Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

15 October, 2018 14:08

పెద్ద బడి నుంచి చిన్న బళ్ళకి నా ప్రయాణం Trail of Kandula V N sarma from IISC to VITAM ( Rendo Vidatha 1978 to 1983 ) 1977 వరకు తెలుగు వారిలో డబ్బుండి తమ పిల్లలకు ఇంజనీరింగ్ చనువు కావాలనుకున్నవాఋ పిల్లలని కర్ణాటకా కి పంపేవారు. ఆ డబ్బు ఆంధ్రా లోనే ఉండి పోయేలా చేయాలన్న అన్న గొప్ప రాష్ట్ర భక్తి తో అప్పటి ప్రభుత్వం private ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవటానికి అనుమతులివ్వ సాగింది
1978 నుంచి 1981 వరకు గల మధ్య కాలం లో హైదరాబాద్ లో CBIT విశాఖ లో GITAM భీమవరం లో లో SBKR కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ , విజయవాడ చుట్టుపట్ల సిద్ధార్థ , కోనేరు లక్ష్మయ్య . మచిలీపట్టణం లో హిందూ Engineering కాలేజీ , బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ , వాకాడులో NBKR College అఫ్ ఇంజనీరింగ్ ఏర్పడ్డాయి
నేను1978 లో అప్పటి గీతం ప్రిన్సిపాల్ మా అన్న సహాధ్యాయి అయిన Prof MS Raju గారిని అడిగి లేదనిపించుకున్నాను. 1980 భీమవరం వారు ఉద్యోగం ఇస్తాం రమ్మంటే ఇంటర్ వ్యూ కి వెళ్ళాను .ఆ రాజుల కాలేజీ కి మళ్ళీ MS Raju గారు సలహా దారుడి హోదాలో వచ్చి అడ్డు పడ్డారు .
అప్పటి కింకా నేను IISc లో Assistan professor నే .అయితే అప్పటికే నాకు Ph.D వచ్చి పదేళ్లు దాటింది . ఆస్ట్రేలియా లోని మొనాష్ యూనివర్సిటీ లో 2 ఏళ్ళు University of West Indies లో ఒక సంవత్సరం ఉద్యోగం చేసి ఉన్నాను .అయినా రాజు గారు నన్ను వెనక్కి పెట్టారు .
1981 లో నేను IISc లోనే అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను 1800 జీతం మీద అది అన్నింటా పూర్తి ప్రొఫెసర్ లాంటి దే కాకపోతే 1500-2500 స్కేల్ ప్రొఫెసర్ కి, 1500- 2250 స్కేల్ Assoc Prof కి .
అప్పుడు మచిలీపట్టణం హిందూ కాలేజీ వారు ఇంటార్ వ్యూ కి నన్ను పిలిచారు .అక్కడ మొదటి ప్రిన్సిపాల్ గా మా IIT -KGP గురువు గారు Prof JVRao గారు ఉంది తన తరవాతి Principal ని వెతుక్కుంటున్నారు. నేను సెలెక్ట్ అయ్యాను
(రెండో విడత ఇంకా ఉన్నది )

Written by kavanasarma

October 15, 2018 at 2:08 pm

Posted in Uncategorized

%d bloggers like this: