చిన కథ.అన్ని కథల కంటే ముందు ప్రచరించపడిన కథ.మాక్లీ దుర్గం అనే చిన్న రైల్వే స్టేషన్ లో కుక్క బ్రతుకు, కుక్క చావును గూర్చి అతి రమ్యం గా , కొండకొచో వ్యంగ్యంగా చిత్రీకరించిన కథ. మనుష్యుల మాట ఒక తీరు చేతలొక తీరు అని నొక్కి వక్కాణించిన కథ. వర్గ రహిత వర్ణ రహిత ప్రేమను కనీసం కుక్కలలో నైనా సరిగ్గా చూపించారు.వాటి మధ్య మొదటి చూపులో ప్రేమ,సంయోగం, దీనాతి దీనమైన వియోగం, చివరకు ఘోరాతి ఘోరమైన కుక్క చావు చిత్రీకరణలో విశ్వనాథ వారు నవ రసాలను పండించానరండంలో సందేహం లేదు. రెండవ తరం కుక్క తిరుగుబాటు భావాలతో ముందు తరానికి ఋణం తీర్చినట్ట్లుగా అనిపించింది. బృహస్పతి తమ్ముడు సంవర్తి ముని లా,ఎవరికీ తలవంచని పోలిక నిజంగా కొసమెరుపే.
4. ముగ్గురు బిచ్చగాళ్ళు:- (01-01-1951) అతి కష్టం మీద చదివి పుర్తి చేసిన కథ.నాలుగు కథలలో ఆఖరుగా ప్రచరింపపడిన కథ. రూపం, సారం నారికేళ పాకమే.భూమికలు అర్థ రహితం గా సాగుతాయి. యాచక వృత్తి నేపథ్యం లో రచయిత అభిప్రాయం ఇంచుకైనా భోధపడదు.భాష కొంచం కష్ట పెడుతుంది.చేయి కుంటి ఏమిటో, చేయి లేని అవిటి వాడిని కుంటి అని ఎలా అంటారు? ముగ్గురు
బిచ్చ గాళ్ల మీదకు నాలుగవ వాడు వచ్చి అందరికంటే గొప్పవాడని ప్రకటించడం ఎదురు చూడని మలుపు !!
పరమ చెత్త కథ అని అనకుండా ఉండలేక పోతున్నాను.
mohan
November 19, 2015 at 5:27 am