Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

Rachana August 2015 issue

ఆగష్టు 2015 రచన (ప్రత్యేక సంచిక ) బావున్ది. మహా ప్రస్థానానికి బాపు వేసిన బొమ్మలు బావున్నాయి చుడండి పాపం చలసాని చూడకుండా వెళ్లి పోయారు . చూసుంటే " శర్మ గారు అవి నిజం గా బావున్నాయా .ఆఅ తెలుసుకోవాలని అడుగుతున్నాను శ్రీ శ్రీ కి న్యాయం జరిగింది అంటారా/ " అని అమాయకం గ అడిగేవారు నా కథ విడుపు పట్టు అందులో ప్రచురించారు చదవండి వీలైతే
బాపు గారు నా ప్రస్తావన రెండు సార్లు తెచ్చారు ఆ సంచికలో ఒకటి మా కుటుంబానికి మెప్పు కృతజ్ఞతలు
రెండోది ఆయనకు అటువంటి వారే ఐన మరి కొందరు మిత్రులకు నాకు ఉన్న అభిప్రాయ భేదం
నవల అందరికి అర్థమయ్యే విధం గా ఉండాలి అన్న దానితో నాకు వారికి రెండు అభిప్రాయాలు లేవు
కాని అది ఒక శాస్త్రజ్ఞుడి ( యెల్లా ప్రేగడ ) జీవిత చరిత్ర ఐనప్పుడు రచన లో సైన్స్ వ్రాయకుండా వ్రాస్తే అది అబ్బూరి చాయాదేవి గారి రచన అవుతుంది చూడుడు
అందులో సైన్స్ పరి భాష వస్తే అది నా రచన అవుతుంది ఏ శాస్త్రీయ విషయం గురించి వ్రాసినా పరి భాష తప్పదు కదా పైగా తెలుగు ని సైన్స్ వ్రాయటానికి అనువు గా మార్చాలన్న నా , వేమూరి వారల ప్రయత్నం మాటో మాపిచ్చి మాకు ఆనందం
దానితో వారికి పరిచయం లేక పోవటం వారే అన్నట్టు ఆయనకీ ఇబ్బంది కలిగించింది వారు అబ్బూరి వారి రచన చదివితే సరిపోతుంది ఆవిడ్ అందరికి అర్థమయ్యేటట్టు వ్రాసారు . బాపు చదివే ఉంటారు
ఆయన నా రామ కాండం విషయం లోను విభేదించారు ఐనా పెద్ద మనసుతో ముఖ చిత్రం వేసారు ఆ విధంగా రంగనాయకమ్మ గారి కంటే నేను అదృష్టవంతుడిని విభేదిన్చినప్పుడు అవతల వాళ్ళని మాట్లాదనివ్వక పోవటానికి మేము పార్లమెంట్ లోని ఎన్నుకో బడ్డ సభ్యులం కాదు కదా బాపు కి బొలెదు మంచితనం ఇంకా బోలెడు నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి . అటువంటి వారే రక్త మాంసాలున్న మనుష్యులు

Written by kavanasarma

August 8, 2015 at 1:08 am

Posted in Uncategorized

%d bloggers like this: