Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

Astrology

 

జ్యోతిషము నమ్మదగినదేనా ?
క వ న శర్మ
నా లక్ష్యం
ఒక వైపున, జ్యోతిషమును సైన్సు సమర్ధించదు అని , సైన్సు తెలిసిన కొందరు ఉద్దండ పండితులు చెప్తూ ఉంటె , హేతువాదులుగా చెలామణి అయ్యే మహామహులు జ్యోతిషము ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మ వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు.దానికి ఎన్నో ఉదాహరణ లిస్తారు
మరో వైపు అది ఋషి ప్రోక్తమని నమ్మదగినదేనని వాదించే ఉద్దండ జోస్యులు ఉన్నారు . వారీ జోస్యం నిజమైన ఎన్నో ఉదాహరణ లిస్తారు. వీరే కాకుండా , తమ విషయం లో , లేక తమ వారి జీవితాల్లో ఫలించిన జోస్యాల గురించి చెప్పే పామరులు , విద్యావంతులు కూడా అసంఖ్యాకులు అనేకులు ఉన్నారు.
సైన్సు క్షుణ్ణం గా తెలిసిన మరి కొందరు, అది ఎందుకు నమ్మదగినదో సైన్సు పరం గా సమర్ధిస్తూ స్వానుభవ పూర్వకం గా వివిరిస్తూ ఉంటారు .
ఈ మూడింటిని సమీక్షించటం నేను చెయ్య బూనుకున్న పని . నాకంటే బాగా తెలిసిన వారు పూనుకుంటే బావుంటుంది. కాని వారికి దీనిపై సమయం వెచ్చించటానికి తీరిక ఉండక పోవటం, అనవసరం గా తగువుల్లోకి తల దూర్చటం ఎందుకు అన్న భావం ఉండటం కారణాలుగా వారు చేయటం లేదేమో. అంతవరకు నేను మిన్నకుండలేక నోరు విప్పుతిన్నాను .
2.జ్యోతిషం అంటే ఏమిటి ?
జ్యోతిషము అనే మాట జ్యోతి అనే పదం నుంచి వచ్చింది .జ్యోతి అంటే వెలుగు . జ్యోతిషం అనేది వెలిగే మూర్తుల ( శాల్తీల) కు సంబంధించిన శాస్త్రం . ఈ శాస్త్రం మనుషుల అవసరాలతో ముడి పడి , అనాదినుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన శాస్త్రం .
భారతీయులు దీన్ని ఋషి ప్రోక్తమని నమ్మి వేదాంగ భాగంగా అధ్యనం చేసారు. దీన్ని త్రి స్కంథ శాస్త్రం అంటారు 1. సిద్ధాంత భుజం ( Astronomy ) 2. ఫల (జోస్య )భుజం 3.( Predictive Astrology ) 3.ముహుర్త భుజం ( The limb of Auspicious Times )
మొదటిదాన్ని ఈ నాడు ఖగోళ విజ్ఞాన శాస్త్రం అంటున్నారు. ప్రపంచమంతటా మొదట్లో ఇది భూమిని కేంద్రంగా చేసి నిర్మించి అభి వృద్ధి చేసారు. తరవాత, సూర్యుని కేంద్రం గా చేస్తే గణనలు ,వివరణలు సులభం అవుతాయని గుర్తించారు . అందుకని సూర్యుని కేంద్రంగా చేసీ సరళం చేసారు . కొంత మంది భూమి కేంద్రం గా ఉన్న నమూనా తప్పు అనుకుంటారు. గ్రహ గమనాలని లెక్క కట్టటం , ఇప్పటికి మన పంచాంగ కర్తలు , ఆ పాత నమూనా ప్రకారమే చేస్తున్నారు. అవి, సూర్యుడు కేంద్రం గా ఉన్న నమూనాని అనుసరించ కట్టే లెక్కలకి అతి తక్కువ ప్రమాదాలతో ( Errors) సరి పోతున్నాయి. జోస్యాలు నమ్మ దగినవి కావచ్చు కాక పోవ చ్చు. కాని అవి నమ్మ దగినవి కావు అని చెప్పటానికి భూమి కేంద్రక నమూనా తో లెక్కలు కట్టడం కారణం గా చెప్పటం మాత్రం ఖచ్చితం గా తప్పు.
ఇప్పుడు జ్యోతిషం అనే పదాన్ని రెండో భుజమైన జోస్యానికి సమానార్ధకం గా వాడు తున్నారని ఈ చర్చలో మనం గుర్తు ఉంచుకోవాలి .
3.జన్మ కుండలిని
జోస్యం చెప్పటానికి ఆకాశ వృత్తాన్ని 12 భాగాలుగా విభజించారు. . అలా విభాజించటానికి , పౌర్ణమికి పౌర్ణమికి లేక అమావాస్యకి అమావాస్యకి మధ్య 30 ( 29.5) దినాలు ఉండటం, ఒక సూర్య సంవత్సరం లో సూర్యుడు మళ్లి ఆకాశం లో అక్కడే కనపడటానికి పట్టేకాలం రమారమి 360 ( 365.25 ) దినాలు అవటం , కారణాలు . ఈ 12 భాగాల్లో ఒకో భాగానికి , ఒకో రాశి గా పేరు పెట్టారు .
అదే ఆకాశ వృత్తాన్ని మళ్లి 27 భాగాలుగా విభజించి ఒకో భాగానికి ఒకో నక్షత్రం పేరు పెట్టారు . చంద్రుడు ఆకాశ వృత్తం లో మళ్లి అక్కడే కనిపించటానికి పట్టే కాలం 27 ( 27.32) దినాలు . ఇక్కడ నక్షత్రం అనేది ఆకాశ వృత్తపు 360 డిగ్రీలలో 27 వ భాగాన్ని సూచిస్తుంది. నక్షత్రాలు అనేక విధాలు .ఒక నక్షత్రం గా చెప్పేదాంట్లో ఒకటి లేక కొన్ని తారలు . తేజో మేఘా ( Nebula ) లు ఉండవచ్చు .చిత్తలో ఒక తార ఉంటె కృత్తిక లో కొన్ని తారలు ఒక తేజో మేఘం ఉన్నాయి. ( కార్తి కేయుడి ఆరుగురు తల్లుల కథకి ఇదే మూలం )
ఒక జాతకుడు( Native ) పుట్టిన సమయం లో చంద్రుడు ఉన్న రాశిని జన్మ రాశి అంటారు. క్షితిజం( Horizon) వద్ద ఉదయిస్తున్న రాశిని , లేక ఉన్న రాశిని జన్మ లగ్నం అంటారు .ఒకొక్క రాశి , క్షితిజాన్ని దాటడానికి ఉజ్జాయింపు న 2 గంటలు తీసుకుంటుంది .
4. కొంత స్పస్టత
ఇది కాక గుర్తుంచుకోవలసిన మరో విషయం Planet అనే ఇంగ్లీష్ పదానికి సమానార్ధకం గా గ్రహం అనే తెలుగు మాట వాడటం వలన కలిగే గందర గోళం ఒకటి ఉంది. Planet అనే మాటకి అర్ధం దిమ్మరి లేక తిరుగు బోతు. అది స్వయం ప్రకాశం కాదు. తార ( Star) స్వయం గా ప్రకాసశిం చేది. గ్రహం అంటే ( గురత్వాకర్షణ తో )పట్టుకునేది అని అర్ధం . అందుకని సూర్యుడు తారా ? గ్రహమా ? అనే ప్రశ్న అర్ధం లేనిది ఎందుకంటే సూర్యుడు రెండూను.
జన్మకుండలి లేక జాతక చక్రం (Horoscope) , జాతకుడు పుట్టిన సమయం లో ,సూర్యుడు , చంద్రుడు, గురుడు , శుక్రుడు, శని, కుజుడు ,బుధుడు , అనే 7 గ్రహాలు, రాహు, కేతులు అనే రెండు ఛాయా గ్రహాలు, ఆకాశం వృత్తం లో ఏ స్థానాలలో ఉన్నాయో చెప్పేది . దీని ఆధారంగా జోస్యులు , జోస్యం చెప్తారు .
సమయం తెలిస్తే జన్మ కుండలి వేయటం వరకు అనుమానం లేని సైన్సు. అయితే ఒక తార నుంచి బయలు దేరిన కాంతి మనలని చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్ట వచ్చు. మనలని ఆ కాంతి చేరే సమయం లో ఆ తార కాలి పోయి ఉండ వచ్చు. జోస్యం లో తార ప్రభావంగా చెప్పేది, దాని కాంతి మనలని చేరేటప్పటి ప్రభావం గా అర్ధం చేసు కోవాలి .
పుట్ట టం అంటే ఏమిటి ? శిరోదయమా , మొదటి ఏడుపా లాంటి ప్రశ్నలు , నిర్వచనానికి సంబంధించినవి. . .జోస్యం చెప్పటానికి వాటి జవాబు అవసరమైతే కావచ్చు. కాకపోతే కాక పోవచ్చు. ( దీనిని ముహూర్తం విషయ చర్చ లో స్పృసిస్తాను ) అంతే కాని అసలు జోస్యం నమ్మదగిన శాస్త్రం అవునా కాదా ? అన్న చర్చలో కాదనటానికి దానిని కారణం గా చెప్తే . దానిని ‘ ఈ విధం గా నిర్వచిస్తే నమ్మ దగిన ఫలితాలు మాకు వచ్చాయి’ అని రెండో వర్గం వారు వాదించ వచ్చు. పైగా అతి వేగంగా తిరిగే చంద్రుడు ఒక నక్షత్ర పాదం దాటడానికి 6 గంటల వ్యవధి తీసుకుంటాడు . అందుకని పుట్టిన సమయం గుర్తించటం లో కొద్ది నిముషాల ప్రమాదం (Error) గ్రహ స్థితు ల పై అందరు అనుకునేటట్టు పెద్ద ప్రభావం చూపించదు.
ఇటువంటి పక్క దారి పట్టించే చర్చే ,నమూనా ( Model) లగురించి కూడా ఉంది. ‘పరాశ రుడి నమూనా లాంటి పాత ఋషుల నమూనాలు వరాహ మిహిరుడు ,కళ్యాణ వర్మ మొదలైన మధ్య కాలం వారి నమూనాలు, బీ. వి. రామన్ ,కృష్ణమూర్తి లాంటి నవీనుల నమూనాలు ఉన్నాయి కదా . ఇందులో ఒకటే కదా ఒప్పు అవాలి ‘ అనే వాదన ఒకటి ఉంది. ఒకప్పుడు సైన్సు లో వెలుగు కణ సముదాయమా ? అలల గుంపా ? అన్న ప్రశ్న ఉండేది. రెంటి ని సమర్ధించే సమాచారం, భంగ పరిచే సమాచారం, కూడా అందుబాటులో ఉండేది. ఇప్పుడు, విశ్వం ఏర్పడ టం విష యం లో అందరికి తెలిసిన Sring theory నమూనా యే కాక మరి కొన్ని ఉన్నాయి. . ఎక్కువ నమూనాలు ఉండటాన్ని సైన్సు వ్యతిరేకించదు . సమస్య పరిష్కారం, కోసం వెతుక్కుంటూ వేచి ఉంటుంది .
కొంతమంది హేతువాదులు ” మేం 4 గురి జాతకాలు, ఎవరివి అని చెప్పకుండా ఇస్తాం . ఏవి ఆడవారివో ఏవి మగ వారివో చెప్పగలగాలి ” అని జాతక పండితులకి సవాల్ విసురుతూ ఉంటారు . అది ఏ విధం గాను జాతకాల మీద మనుషులకున్న నమ్మకం తొలగించదు. తప్పు చెప్పిన పండితుడి మీది నమ్మకాన్నిమాత్రమే తొలగిస్తుంది. జనం మరొకర్ని వెతుక్కుంటూ పోతారు. రెండే సంభవాలున్న ప్రయోగాన్ని సంఖ్యా శాస్త్రం ( Statistics ) లో బర్నౌలి ప్రయోగం అంటారు.
ఈ మానసిక ప్రయోగాన్ని గమనించండి. నలుగురి లో ఒకరి జాతకాన్ని వెయ్యి మంది నమ్మే 100 మంది పండితులకి చూపిస్తే రమారమి 50 మంది సరిగ్గా చెప్తారు. వారి మీ ద ప్రజలకి గురి పెరుగుతుంది. ఈ 50 మందికి రెండో జాతకం చూపిస్తే ,వారిలో ఒక 24 మంది సరిగా చెప్పవచ్చు. ఆ 24 మందికి 3 వ జాతకం చూపిస్తే ఒక 12 గురు సరిగా చెప్పవచ్చు. ఈ 12 గురికి 4 వ జాతకం చూపిస్తే 6 గురు సరిగా చెప్తారనుకోవచ్చు. చివరికి జరిగేదేమిటంటే మొదట్లో 100 మంది పండితులని న నమ్మిన వెయ్యిమంది ప్రజా, ఈ పరీక్షలో చివరికి మిగిలిన ఆరుగురు పండితులకి 16 రెట్ల నమ్మకం తో అనుయాయీలు అయిపోతారు. అంతే గాని తమ నమ్మకం పోగొట్టుకోరు. వ్యాపారాల లో వచ్చేది బూమ్ /స్లంప్ అనే విషయం లో సరైన ఉహ రెండు మూడు సార్లు చేసిన ఆర్ధిక శాస్త్ర పు జోస్యులకి గిరాకి ఎక్కవగా ఉండటానికి కారణం ఇదే !
