Kavana Sarma Kaburlu

All Rights Reserved

Sahanam

leave a comment »

అరుంధతి అమ్మ వ్రాసిన లేఖలకి బాధ్యతగల పెద్ద ఉద్యోగం లో ఉన్న దోవల్ అయ్య ఇచ్చిన జవాబుకి మిత్రుల స్పందనలు చదివాక నా చిరు బుర్రకి తట్టిన అల్ప ఆలోచన
సలుపుతూ ఉంటె మహా మహా నాకే విసుగు వస్తుంది మసహాయం . అది తయారు చేయటానికి వలసిన సమాచారం సేకరించటానికి సమయం కోరాను. ఆ సమయం వారు ఇవ్వగలిగిన స్థితిలో లేరు. పట్టణాలకి , నా బోటి వారికి కొన్నీ సమస్యలు ఎదురౌతూ ఉంటాయి .నాలో ఒక ఆలోచనా విధానాన్ని సమర్ధించే ( మరో ఆలోచనా విధానాన్ని తిరస్కరించే ) మనిషి ఉంటాడు. అన్ని విషయాలలోనూ నా ఆలోచన విధానం , ఆచరణా రూపం దాల్చదు. ఆచరణ రూపం దాల్చినా, ఉద్యమ రూపం దాల్చదు . ఉదాహరణ కి నేను యుద్ధాన్ని సమర్ధించినా నేను గాని నా వాళ్ళు గాని ‘చక్రం పట్టటానికి కాని యుద్ధం చేయటం కానీ ‘ చెయ్యం . ఆ పని నేను ఉద్రేక పరిచిన వలనో , ఉపాధి కోసమో , సైన్యం లో చేరిన వాళ్లకి వదిలి పెడతాను. కొన్నింటిలో నేను ఉద్యమ కారుడిని. దాని వలన కొన్ని కస్టాలు పడటానికి సిద్ధపడ తాను. కొన్ని సార్లు కష్ట పడతాను కూడాను. ఇంతవరకు నేను ఒకవ్యక్తి గా ప్రవర్తిస్తాను.
కొన్ని సార్లు నేను ఒక నిపుణుడి గా ఒక దిశా నిర్దేశ నం చేయాల్సి వస్తుంది .లేక అధికారిగా ఒక నిర్ణయం అమలు చేయాల్సి వస్తుంది . ఇక్కడ నేను, నేను ఉంటున్న ఒక వ్యవస్థ అనే యంత్రం లో స్వ ఇచ్చ లేని ఒక భాగాన్ని .
అన్నింటిలోకి ఇబ్బంది అయినది ఇదే . అన్నీవిషయాలు రాజకీయ నాయకుల , పారిశ్రామిక వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల ప్రసక్తి ఉన్నవే కావు. ధర్మా ధర్మాల సూక్ష్మాలు ఉంటాయి . వ్యక్తులు రెండు వర్గాలుగా విడి పోయి వాదిస్తూ ఉంటారు. వారు చెరో వైపు నన్ను లాగుతూ ఉంటారు. అప్పుడు నేను అమలు లో ఉన్న నిబంధనల చట్రాలని అనుసరించి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎదో ఒక వర్గానికో, రెండు వర్గాలకి కూడానో నచ్చకుండా పోవటం తప్పని సరి .
నాకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇచ్చి ముందరికి వెళ్తాను . నా ఉద్యోగ రీ త్యా , "జలవనరులు -పర్యావరణం " విషయాలలో నన్ను నిపుణుడి గా సలహాలు అడగటం జరిగేది . అటువంటి సలహా నే ఒక విద్యుత్ ఉత్పాదనా సంస్థ . సలహా అనటం కంటే సహాయం అనటమే ధర్మం అనుకుంటా. అదేమిటంటే, ఒక చోట Thermal Power Plant పెట్టాలని అనుకుంటున్నారు. దానికి సమర్ధన గా Environmental Impact Assessment Statement తయారు చేయటం వారు నా నుంచి కోరుతున్న పల్లెలకి ,పరిశ్రమలకి , పంటలికి విద్యుత్ ఏ మాత్రం చాలటం లేదు . యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేయాల్సి ఉంది. లేక పోతే ప్రభుత్వానికి పుట్ట గతులు ఉండవు. ప్రభుతం ఉత్పాదనా సంస్థ పై ఒత్త్ఘిడి తెచ్చింది. వారు నా పై ఒత్తిడి పెట్టారు. నేను పని చేస్తున్న సంస్థ నుంచి వచ్చే నివేదిక , ఆ కాంట్రాక్టు సంపాదించ బోతున్న సంస్థ కి మేలు చేసే ఉద్దేశం తో కాక పర్యావరణానికి హాని చెయ్యని ఒక నిస్పక్ష పాత మైన విశ్వసనియమైన నివేదిక అయి ఉంటుందని ప్రజలు నమ్ముతారని ప్రభుత్వానికి తెలుసు. కాని అది తనకి అనుకూలమైనది అయి ఉండాలి. శం ఖం లో తీర్ధం పొయ్యాలి .
పర్యావరణానికి హాని చెయ్యని అభివృద్ది , తెల్లని కాకులు ఉండవు . ఎంతో గొప్ప అభివృద్ధికి తగు మాత్రపు హాని జరుగుతుందని నేను తేల్చి చెప్పాలి . నేను సమాచార సేకరణ విషయం లో నా పట్టు విడవ లేదు. అప్పుడు ఆ ఉత్పాదన సంస్థ చైర్మన్ నాకు తన కిందవారి ద్వారా కబురు పెట్టాడు ." AC s , Computers , Instruments etc. ,are very likely not to get continous supply of power in your labs and electric appliances including fans may work occassionally in your quarters until this project is completed. Please do not Complain. I will happily relax because I will have no work until this project gets started"
ఆ మాటల్లో ఆయన నిస్సహాయత , విసుగు ధ్వనిస్తున్నాయని గుర్తించాను. మిగిలిన కథ ఇక్కడ అనవసరం.
ఇది ఎందుకు చెప్తున్నానంటే దోవల్ గారు అరుంధతి రాయ్ గారికి ఇచ్చిన సమాధానంలో "విసిగి పోయిన తనం" నాకు ధ్వనించింది. ఆయన సౌమ్యంగా "{ తల్లీ! నాకు ఇంతకంటే గొప్పగా చెయ్యటం ఎలాగో తెలియదు. నికుత్లిస్తే ఒక నిర్మాణాత్మకం, సాధ్యం అయిన సూచనా చెయ్యి’ అని ఉంటె ఆ సుపుత్రుడి మనం అందరం మెచ్చుకునేవారిమి. కాని ఎవరైనా ఆపకుండా చెవిలో జోరీగల లాగ " ఇది బాగా లేదు అది బాగా లేదు’ అని మగ పెళ్లి వారిలా సణుగుతూ సలుపుతూ ఉంటె మహా మహా నాకే విసుగేస్తుంది . అందుకే నేను ఆయనని అర్ధం చేసుకున్నాను .మీరు కుడా చేసుకోవాలని నాకోరిక . ఆపైన మీ దయ దోవల్ ప్రాప్తం.

Advertisements

Written by kavanasarma

October 13, 2016 at 3:09 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: