viswanaadha vaari therachi raaju.
రమారమి 60 సంవత్సరముల క్రితం బుద్ధి వికసించని దినాలలో తెరచిరాజుధారావాహికంగా వస్తున్నప్పుడు చదివాను. 60 సంవత్సరాల తరవాత , మా ‘చర్చ గుంపు జనవరి 7, 2017 వ తేదీన భారతీయ విజ్ఞాన సంస్థాన్ లో చర్చించుటకు ఎన్నుకున్న సందర్భం లో తిరిగి చదువుతూ విశ్వనాధ వారి రచనలో ఉన్న పొరల లోతులు కొంత తెలుస్తూ ఉండటం లో విస్మయం పొందుతున్నాను. 1974 లో వారిని మా భారతీయ విజ్ఞాన్ సంస్థాన్ లో సభకి వచ్చినవారికి పరిచయం చేస్తూ ఆయన గొప్పతనం వివరిస్తూనే ఆయన రచనల్లో నాకు నచ్చని విషయాలు ఆయన సముఖంలో చెప్పాను. అప్పటికి ఇప్పటికి నచ్చని వాటి విషయం లో నా అభిప్రాయాలు మారలేదు. కానీ గొప్పతనం విషయం లో నా అవగాహన పెరిగింది . గౌరవం పెరిగింది ఆయన ఆ గ్రంథం లో మనస్సు , బుద్ధి , అంతఃకరణ , శుద్ధ సత్వం ఒకదాని కంటేఒకటి లోతైనవి అని చెప్పారు. .నేనింకా మనస్సు బుద్ధి దాటి లోతుగా వెళ్ళటం లేదేమో అన్న అనుమానం కలుగుతోంది
Leave a Reply