5. జ్యోతిషం ఋషి ప్రోక్తం
జ్యోతిషాన్ని చాలామంది నమ్మటానికి కారణం అది ఋషి ప్రోక్తం అని నమ్మటం . తర్కం లో యోగదృష్టి ప్రమాణం అని ఉన్నది. ఋషులు అసాధారణ స్పురణ శక్తీ ( అతి గొప్ప ఏకాగ్రతతో ఆలోచించి తెలుసుకునే శక్తీ ) కలిగి ఉంటారు కనక ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాము అంటారు ,నమ్మే వారు. . ఈ పద్ధతిలో కలిగే జ్ఞానాన్ని Transcendal Perception అంటారు. న్యూటన్, శ్రీనివాస రామానుజం , ఐన్ స్టెయిన్ లకి ఈ శక్తీ ఉన్నదని మనకు తెలుసు. అందుకని, నమ్మేవారిని తప్పు పట్టలేము . అయితే ఈ ప్రమాణాన్ని నమ్మని వారు ” ప్రమాదో ధీమతామపి” అని గుర్తు చేస్తారు. మనం చెప్పుకున్న ముగ్గురు కొన్ని తప్పుడు ఉఃహాలు చేసారని కుడా మనకి తెలుసు . అందుకని నమ్మని వారిని తప్పు పట్టలేము. అంటే సామాన్య ప్రమాణం లేని కారణం గా ఈ విషయం పై చర్చ కొనసాగించలేము.
6. గ్రహాల ప్రభావాలు
6.1 స్వీకృతాలు
శుక్ర గ్రహం భోగం కలిగిస్తుంది, గురు గ్రహం ఉచ్ఛ స్థితిని కలిగిస్తుంది ,శని గ్రహం బాధి స్తుంది , అని జోస్యులు అంటారు అనుకుందాం.అల్లాంటి నమూనా ఉందనుకుందాం. అశ్వని నక్షత్రం లో జన్మిచినవారు కేతు మహా దశ లో పుట్టినట్టు , భరణి లో పుట్టినవారు శుక్ర మహా దశలో పుట్టారని విశాఖ నక్షత్రం లో పుట్టిన వారు శ ని మహా దశలో పుట్టారని శాస్త్రం చెప్తుంది అనుకుందాము . పైగా కేతు మహా దశ 7 సంవత్సరాలు, శుక్రమహా దశ 20 సంవత్సరాలు, శని మహా దశ 19 సంవత్సరాలు అని ఆ నమూనా లో తీసుకుంటుందని అనుకుందాము . పుట్టిన నక్షత్రం లో ఇంకా ఎంత భాగం గడవాల్సి ఉందొ దాన్ని బట్టి ,మహర్ దశా శేషం లెక్క కట్టగలం. పైగా ఏ గ్రహం, జన్మలగ్నం నుంచి ఎన్నో రాశి లో ఉన్నది ?ఏ గ్రహం ఏ గ్రహాన్ని చూస్తోంది అనే దానికి, దానిని బట్టి జాతకుడి కి పట్టా బోయె యోగాలు అరిస్టాలు తెలియ చెప్పే సూత్రాలు ఉన్నాయి అనుకుందాము. ఇదొక నమూనా . ఆ నమూనా పరాశ రుడిది అవవచ్చు బీ.వి రామన్ ది అవవచ్చు . కాని వీటిపై నమ్మని వారు సంధించే ప్రశ్నలు రెండే రెండు .
1. ఈ ప్రభావాలని ఏ ఆధారాలతో ఉహించారు ?
2. ఆధారాలు లేని వాటిని నమ్మటం ఎలా ?
ఇక్కడ మనం ప్రతి శాస్త్రానికి దానివే అయిన కొన్ని స్వీకృ తాలు ఉంటాయి అని తెలుసు కోవాలి . అవి 1. ఊహనలు ( assumptions) 2. స్యయం స్పష్ట సత్యాలు ( axioms) . ఇంకా దానిదే అయిన ప్రమాణాల లేక సూత్రాల చట్రం ఉంటుంది.
సైన్సు లో ఊ హనల నుంచి వచ్చిన హేతు సాధ్యాలని ( Deduced results ) ని ప్రయోగాలతో పరీక్షిస్తారు. ఫలితాలని హేతు సాధ్యాలని ధృవీక రిస్తే ఆ ఊహనలు సరి అయినవే అని నిర్ధారిస్తారు. అంటే జ్యోతిషం లో పరిశీలనలు జోస్యాలతో సరి పోలితే ఆ ఊహనలు సరి అయినవే అని తీసుకోవాల్సి ఉంటుంది.
కాని సమస్య కొందరు సరి పోయాయి అంటే కొందరు లేదు అంటారు. .లేదు అన్న వారు శాస్త్రం తప్పు అని వాదిస్తారు. మొదటి వారు,” మీ పరిశీలన తప్పు , లేక హేతు సాధ్యాలు తప్పు , లేక దత్తాంశాలు ( జన్మ కుండలిని) తప్పు ఇంకా మళ్లి మాట్లాడితే మీ పండితుడి కి శాస్త్రం తెలియదు ” అంటారు .
ఎవరికీ మాటలకి మనం ఎందుకని విలువనివ్వాలి ? ఇక్కడ వస్తు నిస్టత (objectivity ) కంటే వ్యక్తి నిష్టతే ( subjectivity) నిర్ణయాలు (conclusions) తీసుకోవటం లో ప్రధాన పాత్ర వహిస్తుంది.
రెండోది స్వయం స్పష్ట సత్యాల విషయం. గ్రహాల ప్రభావాలు, ఋషులు చెప్పారు కనక స్వయం స్పష్ట సత్యాలు అంటారు రెండో వర్గం వారు. “చెప్పిన వాళ్ళు ఎంత గొప్ప వారైనా మేము నమ్మం” అంటారు మొదటి వర్గం వారు.
ఇక్కడ భూమి కొలతల శాస్త్రం అయిన జ్యామితి (Geometry) గురించి కొద్దిగా చెప్తాను. జ్యామితుల్లో ఎన్నో రకాల జ్యామితులు ఉన్నాయి. అందరికి బాగా పరిచయం ఉన్న జ్యామితి యూక్లిడ్ ప్రతి పాదించినది. ఆ జ్యామితి అతనే ప్రతి పాదించిన స్వయం స్పష్ట సత్యాల ఆధారం గా రుపొందిప బడిన శాస్త్రం. . ఈ స్వయం స్పష్ట సత్యాలకని హేతు వాదులు/ శాస్త్రజ్ఞులు ఋజువు చేయలేరు.
నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అటువంటి విషయాలు ఋజువు చేయటం సాధ్యం కాదు అనే . జోస్యాలని ,అవి ఇచ్చే ఫలితాలు తప్పటం , అనే కారణం గా మాత్రమే నిరాకరించగలం . అంతే గాని ప్రభావాలకి కార్య కారణ సంబంధాలు లేవు, అని కాదు.
6.2 సంఖ్యా శాస్త్ర సమర్ధన
బోల్ట్ జ్ మన్ అనే శాస్త్రజ్ఞుడు ఉష్ణ గమన శాస్త్రం లో సంఖ్యా శాస్త్ర భావనలు ప్రవేశ పెట్టాక సగటు విలువలు , విలువలు వాటి సంభావ్యతలు , నిశ్చిత విలువల స్థానం లో సైన్సు లో వాడుక లోకి వచ్చాయి. సైన్సు లో ఒకజోస్యం (Prediction ) నప్పటానికి 90 % సంభావ్యత అని , తప్పటం నూటికి పది సార్లే జరుగుతుంది అని చెప్పే టటు వంటి సాంఖ్యా యాంత్రిక శాస్త్రాలు ( Statistical Mechnics) వాడుకలోకి వచ్చాయి .
ఒకసారి IISc లో శ్రీ .బీ. వి. రామన్ జ్యోతిషం పైన మాట్లాడినప్పుడు ఆయన చెప్పి తప్పు అయిన ఓ పది జోస్యాల పట్టిక వారి ముందు ఉంచి అవి తప్పవటానికి కారణం అడిగి నప్పుడు ఆయన జ్యోతిషం సంభావ్యతల తో కూడిన శాస్త్రం అన్నారు .
‘ఈ జాతకులలో నూటికి 90 మంది 80 సంవత్సరాలు జీవిస్తారు ‘ లాంటి వి మాత్రమే జోస్యులు చెప్పగలరు అంటారు సైన్సు క్షుణ్ణం గా తెలిసి , జ్యోతిషా న్ని నమ్మే వారు ,
“ఒక డాక్టరు ఒక రోగికి శస్త్ర చికిత్స చేసే ముందు “ఇతనికి శస్త్రచికిత్స చేస్తే ఇతను బతకటానికి 90% అవకాశం ఉంది ‘ అంటే ఒప్పుకునే మీరు దీనిని ఎందుకు ఒప్పుకోరు ?” అని ప్రశ్నిస్తూ ఉంటారు స్కెఇన్కె తెలిసి జ్యోతిషాన్ని నమ్మేవారు.
ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏ సంభవం (ఈవెంట్ ) కైనా సంభావ్యత అది జరగక ముందు మాత్రమే ఉన్నట్టుగా చెప్తాము . దాన్ని ప్రయోగానికి/ పరిశీలనకి గురిచేసి నప్పుడు అది జరగినదనో జరగాలేదనో మాత్రమే గుర్తిస్తాం .
నా జాతకం కలవారిలో నూటికి 99 % గొప్ప ధనవంతులు కావచ్చును అని చెప్పారు అనుకుందాం. గొప్ప ధనవంతులు కాని ఆ ఒక్క శాతం లో నేను పడి అది చాలనట్టు గొప్ప పేద వాడిని అయితే మిగిలిన 99 % జాతకులు గొప్ప ధన వంతులు అవటం నాకు ఏ సంతోషం ఇవ్వదు కదా .
ఇక్కడ సంఖ్యా శాస్త్రం గురించి ఓకే మాట చెప్పుకోవాలి అది జనబాహుళ్యల ( populations) కి చెందిన శాస్త్రమే కాని ఒక వ్యక్తి కి నప్పే శాస్త్రం కాదు . జ్యోతిషం నిశ్చిత శాస్త్రం( Deterministic) కాక సంభావ్యతలకి చెందిన శాస్త్రమే అయితే దాన్ని ‘నేను’ పట్టించు కోనక్కరలేదు అని ‘నేను’ గట్టిగా నమ్ముతాను .
7. సహసంబందాలు (correlations)
సైన్సు లో దరిచేర్చు నల్ల పెట్టె పద్ధతి (Blavk Box Approach) అనేది ఒకటి ఉంది. ఆ పెట్టెలో ‘ఈ’ ప్రవేశికం (Input) పెడితే ఆ” బహిర్గతం( Output ) వస్తుంది అనేది ఆ పద్ధతి . పెట్టెలో ఎ పరామితులు( Parameters) ఎ సూత్రాల ప్రకారం పని చేసి ఆ బహిర్గాతాలని ఇస్తున్నాయి అన్నది ఇందులో ముఖ్యం కాదు .ముఖ్యమైనది ఆ బహిర్గతం ఈ ప్రవేశికం మీద కార్య కారణ సంబంధం తో ఆధార పడేది అయి ఉండటమే .
ఉదాహరణగా మనం మన పెరట్లో పడే వాన పరిమాణానికి పెరట్లోని బావిలో పెరిగే నీటి మట్టం కి సంబంధం ఉంటుందని తెలియటమే.
కొన్ని సార్లు సంబంధలేని రెంటి మధ్య దొంగ ( Spurious) సంబంధాలు కనిపిస్తాయి.
ఉదాహరణకి ఒక నగరం పెరిగిన కొద్ది ప్రమాదాలు పెరుగుతాయి . ఊరు పంచాయితి నుంచి పురపాలక సంస్థ అయినప్పుడు తల ఒక్కంటికి అందించే నీటి పరిమాణం పెరుగుతుంది .అందించిన నీటి పరిమాణానికి ప్రమాదాలకి మధ్య ఇటువంటి దొంగ సంబంధం కనిపిస్తుంది.
. అది మనకి దొంగ సంబంధం అని ఎలా తెలుస్తుంది అంటే జనాభా ని అలాగే ఉంచి నిటి సరఫరా పెంచితే ప్రమాదాలు పూర్వం లా పెరగటం గమనించం.
8. సామ్యం( Analogy ) ఋజువు కాదు.
భారతీయులు చేసే వాదనలలో సామ్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కారణం మన తర్క శాస్త్రం లోని సిలోజిజం (Syllogism)కి ఉన్న అవయవాలలో సామ్యం 4 వది .దీన్ని ఉదాహరణ గా తర్కం లో వాడుతారు. ఋజువుగా కాదు.
ఉదా; 1. కొండమీద నిప్పు ఉన్నది ( ప్రతిజ్ఞ / ప్రతి పాదన
2. ఎందుకంటే పొగ అక్కడ ఉంది. ( హేతువు)
౩. పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది ( వ్యాప్తి)
4.వంట ఇంట్లో వలె ( సామ్యం )
5. కనక కొండ మీద నిప్పు ఉన్నది ( సాధ్యం -ఋజువు )
3 వ అవయవం లేక పోయయాక మిగిలిన 4 అవయవాలు ఉన్నా అది ఉత్త డబాయింపే అవుతుంది.
1.మనిషుల మీద సూర్య చంద్రుల ప్రభావం ఉంటుంది
2. ఎందుకంటే మనుషుల్లో నీరు ఎక్కువగా ఉంటుంది
4. సముద్రపు నీటి మీద సూర్య చంద్రుల ప్రభావం తో ఆటు పోటులు ఏర్పడి నట్టు,
5. కనక మనుషుల మీద సూర్య చంద్రుల ప్రభావం ఉంటుంది.
ఈ వాదనలో హేతువు లేదు . ఒక వేళ ‘ ఎందుకంటే నీటి మీద సూర్య చంద్రుల ప్రభావం ఉంటుంది ‘ అ నే హేతువు ని చెప్పినా అది సరైన , హేతువు కాదు .అక్కడ నీరు సరైన పరామితి కాదు. సరైన పరామితి అయితే గియితే ద్రవ్య రాశి . తరవాతి అధికరణలో అది కూడాఎందుకు హేతువు కాదంటున్నానో వివరిస్తాను
స్త్రీలకి వచ్చే నెలసరికి గ్రహ స్థితు లకి, పిచ్చికి అమావాస్య పౌర్ణమి లకి, ఆఖరికి దొంగ సంబంధం కుడా లేదని వాటిని సమర్ధించే సమాచారం ( Data ) ఏది లేదని ఎన్నో అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.
9.జాతకాల బాహుళ్యం
12 రాశులు , రాశికి 9 పాదాలు ( 27 నక్షత్రాలు నక్షత్రానికి 4 పాదాలు ) వెరసి ఒకో గ్రహం ఉండటానికి 108 స్థానాలు. అంటే మొత్తం జన్మకుండ లినుల సమితి ఆవరణ లో 108 ^9 స్థానాలు ఉంటాయి. అంటే రమారమి ఒక వంద బిలియన్ ( పదివేల కోట్ల ) జన్మ కుండలిని ల లో ఒక మనిషి ఎందులో . ఇన్ని రకాల జాతకాలని వివరించే సూత్రాలు కావాలి. నవాంశలు మొదలైనవి గణనలోకి తీసుకుని సూత్రాల సంఖ్య విపరీతంగా పెంచారు సూత్రాలు ఎన్ని పెంచినా పై సంఖ్య తో పోలిస్తే చాలా తక్కువ . అయితే ఇది బలహీనత కాదు. బహు పరా మితు ( Paramters)లున్నప్పుడు అన్ని ఒకే రకమైన ప్రాముఖ్యం కలిగి ఉండనవసరం లేదు. బహు పరామితులు ఉన్న సందర్భాలలో సహా సంబంధాలు కట్టే టప్పుడు కొద్ది పరామితులల తో 1 కి అతి సమీపమైన సహా సంబంధం సాధించ గలుగు తాము చాల సార్లు. 1 సంపూర్ణ సహా సంబంధాన్నీ సూచిస్తుంది .
అందువల్ల ఆకాశం లో ఎన్నో నక్షత్రాలుండగా ఈ 9 గ్రహాలనే ఎందుకు గణన లోకి తీసుకుంటాము అనే ప్రశ్న ఈ కారణంగా అర్ధ రహితం అవుతుంది.
ఇక్కడ మరో విషయం కుడా చెప్పుకోవాలి. సూర్యుడు నా మీద కనబరిచే గురుత్వాకర్షణ శక్తికంటే నా ఎదురు గా ఉన్న ఒక పెన్సిల్ కనబరిచే గురుత్వాకర్షణ శక్తీ ఎక్కువ . పెన్సిల్ ద్రవ్య రాశీ సూర్యుడి కంటే బహు తక్కువ అయిన ప్పటికి సుర్యుడున్న దూరం కంటే పెన్సిల్ ఉన్న దూరం ఎంతో తక్కువ. అందువల్ల నా ప్రకటన సరి అయినదే !

10 ముహూర్తాలు
మొదట్లో ఎప్పుడు విత్తనాలు జల్లాలి ? ఈకాలం లో పెళ్ళిళ్ళు చేస్తే సుఖం ? ఏ కాలం ఎటువైపు ప్రయాణాలకి అనువైనది ? లాంటి ప్రశ్నకి జవాబులు గ ముహూర్త శాస్త్రం అభివృద్ధి పొందింది. ఒక ముహర్తకాలం కొద్ది దినాలు గా ఉండేది. ఈ ప్రశ్నలు సముహాలకి చెంది ఉండేవి. అవి కొంతకాలానికి పరిపాలకుల కి చెందినవిగా ,ఆ తరవాత ముఖ్యులకి చెందినవి గా ఉన్నవి క్రమేపి వ్యక్తులకి సంబంధించినవి గా మారాయి. అల్లాగే ముహుత్ర్తాలు కొద్ది దినాల నుంచి కొన్ని తిథులకి . ఆ తిథులలో కొన్ని సంయాలకి పరిమితం అయ్యాయి. ఇప్పుడు ముహూర్తం అన్నది ఎక్కువమంది 48 నిముషాలుగ గుర్తిస్తారు. అమావాస్య నాడు సూర్యుడి తో కలిసి ఉదయించిన చంద్రుడు 30 రోజుల పాటు తిథికి 48 నిముషాలు ముందర ఉదయించి 30 తిథుల అనంతరం మళ్లి సూర్యుడి తో ఉదయిస్తాడు అది ముహూర్త కాలం . అది కాలానికి ఒక ఎకకం ( Unit). అది రెండు ఘడియల కాలం . పూర్వం ‘రెండు ఘడియలు ఆగు ( తాళు) ” అంటూ ఉండేవారు. కన్నడ దేశం లో వివాహ ముహూర్త సమయం 48 నిముషాలు .
అది క్రమేపి ఒక క్షణం ( nstant) అత్యత్తమ కాలంగ మారింది. అప్పుడే’ జీల కర్ర బెల్లం పెట్టాలి’ అప్పుడే ‘నదిలో మునగాలి’ లాంటి అభిప్రాయాలు బలపడ్డాయి. తెలుగు నాట ఈ అభిప్రాయం ఉంది
నమ్మదిగా ఎడతెగక మారుతూ వచ్చే కాలాన్ని ,గోచారాన్నీ , ఆకస్మికంగా ఒక క్షణంలో మారే వాటిగా తల పోయటం మొదలయింది.దాని వల్ల ఒక బిడ్డ పుట్టిన సమయం ఒక కాల వ్యవధి గా కాక ఒక క్షణం గా నిర్ణయించే ఇబ్బంది లో పడ్డాం
11 . నా నిర్ణయం ( Conclusion)
చాల మందికి నేను వ్రాసిన చాట భారతం చదివే ఓపిక సమయం ఉండవు . వారికి కావలసింది , వారు నానుంచి తెలుసుకో దలచినది నా నిర్ణయం .
జోస్యాలు నమ్మ దగినవో కావో నేను తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నమ్మ దగినవే అనుకున్నా చెప్పిన వన్నీ నా విషయం లో జరుగుతాయని అనుకోలేను ఏవి జరుగుతాయో అవి జరగవో కుడా తెలియదు. తెలుసు కోవటం నిష్ప్రయోజనం అని తెలుసు .
కాని నాకు తెలిసిన ఒక విషయం మీకు ఉపయోగపడ వచ్చు . జోస్యాలు నమ్మ దగినవే అనుకుందాము ప్రతి మహర్దశ లోను అంతర్దశలు ఉంటాయి కనక మంచి దినాలు, కాని చెడు దినాలు కాని 2-3 సంవత్సరాలకి మించి కొనసాగే అవకాశం లేదు . అందుకని పెద్దగ సంబర పడ ను , భయ పడ ను .
నేను ఎన్ని వీలయితే అన్ని వార ఫలాలు, దిన ఫలాలు చూస్తాను ఇందులో కొన్ని అందులో కొన్ని జరగు తాయని నాకు తెలుసు. అందుకని సంభావ్యతలు సంభావాలుగా మారే లోపల నాకు నచ్చినవి నేను ఏరుకుని ఆనందిస్తాను. అంతవరకే నా నిశ్చయాలు ( Decisions ) జోస్యాలమీద ఆధార పడవు.

 

 

 

 

 

 

 

 

Written by kavanasarma

December 1, 2017 at 6:13 am

Posted in Uncategorized

%d bloggers like this: