phonetic writng
మనం పలికినట్టు వ్రాస్తున్నామా ?
కందుల అని వ్రాస్తాం . కన్దుల అని పలుకుతాము. అందుకే ఇంగ్లీష్ లో Kandula అని వ్రాస్తాము
నండూరి అని వ్రాస్తాము నణ్డూరి అని పలుకుతాము దీనికి స్థాయి కరణ చేయబడిన ఇంగ్లిష్ spelling naNDUri
అచ్చుల్లో చిన్న అక్షరాలు హ్రస్వాలకి పెద్ద అక్షరాలు దీర్గాలకి వ్రాస్తాము .చిన్న అక్షరాలే రెండు సార్లు వ్రాయ వచ్చు.
పరుషాలకి Capitals సరళాలకి small letters వ్రాయటం ఆనవాయితీ
ఒక వర్గం చివరి అక్షరాలని అనుస్వారాలకి వాడాలి కానీ ఇప్పుడు అన్నింటికీ 0 ( పూర్ణానుస్వారమే ) వాడుతున్నాము దాన్ని పలకటానికి రెండుపెదిమలు మడిచి దగ్గర చేయాలి కానీ కందుల పలికి చూడండి. అప్పుడు పెదిమలు కలవవు మడత పడవు పంచాంగం అని వ్రాస్తాం కానీ పలికేది మాత్రం పఞ్చాఙ్గమ్ అని .మన పూర్వీకులు అల్లాగే వ్రాసేవారు ఇది ఇంగ్లీష్ లో స్థాయి కరించి వ్రాయాలంటే pa~nchaa~mgam అని వ్రాయాలి
అంటే మనం వ్రాసే భాష పలికినట్టు ఉండాలి అని చెప్తూనే అలా వ్రాయటం ఎన్నింటిలోనో చెయ్యం లేదు . రెండు చ జ , ర ల బదులు ఒక్కొక్కటే వాడుతున్నాము . ప్రతి వాళ్ళు వాడుక భాష వ్రాస్తున్నాము అని వాళ్లకి తోచినట్టు రాస్తూ డబాయిస్తూ ఉంటారు. గిడుగు వాడుక భాష వాడమని అంటే అర్ధం ప్రజలు వాడే పదాలు వాడ మని , అక్షరాలు పలుకుబడిని అనిసరించి ఉండాలని అంతే గాని అక్షరాలని తగ్గిస్తూ పొమ్మని కాదు. ఈశ శబ్దానికి ఈస లేక ఈష వాడమని కాదు అనుకుంటాను. వాడినా అయన పేరు చెప్పి వాడటం అన్యాయం అని అనుకుంటాను