Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

5 November, 2017 12:32

జోస్యుల విశ్వేశ్వర రావు గారి సన్నిధిలో గడిపే అదృష్టం నాకు మళ్లి ఒక 15 సంవత్సరాల తరవాత మచిలీపట్ణభం లో కలిగింది. 1981 -82 విద్యా మచిలీ పట్నం లో శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ లో మా గురువు గారిఅభిలాష ప్రకారం నేను ప్రొఫెసర్ గా చేరాను ఆ కళాశాల ఆ క్రితం సంవత్సరమే ప్రారంభమైంది . దానికి మొదటి ప్రిన్సిపాల్ మా గురువుగారు. ఆయన IIT లో రిటైర్ అయ్యాక అక్కడ చేరారు. ఆ కాలేజీ నా తప్పుకోవాలనిఆయన కోరిక
అక్కడ చేరాక ఆయనకీ చేదోడుగా ఉండి చాలా విషయాలు తెలుసుకున్నాను .
మొదటిది పని జరగటం ముఖ్యం అని , మనం పంతాలకు పోతే మన మీద ఆధారపడ్డ వాలు ఇబ్బంది పడతారని ఆయన చెప్పారు. ఆ దినాల్లో హిందూ విద్యా సంస్థలకి కార్య దర్శి దైతా మధుసూదన శాస్త్రి అన్న ఆయన . నాకు దూరపు బంధువు కూడా. కందుల వారి కుదురు మచిలీపట్నం మా తాతల ఇల్లు గొడుగు పేట లో ఉండేది నా చిన్నప్పుడు 1949 లో అమ్మేసుకున్నాము అక్కడ ఉద్యోగం లో చేరటానికి వాళ్ళు నాకు ఇవ్వతనానికి కారణం నేను ఆ మట్టికి మనవడిని అంటే grandson of the soil.
నేను డిసెంబర్ లో చేరాను . జనవరి జీతాలు రాలేదు 5 వ తారీకు వచ్చినా ." పద .సెక్రటరీ గారిని చూసి వద్దాం "అన్నారు . గుమ్మం లో జీతాలిచ్చే గుమాస్తా కనిపించారు. గురువు గారు " చెక్కులు రెడీ అయ్యాయా ?" అనిఅడిగాను . ఆయన "ఎప్పుడో " అని జవాబిచ్చారు.
లోపలి వెళ్ళాం. . శాస్త్రి గారి ముందు మంచి నీళ్లు ఆపైన కాఫీ, ఆ పైన త్రివేణి వక్కపొడి ఇచ్చి , ప్రిన్సిపాళ్లు గారిని వచ్చిన పని అడిగారు. ఇఇ యన చెప్పారు. శాస్త్రి గారు గుమాస్తాని పిలిచి . , చెక్కుల కోసం పెద్దవారు ప్రిన్సిపాల్ గారు రావాలా ? ఎన్ని సార్లు చెప్పినా నీకు బుద్ధిలేదు "అని దొబ్బులు పెట్టి అంతకుముందే వ్రాసి ఉంచిన చెక్కుల మీద సంతకా లు చేసి ఇచ్చారు .తిరిగి వస్తున్నపుడు గురువు గారు అన్నారు " మనం వెళ్తే గానిఆయన సంతకం పెట్టరు. మరి ఆలస్యం చేస్తే పాపం చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది "అన్నారు.
తరవాత నేను ప్రిన్సిపాల్ అయ్యాక పెంకితనానికి నేను ఎప్పుడైనా వెళ్ళాక పోతే జనం " మేష్టారు! జీతాలు రాలేదు " అనేవారు .అప్పుడు గురువుగారి మాటలు గుర్తుకు వచ్చి లెంపలు వేసుకుని వెళ్లి తదర్పిత కాఫీ వక్కపొడులు సేవించి చెక్కులు వెంట పెట్టుకుని వచ్చే వాడిని.
ఒక సారి శాస్త్రి గారు నన్ను ,రావు గారిని " మనం శాశ్వత భవనాలు నిర్మించాలా ? తాత్కాలికమైనవి నిర్మిద్దామా ? " అని ప్రశ్నించారు.
