Kavana Sarma Kaburlu

All Rights Reserved

Mono speech

leave a comment »

గీతం : వార్షికోత్సవాలు :కలాశాలల్లో వార్షికోత్సవాలకి సినిమా పాటలు పక్క వాయిద్యాల సహకారం తో పాడే బృందాలని పిలవటాలు ఏర్పడుతున్న రోజులు అవి . ఇప్పుడు ఆ పాటలకి అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులు చేయి చేయి కలిపి అడుగులు వేసే స్థాయికి ప్రాముఖ్యతని పొందాయి .
నెను 1995-96 విద్యాసంవత్సరం చివర జరిగిన వార్షికోత్సవం లో ఆ బృందం చేత పాడించటం కొన్ని పాటలు ఆ వాయిద్యాల సహకారం తో మా స్టూడెంసే పాడటం గమనించాను. 1996-97 చివరికి వచ్చే సరికి నాకు కనీసం సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ తో సాన్నిహిత్యం పెరిగింది కనక నేను మా వార్షికోత్సవానికి మరో ప్రణాళిక రచించాను
1. కేవలం విద్యార్థులే పాల్గొనేవి
2 మేష్టర్ల మాత్రమే పాల్గొనేవి
3. ఇద్దరూ కలిసి చేసేవి
ఈ మూడు కార్యకలాపాల్లోనూ సినిమా పాటలు తప్పని సరి. కానీ మూడు కలిపి 5.నుంచి 6 గంటల వరకు మిగిలినవి 6 నుంచి 7. 30వరకు మిగిలినవి.. సమయానుకూలంగా ,చల్లని పానీయాల తో తిళ్ళు తింటూ పాటలు వినటం
Testing సంపాదనలో నాకు వచ్చిన వాటాని .కళాశాల వారి వాటాని, విద్యార్థుల ఉత్సాహం వలన సమకూరిందాన్ని పోగేసి ఆ కార్య క్రమ నిర్వహించాను
ఇందులో మూడు కార్య క్రమాల గురించి చెప్తాను
1 ఒక విద్యార్థి ఇక పాత్రాభినయం : అతని పేరు గుర్తు లేదు కానీ , చాకు లాంటి వాడు .అతను వేసిన వేషం పల్లెటూర్లో పంచాయతీ ప్రెసిడెంట్ గా ఒక సారి చేసి తరవాతి ఎన్నికల్లో ఓడిపోయి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ చేసిన ఉపన్యాసం .
" నేను మనూరికి ఎన్నో గొప్ప సేవలు చేసాను. మనూళ్ళో కరంటు తీ గలు తగిలి సింవాచెలం సచ్చి పోయినప్పుడేటి చేసాను ?. వెంటనే మనూరికి కరెంటు రాకుండా ఆపించేసాను కదా ! .
యెర్ర బస్ గవర్ల గుంటడిని మట్టేసినప్పు డెంటనే బస్సులూర్లోకి రాకండా ఊరుకి 3మైళ్ళ అవతలే స్టాండెట్టించాను కదా
ఆ అప్పల్సామి గోడు నా మీన ఎప్పుడు ఎలా గెల్చినాడు ? నానో డిపోయినప్పుడు కదా! నానోడి పోనా ను కనక ఆడు గెలిసీసినాడు. ఏది ఏ ఎలచన్లో ఆయినా నేను గెల్సినప్పుడు , ఆడ్ని గెలిసి సూపమనండి. సూపడం ఆది తరం కాదు
మనూళ్ళో ఇంగిలీసు నాఅంత బాగా తె లిసినోడు ఇంకోడున్నాడా ! పైడి తల్లి ఆడి బామ్మరిది ఇచ్చిన టెలిగ్రాము ముందెట్టుకుని ఏడుస్తూ కూర్సున్నప్పుడు నానడిగేను "అందులో ఏటి రాసిందిరా " అని
"మదరిం లా ఎక్స్ పైరుడు అని అందిలో ఉందని తెచ్చిన బాబు సెప్పాడు బావో . నా బారె ఏడుపు ఆపించనేకపోతున్నాను బావో " అని బారు మన్నాడు
నాను ఆడికి అప్పుడు ఇడ మర్సీ సెప్పాను "ఓరి ఎర్రోడా మద రింలా ఎక్స్ అంటే నీ మాజీ అత్త అంటే నీ సచ్చిపోయిన బారె తల్లి అని రా అర్ధం అది పైరుడు అంటే జత కట్టేసిందనిరా అర్తం . " అని నేను సెప్పేసరికి " ముసలి ముండ కిప్పుడు మొగుడు కావాలిసొచ్చాడా !" అంటూ ఆ డూ ఆడి ఆలీ నవ్వుకుంటూ ఎల్పోనరు.దాయీ మన గే నం
అటుమంటి గేనిని మీ కట్ట సుకాలు సూ సేటోడిని .నాకే మీ వోటు "
( ఇంకా 2,3 కార్యకలాపాలగురించి త్వరలో )

Advertisements

Written by kavanasarma

June 23, 2018 at 12:26 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: