Kavana Sarma Kaburlu

All Rights Reserved

చైతన్యం -మాస పత్రికలో న రచనలు

leave a comment »

జూన్ 2012 నుంచి మార్చ్ 2018 వరకు చతన్యం మాస పత్రికలో వచ్చిన నా రచనలని ఆ పత్రిక సంపాదకుల చక్కగా పుస్తక రూపం లో బైండ్ చేసి నాకు బహూకరించారు . అందులో దక్ష కథ ప్రాస్పెక్ట్స్ అనే రెండుకథలు
మన ప్రాచీన విజ్ఞానం పై 7 వ్యాసాలూ
నమూనా నిర్మాణాలు ( Buiding mdls ) ఒక వ్యాసం
వెలుగు పయనం పై 9 వ్యాసాలు
జల శాస్త్రం ( Hydraulics ) పై 10 వ్యాసాలూ
పరిమాణిక సిద్ధాంతం ( Quantum Theory ) పై 8 వ్యాసాలు
రసాయన శాస్త్రం పై 5 వ్యాసాలు
ఉన్నాయి
సంపాదకులు తీగవరపు శాంతి ,ప్రసాద్ దంపతులకి కృతజ్ఞతలు

Advertisements

Written by kavanasarma

May 19, 2018 at 11:18 am

Posted in Uncategorized

Haindava Tharka SAsthra Parichayam by Kandula Nagabhushanam

leave a comment »

మా తండ్రి గారి వ్యాసం గర్వం తో పెడుతున్నాను క వ న శర్మ

HaindavaTarkaSastramu (1).pdf

Written by kavanasarma

May 18, 2018 at 11:22 am

Posted in Uncategorized

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

6 మన విజ్ఞానం :
మనప్రాచీన విజ్ఞానం గురించిన నా అవాగాహన తో ముగిస్తాను
కొంతమంది " మనప్రాచీనులకి ఆధునిక విజ్ఞానం కూడా తెలుసు. వారి వ్రాతలు అర్థం చేసుకోగలిగితే ఆ జ్ఞానం కూడా మనకి తెలుస్తుంది " అం టారు. ప్రాచీనులకి తెలిసి ఆధునిక విజ్ఞానం ఏమిటో వీరికీ తెలియకపోవచ్చును
కొంత మంది "మనవారికి తెలిసింది బహు తక్కువ .అందులోను వారు వారి సమకాలికులు నుంచి తెలుసుకున్నది ఎక్కువ . వారికి ఎం తో తెలుసు అనుకోవటం మన అమాయకత్వం" అని చెప్తారు . వీరు మన ప్రాచీనులకి ఏమి తెలుసునో తెలుసుకోవటానికి స్వయంగా ఏ ప్రయత్నం చేయకుండా ఇతరులు అన్న మాటలు చిలక పలుకుల్లా తిరిగి మనకి చెప్తారు
అందుకని నేను "మన వారికి ఏమి తెలుసును?" అన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోవటానికి కొంచెం కష్టమైన ప్రయత్నమే చేసాను
ఆ ప్రయత్న ఫలితం గా నాకు తెలిసి విషయాలను నాగసూరి వారు అడిగితే పంపాను .వారు హైదరాబాద్ AIR నుంచి ప్రసారం చేశారు .ఆపైన చైతన్యం అనే పత్రిక , నా ప్రసంగ వ్యాసాల ఆధారం గా నేను వ్రాసిన వ్యాసాలు ప్రచురించింది .అవి
www. chaitanyam.net లో కుతూహలం ఉన్నవారు చదవ వచ్చు
1. మానప్రాచీన విజ్ఞానానికి మూలాధార గ్రంథాలు జులై 2012
2. ప్రాచీన గణిత శాస్త్రం ఆగస్టు 12
3.ఖగోళ శాస్త్రము సెప్టెంబర్ 12
4 మన ప్రాచీన వైద్య శాస్త్రం అక్టోబర్ 12
5. గృహ పుర నిర్మాణ విజ్ఞానం నవంబర్ 12
6.ప్రాచీన రసాయన శాస్త్రం డిసెంబర్ 12
7. వ్యవసాయానికి సంబంధించిన విజ్ఞానం జనవరి 2013
8 మన ప్రాచీన వృక్ష జంతు లోహ శాస్త్రాలు ఫిబ్రవరి 13
9. ఆధునికానంతరం సైన్స్ కి మన ప్రాచీన విజ్ఞానపు పునాదులు మార్చ్ 13
నా అవగాహనలు మొత్తం సమాప్తం

Written by kavanasarma

May 8, 2018 at 1:50 am

Posted in Uncategorized

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన 5 మన చరిత్ర

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

5 మన చరిత్ర ( కొనసాగింపు -7)
కల్హణుడు :
రాజతరంగిణి వ్రాసిన కల్హణుడు శాలివాహన శకం 1070 కి అంటే సా. శ . 1148

చెందిన వాడు . అతను కాశ్మీరు రాజులలో ఒకడైన ఒకటవ గోనందుడు భారతకాలం లో లౌకికాబ్దం బలరాముడు చేత చంపబడ్డాడని , ఒకటవ గో నందుడికి 3 వ గోనందుడికి మధ్య 52 రాజులు 1266 సంవత్సరాలు పరిపాలించారని ( ఒక ఉజ్జాయింపు లెక్క ) , తనకి 3 వ గోనందుడికి మధ్య 2330 సంవత్సరాలు ( ఆధారం తెలియదు ఉజ్జాయింపు లెక్కే అనుకుంటాను ) ఒక వార ఉన్నదని వ్రాసాడు అంటే బలరాముడు ఒకటవ గొనందుడిని చంపిన సంవత్సరం సా. శ . పూ. 2448 . అతని లెక్క ప్రకారం భారత యుద్ధం జరిగినది ఉజ్జాయింపుగా సా. శ . పూ . 2550. అతని ప్రకారం కలి, ఒకటవ గొనందుడు మరణానికి ముందు 653 సంవత్సరాలకి పూర్వ మొదలైంది అంటే సా. శ. పూ. 3101
బౌద్ధ ఆరామాలని ‘ హిందువులు ‘ ధ్వంసం చేసా రని మనం వింటూ ఉంటాం . బౌద్ధులు , బౌద్ధ రాజుల పాలన లో కాశ్మీరం లో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేశారని ,కల్హణుడు వ్రాయటం గమనార్హం .

శాతకర్ణులు :
శాతకర్ణులు బౌద్ధులు. వారి తరవాత పరిపాలించిన ‘హిందూ’ రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద ప్రారంభమైన శకాన్ని పట్టించుకోలేదని నమ్మటం సులభం విక్రమాదిత్యుడి కాలం కి చెందిన వరాహ మిహిరుడు తన కాలంలోవాడకం లో ఉన్న శకం భారత యుద్ధానంతరం 2526 సంవత్సరాలకి మొదలైంది అని చెప్పాడు అంటే సా . శ . పూ . 612 లో మొదలైంది అన్నమాట . అది శాతకర్ణుల శకం అయి ఉంటుంది అన్నది నా ఊహ .
శాతకర్ణి శకానికి, శాలివాహన శకానికి మధ్య ఉన్న తేడా 690 సంవత్సరాలు . కల్హణుడు, ఆల్ బెరునీ లు ఈ రెండు శాకాలని ఒకటిగా తీసుకోవటం వలన మన చరిత్రకి సంబంధించిన తేదీల నిర్ణయం లో 700 సంవత్సరాల గందర గోళం ఏర్పడింది అని నా ఊహ .
మెగస్తనీస్( సా . శ . పూ. 350 చుట్టుపట్ల ) ప్రకారం ఆంధ్ర రా జులకి 30 కోట లు ( అందులో దొరికిన ధూళికట్ట ఒకటి )పెద్ద సైన్యం ఉన్నాయి . శాతకర్ణులు ఆంధ్రులు . బహుశ వారు సా. శ . పూ. 800 నుంచి 380 వరకు మగదని పాలించి ఉంటారు.
కల్హణుడు తనకి 3 గోవిందుడి మధ్య ఉన్నఉన్న కాలవ్యవధి ని 2330 సంవత్సరాలుగా ఎలా లెక్క కట్టడో తెలియదు . ఆ కాలం 3000 సంవత్సరాలు అయినా అవవచ్చును .
వరాహ మిహిరుడు:
ఇతను విక్రమార్కుడి కాలం వాడు . అది యదార్థ సమాచారం . అందుచేత నేను అతని రచన కాలం సా. శ .పూ . 60-70 ల మధ్య కాలం గా ఊహిస్తున్నాను .
ఆహార్ గణాలు లెక్క పెట్టె ఆధార కాలం తానున్న శక కాలం లోంచి 427 తీసి వేస్తే వస్తుంది అని మాత్రమే వరాహ మిహిరుడు వ్రాసాడు .దానికి భాష్యం చెప్పిన వారు అతని కాలం 427+ 78 ( సా. శ . 505 ) అని చెప్పారు . ఇది విస్తరించాలంటే కరణ గ్రంథాల గురించి చెప్పాలి . కరణ గ్రంథాలలో సృష్టి మొదలైనప్పటినుచి అయిన పగళ్లు లెక్క కట్టటం ఉంటుంది. ఉదాహరణకి సా. శ .పూ. 3102 ఒక ఆధార సంవత్సరం . మరోటి సా. శ . 1900 . అతను చెప్పిన ఆధార సంవత్సరం శాతకర్ణి శక సంవత్సరం542 – 552 ల మధ్యది అయి ఉండ వచ్చు ఇది ఊహ మాత్రమే .
మహా గుప్తులు :
వీరు శాతకర్ణులకి ప్రమర వంశీయులకు మధ్య కాలం లో మగధ ని పాలించి ఉంటారు ఆంటే వీరు సా శ .పూ . 380 కి 100 కి మధ్య పాలించిన వారు అయి ఉంటారు . వ్ గుప్తా చంద్ర గుప్తుడు అలెగ్జాండర్ కి సమకాలీకుడై ఉండ వచ్చు
మన చరిత్రలో సా. శ . పూ . 800 నుంచి సా . శ . 78 వరకు

అతి గందర గోళానికి చెందిన కాలం

ఈ కాలం గురించి ఎవరు వ్రాసినా యదార్థ సమాచారం తక్కువా ఊహ ఎక్కువా .
ఇది నా ఊహ.
( మన ప్రాచీన చరిత్ర పై నా అవగాహన వ్రాయటం పూర్తి అయింది )

Written by kavanasarma

May 7, 2018 at 4:08 pm

Posted in Uncategorized

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

5 మన చరిత్ర ( కొనసాగింపు -6)
భారత యుద్ధానంతరం కూడా ,మథురని కంసుడి వంశం ,మగధని బృహద్రథుడి ( జరాసంధుడు తండ్రి ) వంశం పాలించాయి ధర్మరాజు తన పాలనని హస్తినకు పరిమితం చేసుకున్నాడు .
కలి ప్రారంభాన్ని 3102 BCE గా స్వీకరిస్తే ,మత్స్య పురాణం ప్రకారం మగధ ని పాలించిన మనం వివిధ వంశాల పాలనా కాలాలని ఈ విధంగా నిర్ణయించవచ్చు .

వంశం సా. శ .(BCE )
బార్హద్రథులు ( జరాసంధుని తో మొదలు ) 1006 సం . 3160- 2130
ప్రద్యోతనులు ( వీరిలో నంది వర్ధనుడు ఒకడు ) 138 సం 2130-1992
శిశునాగులు 362 సం . 1992-1630
నందు లు

( వీరిలో మహాపద్మనందుడు ఒకడు ) 100 సం 1630-1530
మౌర్యులు (12 మంది)* 316 సం 1530-1220
* మౌర్యులు నంద వంశ పాలన అంతమవక ముందే స్వతంత్రం ప్రకటించుకుని మగధ ని హస్త గతం చేసుకున్నారు .వీరిలో మొదటి వాడు చంద్రగుప్తుడు.మౌర్యులలో అశోకుడు ఒకడు . శాక్య బుద్ధుడు**, అశోకుడికి 300 సంవత్సరాలు ముందు వాడు )
శుంగులు (సుంగులు ) 300 సం 1220-920
కణ్వజులు 100 సం 920-820
**పాహియాన్ చైనా రాజైన పింగ్ వాంగ్ ( 770-719 BCE గా ఊహించబడుతున్న ) ఆస్థానం లో వాడు .అతని ప్రకారం బుద్ధుడు నిర్వాణం పొందాక 300 సంవత్సారాలకు మై త్రాయణ బోధి సత్వుడి విగ్రహం స్థాపింప బడింది అంటే బుద్ధుడు కనీసం 1100 BCE కాలం వాడు

ఇంకా నిర్ధారించవలసింది 820 BCE నుంచి 78 CE వరకు .ఈ విషయం లో మనకి పనికి వచ్చే సమాచారం విక్రమ ఆదిత్యుడి ( లేక అర్కుడి ) గురించి అందు బాటులో ఉన్న సమాచారం . భవిష్య పురాణం ప్రకారం ఇతడు కలి 3001 ( 102 BCE ) లో జన్మించి 19 సంవత్సరాల ప్రాయం ( 83 BCE ) లో 32 మూర్తుల ( సాల భంజికల) సింహాసనాన్ని అధిష్టించాడు .
నేపాళ దేశం వెళ్ళటం , అతని శకం ప్రారంభ మవటం 58 BCE . మరణం 19 CE
విక్రమార్కుడి ఆస్థానం లోని నవరత్నాలుగా పరిగణించ బడిన వారిలో కాళిదాసు ,వరాహ మిహిరుడు ,వేతాళుడు,ధన్వంతరి , లు ఉన్నారు . కాళిదాసు తన జ్యోతిర్విదా భరణం వ్రాయటం కలి 3068 ( 34 BCE ) వైశాఖ మాసం లో మొదలై కార్తీక మాసం లో పూర్తి అయింది అని చెప్పుకున్నాడు . విక్రమ శకం, 58 BCE లో మొదలై నట్టు నేపాళవంశావళిలో ఉంది .కల్హణుడు తన రాజ తరంగిణి లో విక్రమార్కుడు తన మంత్రి మాతృ గుప్తుడిని రాజులేని కాశ్మీరానికి కలి 3115 ( 13 CE ) లో రాజు చేసి నట్టు చెప్పాడు
ఇతని యుగం కలి 3179 (77 CE ) లో అంతమవుతుంది ( అయింది అదో రచనా సంప్రదాయం ) అని సిద్ధాంత శిరోమణి కాలమానాధ్యాయమ లో ఉన్నది . ఇది రమా రమి శాలివాహన శకానికి సరి పోతుంది ( శ కులని గెలిచిన వారి పేరున లేక వారిని గెలిచిన వారి మీద గెలిచిన రాజుల పేరుతో ఒక కొత్త శకం శకం ఆరంభం అవుతుంది ).
విక్రమార్కుడి మరణానంతరం ధారా నగర( ఉజ్జయినికి పక్కనే ఉన్న చిన్న ఊరు )రాజు భోజుడు వరాహ మిహిరుడిని ,అప్పటికె తాగుబోతుగా మారిన కాళిదాసుని ,తన ఆస్థానం లో పెట్టుకున్నాడు. సాలభంజికలు కల సింహాసనాన్ని ఎక్క బోయిన కథలు చాలా ప్రాచుర్యం పొందాయి .ఇతను విక్రమార్కుడి అంత గొప్ప వాడు కాదని ఈ కథలు చెప్తాయి .. భవిష్య పురాణం ప్రకారం ప్రమర వంశం లో విక్రమార్కుడు 8 వ రాజు , శాలి వాహనుడు 11 వ రాజు . ఈ వంశీయులు కలి 2710 ( 398 BCE ) నుంచి 4295 ( 1193 CE ) వరకు 1585 సంవత్సరాలు పరిపాలించారు.
విక్రమార్కుడి కొడుకు బలహీనుడు అతనిని శ కులు ఓడించారు . ఆపైన శ కులను చైనీయులను ,తర్తారులను శాలివాహనుడు ఓడించి శక కర్త అయ్యాడు .
800 BCE నుంచి 400 BCE వరకు పాలించిన వారిలో శాత కర్ణులు ఉన్నారు ,మొదటి మాహా గుప్తులు ( వారిలో సముద్ర గుప్తుడు ఒకడు ) ఉన్నారు గుప్తులు బలహీన పడ్డాక ప్ర మర వంశీయులు 100 BCE లో బల పడ్డారు. ఈ విశేషాలతోను వరాహ మిహిరుడి కాల నిర్ణయం గురించి తరవాతి వ్యాసం లో .( సశేషం )

Written by kavanasarma

May 6, 2018 at 11:34 pm

Posted in Uncategorized

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

5 మన చరిత్ర ( కొనసాగింపు -5)
రాముని కాలం ;
Institute for Scientific Research on Vedas ( !- SERVE) అన్న సంస్థకి పని చేసే పుష్కర్ భట్నగర్ అనే ఆయన రాముని జన్మ సమయం 5114 BCE జనవరి 10 వ తేదీ మధ్యాహ్నం 12. 30 గంటలకు జరిగినట్టుగా నిర్ధారించాడు . దానికి ఆధారం వాల్మీకి రామాయణం లో ఉన్న ఈ వాక్యాలు ." 12 వ నెల అయిన చై త్ర మాసం లో ,నవమి తిథి నాడు కర్కాటక లగ్నానికి చెందిన పునర్వసు నక్షత్రం లో కౌసల్య రాముడిని కన్నది. ఆ సమయం లో అయిదు గ్రహాలు తమ స్వ , ఉచ్చ స్థానం ల్లో ఉన్నాయి. గురు గ్రహం ఉదయిస్తున్న సమయం అది. "
(కర్కాటక రాశి , పునర్వసు 4 వపాదం నుంచి ఆశ్లేషా నక్షత్రం చివరి వరకు వ్యాపించి ఉంటుంది . ఛాయాగ్రహాలు మినహాయించి మిగిలిన 7 గ్రహాలలో 5 గ్రహాలు స్వ ఉచ్ఛం ల్లో ఉన్నాయని గ్రహించాలి)
నా వద్ద ఉన్న 60 సంవత్సరాల పంచాంగం ని కుతూహలం తో శ్రీరామ నవమి నాటి గ్రహ స్థితు లు ఏవిధం గా ఉన్నాయని సంప్రదించాను అందులో 1956 CE ఏప్రిల్ 19 న వచ్చిన శ్రీ రామ నవమి నాడు ఉన్న గ్రహ స్థితి ఈ విధము గా ఉన్నది

చంద్రుడు స్వస్థానం అయిన కర్కాటక రాశి లో ఉన్నాడు
రవి మేష రాశి లో ఉచ్ఛం లో ఉన్నాడు.
గురుడు కర్కాటక రాశి లో ఉచ్ఛం లో ఉన్నాడు
శుక్రు డు స్వస్థానమైన వృషభ రాశి లో ఉన్నాడు

కుజుడు మకర రాశి లో ఉచ్ఛం లో ఉన్నాడు
ఆమాసం చై త్ర మాసం
ఆ తిథి నవమి
కర్కాటక రాశి పొద్దున్న 11.30 గం . కి ఉదయించి 1. 30 . గం .వరకు ఉన్నది
అంతా బాగానేవుంది కానీ ఆనాడు నక్షత్రం పునర్వసు కాదు ఆశ్లేష
అంటే వాల్మీకి చెప్పిన 9 లో 8 నప్పాయి .ఒకటి నప్పలేదు
అంటే ఇది రామునిజాతక చక్రం కి ఇది రమా రమి గా సరిపోతుంది కానీ పూర్తిగా కాదు
రాముడు సీతా తమ వనవాసం లో ముసలి వగ్గులుగా ఉన్న అత్రి అనసూయలని వెళ్లి చూసారని రామాయణం లో ఉన్నది. వారు 200 సంవత్సరాల కి మించి బతకలేదు అ ని మనం ఒక ‘ఊహన’ చేస్తే ,రాముని కాలం లో ఉన్నవశిష్ఠుడి ముని మనవడైన వ్యాసుడు ,కృష్ణుడికి తాత వయస్సువాడు కనక ,శత్రుఘ్నుని భార్య శ్రుతకీర్తి వసుదేవుని సోదరి శ్రుతకీర్తి కి నాయనమ్మ కి నాయనమ్మ అయి ఉంటుం ద నుకుంటే , అంతా సరిపోతుంది ఒక భట్నగర్ ప్రతిపాదించిన 5114సంవత్సరం తప్ప .
నేను కుతూహలం తో పరిశీలించి గ్రహించినది రమా రమి జాతక ఆవృత్తి కాలం 748 సంవత్సరాలు అంటే 3280 BCE కూడా రాముని జన్మ సంవత్సరం అయి ఉండ వచ్చు అంటే రాముని కంటే కృష్ణుడు 90 ఏళ్ళు చిన్న వాడు అవుతాడు . అలా కాక రాముని జన్మ కాలం 4028 BCE అయితే రాముని తరవాత 838 సంవత్సరాల కి కృష్ణుడు పుట్టాడు అనుకోవాల్సి వస్తుంది .

వశిష్ఠుడు మొదలైన ఋషులు మరింత కాలం జీవించి ఉంటారు అనుకోవాల్సి వస్తుంది.
ఏది ఏమైనా రాముడికి కృష్ణుడికి పెద్ద వార లేదనుకోవటం నాకు ఉచిత మైన ఊహ గా అనిపిస్తుంది. అప్పుడు మనం నమ్మ శక్యం కాని వాటిని సమర్ధించుకోనక్కర లేదు.

Written by kavanasarma

May 5, 2018 at 11:32 pm

Posted in Uncategorized

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

5మన చరిత్ర ( కొనసాగింపు -4 )

కలి ప్రారంభం :
భారత దేశ చరిత్రలో కలియుగ ప్రారంభానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. లిఖిత మౌఖిక చరిత్రల్లో సంఘటనలకి ఆధా రాలు కలియుగం ప్రారంభం అయ్యాక ‘ఇన్ని’ సంవత్సరాలు గడిచాక అని ఉంటాయి కలియుగ ప్రారంభం ఎప్పుడైనదో నిర్ణయించటానికి మన గ్రంథాలలో ఉన్న ఖగోళ సమాచారం సహాయకారిగా ఉంటుంది.
మన ప్రాచీన రచయితలు గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞులు .ఈ విషయాన్నీ పశ్చాత్త్య indologists విస్మరించి ఈ సమాచారాన్ని గణన లోకితీసుకోలేదు .
వాడుకోగలిగిన ఖగోళ సమాచారం :
భారత యుద్ధ సమయం లో చంద్ర గ్రహాణం ,వెంటనే 13-14 దినాల్లో సూర్య గ్రహణం వచ్చినట్టుగా సమాచారం ఉన్నది. ఈ సమాచారం ప్రకారం బాలకృష్ణ అన్న పరిశోధకుడు, కంప్యూటర్ల సహాయం తో భారత యుద్ధ కాలం , సా.శ .పూ . 1397, 1708,1853,2056, 2599, 3129 లలో ఒకటిగా లెక్కకట్టాడు .ఈ సౌలభ్యం పూర్వ indologists కి లేదు .అందుకని వారిని తప్ప పట్ట లేము
సూర్య సిద్ధాంత ప్రకారం కలి మొదలైన అమావాస్య నాడు సూర్యుడు ,వసంత విషు వు ( Vernal Equinox) నుంచి 54 డిగ్రీల దూరం లో ఉన్నాడు. దీని ప్రకారం కలి యుగం , సా.శ .పూ . 3102 లో ఫిబ్రవరి 17/18 న మొదలై ఉండాలి .
భారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకి కలి యుగం ప్రారంభమైనదన్న సమచారం మహా భారతం లో ఉన్నది అంటే భారత్ యుద్ధకాలం సా .శ . పూ . 3138 లో జరిగి ఉండాలి ..ఇది బాల కృష్ణ ఇచ్చిన తేదీల్లో 3129 కి దగ్గరగా ఉన్నది .
మహా భారతం లో చెప్పిన శుక్ర ,గురు , గ్రహాల స్థితిని బట్టీ , సప్తర్షి మండలం మఖలో ఉన్నాడన్న సమాచారం బట్టీ కూడా కలి యుగ ప్రారంభం

సా.శ .పూ . 3102 అని వస్తుంది .
సప్తర్షి మండలం మఖలో ఉండటం అంటే ఏమిటి అన్న దాన్ని పట్ల కొంత గందరగోళం ఉన్నది .పైగా సప్తర్షి మండలం ఉదయించటం ,

సా .శ . పూ . 3138 లో గమనించటం ఆంధ్ర దేశం లోను, గోవా లోను మాత్రమే సాధ్యం అన్న విమర్శ ఉన్నది . పరశురాముడి కాలానికే గోవా ప్రాంతం లోను , భారత యుద్ధ కాలం నాటికే ఆంధ్ర దేశం లొనూ , రాముడి కాలానికే , తమిళ నాట మన ఋషుల పీఠాలు స్థాపించబడి నట్టు ఊహించటం కష్టం కాదు .
ఐహోలే లో పులకేశి వేసి శాసనం కూడా ఈ తేదీనే సమర్థిస్తుంది.
సరస్వతీ నదీ ప్రవాహం చేస్తున్న హోరు వింటూ వ్యాసుడు రచన చేసాడు అంటే అంటే ఆ కాలం సా . శ . పూ . 3000 లకి తరువాతది కాదు.

. ఇంత సమాచారాన్ని పక్కన పెట్టి ఒక అతి బలహీనమైన ఊహ అయిన ‘ మౌర్య చంద్ర గుప్తుడి కాలం లో అలెగ్జాండర్ దండ యాత్ర జారిగింది ‘ ని పట్టుకు వెళ్లాడటం ఎంత శాస్త్రీయమో మన చరిత్రకారులు నిర్ణయించుకోవాల్సి ఉన్నది .
నా ప్రకారం భారత కాలానికి చెందిన కొన్ని తేదీలు ;
సంఘటన కాలం( సా. శ . పూ .)
1 కృష్ణ ధర్మ రాజుల జననం 3190
2ధర్మరాజు పట్టాభిషేకం 3138
3.పరీక్షిత్తు పట్టాభిషేకం 3101
4. వ్యాస భారత రచన పూర్తి 3099
5. పరీక్షిత్తు మరణం 3042
6. జనమేజయ శాసనం 3018

Written by kavanasarma

May 4, 2018 at 11:50 pm

Posted in Uncategorized