గురువుగారు,"ఆవెంటనే తాత్కాలికమైనవి కట్టేద్దాం. లాబ్స్ మొదలు పెట్టాలి కదా" అప్పుడు మాయా కళాశాల తాత్కాలిక పద్ధతిన హిందూ డిగ్రీ కళా శాల లో నడుస్తూ ఉండేది.
నాకు అది నచ్చక " వెంటనే శాశ్వతభావనాలకి పునాదులు వేద్దాం " అన్నాను
ఇంకా మా కాలేజీకి స్థలమే కొనలేదు. బేరాలువ ఓ పట్టాన తెగక , తాత్కాలిక షెడ్ల నిర్మాణం డిగ్రీ కళా శాల లోనే మొదలైంది . అప్పుడు గురువు గారు " ఆయన ప్రశ్న లోనే జవాబు ఉంది. నువ్వుల్లా అనకుండా ఉంటె ఈ పాటికి షెడ్లు పూర్తి అవును " అన్నారు అది ఆయన సునిశితమైన అవగాహనకి నిదర్శనం
I.I.T . చదివేరోజుల్లోఒక తెలుగు సహాధ్యాయికి గ్రేడ్స్ సరిగ్గా రాక ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. " నేను వారి ఇంటికి వెళ్లి " అతనికి మరో అవకాశం ఇమ్మని అడిగాను.
" మీరు వెళ్లి ఘోష్ గారి ని బతిమి లాడనుండి. ఆయన రికమెండ్ చేస్తే నేను ఒప్పుకున్నారు ఉంటె పని జరుగుతుంది. నేను చెప్తే పక్షపాతం అంటారు" అని ఉపదేశం చేశారు. ఆయనకి పని జరగటం ముఖ్యం నా కు లాబ్ లో పని జరగక పోతే నా బెంగాలీ గైడ్ కి చెప్పి చేయించుకోవాలని నాకు అపుడే అర్ధమైంది.
మేష్టారికి తెలుగు సినిమాలు అంటే ఇష్టం ఆయనతో రాధా కళ్యాణం ( రాధిక, చంద్ర మోహన్ ).చూసాను. 1965 లో ఒక సారి ఆయన మా IIScపని మీద బెంగళూరు , వచ్చినప్పుడు నాతో , "మా ఆవిడకి చీర కొనాలి నాథ్ రా" అన్నారు. సరే అని ఇద్దరం ఆటో లో బయలుదేరాం . మధ్య దారిలో ఆయనకీ NTR l లవ కుశ పోస్టర్ కనిపించింది. " ఆ సినిమా నేను చూడలేదు వెళదాం " అన్నారు .
నేను " మరి పిన్ని గారికి చీర కొనటం మాటో ? "అనిఅడిగాను
" చీరలు అన్ని చోట్లా దొరుకుతాయి. ఎన్ టి రామారావ్ సినిమాలు ఎప్పుడో గాని దొరకవు " అన్నారు.
ఆ రోజున ఆయన నన్ను ఏ ఖర్చు పెట్టనివ్వ లేదు. గురువు తండ్రి లాంటి వాడు కదా అనుకున్నాను. నాకు ఇప్పటికి నా శిష్యులు నా మీద ఖర్చు చేయటం ఇష్టం ఉండదు కానీ అప్పుడప్పుడు ఓడిపోతాను
మేష్టారిని ఒక సారి నా పుష్పక్ స్కూటర్ మీద మంగినపూడి బీచ్ కి ఆయన రానంటున్న నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకు వెళ్లి తీసుకు వస్తానని వాగ్దానం చేసి తీసికు వెళ్లాను తిరిగి వచ్చాక " చూసారు ఎంత జాగ్రత్తుగా తీసుకు వెళ్ళానో " అన్నాను
" నువ్వు జాగ్రత్తగా తీసుకు వెళ్ళటం అంటేఇలా ఉంటె మరి ఫాస్ట్ గా తీసుకు వీతం ఎలా ఉంటుందో అన్నారు" ఆ చురక అర్ధమై నేను నవ్వాక తాను చిరునవ్వు నవ్వారు.
ఒక అమెరికాకి కొడుకు ఉద్యగం వలన గ్రీన్ కార్డు తెచ్చుకుని అమెరికా వెళ్లి హాలిడే కి వచ్చిన ఆయన గురువుగారికి గ్రీన్ కార్డు గురించి బోధించాడు నేను ఉండాగా .ఆ పెద్ద మనిషి వెళ్ళాక "ఏమి తెలియనట్టు అంత సేపు ఎలా విన్నారు ?’ అని అడిగాను.
‘ పాపం ఆయన కి తాను సంపాదించుకున్న ఉద్యోగం ఎంతో ఆనందం ఇచ్చింది. . మనం మన విజి టింగ్ ఉద్యోగాలు గురించి అలాగే చెప్పుకుంటామేమో ! ": అన్నారు.
ఆయనకీ కాలేజీ లో కవి గారు అన్న పేరు ఉండేది .ఆ తరవాత తెలిసింది ఆయనని ఐ కుర్ర కుంకాలు కానీ పింఛని వినిపించని ప్రిన్సిపాల్ అంటున్నారని
తమిళ నాడు లోని పూండి హైడ్రాలిక్స్ లాబ్ లో ఒక విభాగానికి జె.వి.రావ్ .
అన్న పేరు పెట్టారు అని తెలియని అమాయకులు కదా విద్యార్థులు అనుకున్నాను
ఈ కారణం చేత ఆయనకీ ఆరోగ్యం సరిగా ఉండక పోవటం చేత వారి పేరు మీద నేనే పని చేసేవాడిని.
కానీ చివర్లో ఆయనకీ బాగా జ్వరం వచ్చింది. విశాఖలో ఉన్న పిన్నిగారు ఉద్యోగం మానేసి వచ్చేయమంటారు ఈయన వెళ్లరు అడిగాను " నేను చూసుకుంటున్నాను కదా . మీరు కొన్నాలు వెళ్లి రండి "అన్నాను.
‘ ఇక్కడ జ్వరం ఒకటే అక్కడ ఆవిడ సొద కూడా వినాలి " అన్నారు
ప్రతి ఆచార్యుడి వెనక అమాయకుడైన తన భర్తని ప్రపంచం exploit చేస్తుంది" అని గాఢం గా నమ్మే ఆయన భార్య ఉంటుంది అని నాకు తెలుసు. నేను మూడో తరం గురువుని కదా !
మొదట్లో ఆయన తాను అమాయకుడేమి కాదని చెప్పబోయి ఉంటారు. ఆవిడ విని ఉండదు. నేను విదార్థిగా ఉన్నప్పుడు మా అక్కకి పెళ్లి అయింది. గురుపత్ని ‘ " ఎంత కట్నం ఇచ్చారు ఏమిటి? ‘ అని అడిగింది. ఏమి చెప్పను " లేదు ఏమి ఇవ్వలేదు అన్నాను "
ఆవిడ వెంటనే మీరు వెతికితే మనకి అల్లాంటి సంబంధాలు దొరకవా మన అమ్మాయిలకి" అంది మేష్టారు. " ఇచ్చిన వాళ్ళు చెప్పారు " అన్నారు. ఆవిడ వాదన వదల లేదు ఈయన వెంటనే మెషిన్ తీసి పడేసారు .
" మేష్టారు . మీరు వినే ఉంటారు . మీరు ఇంటికి వెళ్ళగానే చెవి మెషిన్ ఆపేసి పుస్తకం పట్టుకుంటారని , IIT స్టూడెంట్స్ చెప్పుకునే వారని " అన్నాను ఆయన చిరు నవ్వు నవ్వి ఊరుకున్నారు.
మా సెక్రటరీ శాస్త్రిగారు నాకు కబురు పెట్టారు వెళ్ళాను" ఈయన వెళ్లారు . ఆవిడ నాకు ఫోన్ చేసి జ్వరం వచ్చిన మనిషి చేత కూడా పని చేయించుకుంటున్నారా ? " అని దఅడుగుతోంది ". అన్నారు.
ఆ తరవాత ఇద్ద రామ్ ఆయనని ఒప్పించి ఘనం గా సన్మానం చేసి ఇంటికి పంపించాము. అదే ఆయనని నేను చివరి సారి చూసింది.
సాగర్ రూప శిల్పి. ఐ.ఐ.టి వ్యవస్థాపక సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు , SVHCE కి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ , పూండి హైడ్రాలిక్స్ ల్యాబ్ నిర్దేశకుడు , తెలుగు విజ్ఞాన సర్వస్వము లో హైడ్రాలిక్స్ శాఖ గురించి వ్రాసిన వాడు బహు శాస్త్ర పరిశోధనా పత్రాలు ప్రచురించిన వాడు అయినా విశ్వేశ్వర శర్మ శిష్యహ్ అహంభో అభివాదయేత్

Written by kavanasarma

November 5, 2017 at 12:32 pm

Posted in Uncategorized

%d bloggers like this: