Kavana Sarma Kaburlu

All Rights Reserved

BMWG

leave a comment »

My class mate Sri K. Sreenivasa Rao( KSR) is a genius. అతను శ్రీ శ్రీ కి వేలు విడిచిన మేనల్లుడు శ్రీరంగంవారికి ఒక ఆనవాయితీ ఉంది .వాళ్ళ ఆడపిల్లల్లో ఒకరికి , త్రిపుర లలిత సుందరి అనే పేరు పెట్టడం . అలాంటి పేరు పెట్టబడిన ఓ ఆవిడ మా శ్రీనివాసరావు కి అసలు తల్లి నాకు తల్లి సమానురాలు .ఇంకో ఆవిడ శ్రీనివాస రావు మేనమామ కూతురు .ఆవిడ నరసింగ రావు అనే జడ్జిని పెళ్లి చేసుకుని బీనా దేవి గా మారి పోయింది. శ్రీరంగం వారు భాగావత్గుల వారు కాశీ సోమయాజుల వారు అందరు గుడి గుడి గుంచాలే ! ఆరుద్ర గా చెలామణి అయ్యే ఆయన మా శ్రీనివాస రావు తల్లి యొక్క మేన బావ కి కొడుకు ! మాశ్రీనివసరావు, మా AVNCollege batch లో first. . ఇతన్ని తరవాత మరో టపాలో వివరం గా పొగుడుతాను .అతను SE Rly. lలో Deputy Chief Engineer గా ఉన్నప్పుడు VRS తీసుకుని Bhagiratha Mini Water Grid (BMWG) అనే NGO లో Consultant గా పనిచేస్తూ ఉండేవాడు 1995-97 ల్లో . దానికి పెద్ద, అతని పిన మావగారైన భాగవతుల రాధాకృష్ణ మూర్తి (BRKM ). ఈయనే కన్యాశుల్కాన్ని " Bride Price " అని ఆ మధ్య ఇంగ్లిష్ లోకి అనువదించారు BMWG shceme evisages the diversion of Godavari waters at Polavaram through pumping to uplands of East Godavari district and southern part of Visakhapatnam district .It propose to use existing tanks ,reservoirs pipes and canal systems .
ఇంతకు వీరికి ఓ సందేహం వచ్చింది

Does the Yeluru Resrvoir ( YR) have excess capacity to store the water diverted from Godavari ? Can we use The Yeleru Left Canal ( YLMC) to carry excess water from YR to Kanithi Reservoir ( KR) near Visakha Steel plant ?
"ఈ సందేహం మనకి ఎవరు తీర్చి పెడతారు?" అని BRKM గారు ఉన్న కొద్ధి జుట్టూ పీక్కుంటుంటే అది చూసి తట్టుకోలేని KSR ,తను BRKM తో ఇట్లు నుడివె నని నాతో అన్నాడు.
" గీతం లో మన శర్మ ఉన్నాడు కదా ! అతను BCT కి గత సంవత్సరం సర్వే చేసి పెట్టాడు. అతనే మనకీ సందేహాలు తీర్చగలడు. అతను కాలువల విషయం లో ప్రపంచ నిపుణులలో ఒకడు. "
ఇందులో అతి శయోక్తులు ఉన్నాయని మీరు అనుకుంటే నేను బాధ్యుడిని కాను . అతనే బాధ్యుడు మేమిద్దరం పరస్పర డబ్బా కొట్టుకుంటూ ఉంటామని మా నిజ భార్యల గట్టి నమ్మకం . దీని గురించి కూడా మరో సారి .

BVRM నమ్మేరో లేదో కానీ నా సహాయం కోరారు. వారికి Rs.60000 charge చేసేటట్టు కళాశాల పరికరాలు వాడక పోయినా , టీచర్ అనే వాడు 24 గంటల పనివాడు కనక కళాశాలకు 30% ఇస్తానని చెప్పి అనుమతి పొందాను
వాన రికార్డ్స్ అవసరం మేరకు సరిదిద్ది YR కెపాసిటీ సరి పోతుందనీ YLMC వ్యవస్థ కి కట్టలు తీరుగా తిన్నగా పోయించాల్సి ఉంటుందని , దారి మధ్యలో రైతులు కాలువలకు గండ్లు కొట్టి తమ పొలాలకు నీరు పెట్టుకుంటున్నారని , కాలువల్లో బాగా ఇసుక మేట వేయటం వలన. రావలసినంత నీరు KR కి ఇప్పుడే రావటం లేదని ‘బాగు పనులు’ అవసరమని రిపోర్ట్ ఇచ్చాను
Field ట్రిప్ లో అల్లూరి రామరాజు నడయాడిన అడవులు చూసాము .దారిలో అన్నవరం స్వామి ప్రసా దాలని కొనుక్కోవాలని నా సహాయకులు దాసరి శ్రీనివాస్ ,అల్లూరి సత్యనారాయణ రాజు ముచ్చటపడటం ,నేను ‘దేవుళ్ళు దూరం నుంచే బావుంటారు ‘అని నేను చెప్పినా వినక , తోపిడిని , క్యూల్లో దొంగదొడ్డిన దూరిపోతున్న భక్తుల చూసి ,కించిత్తు భక్తి ని కోల్పోయిన వారైరి

Advertisements

Written by kavanasarma

June 21, 2018 at 3:41 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: