Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

uthsavaalu uthsaahaalu

ఉత్సవాల లో ప్రజలు ఉత్సాహం గా పా లుగొంటారు. . రాజకీయ లబ్ధికి గణేశ ఉత్సవాల ని వాడుకున్న ఆయన తిలక్. అల్లాగే శ్రీరామ నవ మి ఉత్సవాలని వాడుకున్న ఆయన "కవి గారు ". ఈయన వీటిని వైభవం గా విశాఖపట్నం లో నిర్వహించేవారు. పులి వేషాలు, పౌరాణి నిక నాటకాలు హారికథలు వడపప్పు పానకాల పంపిణీలు , ఈ ఉత్సవాల లో చోటు చేసుకునేవి . లలిత గుడి ని వదిలి వేస్తే శివాలయం ,ఆంజనేయ స్వామి కోవెల జగన్నాధుడి గుడి , సీతారామస్వామి దేవాలయం అన్ని విశాఖ ముఖ్య రహదారి మీదే .. వాటిమధ్య రామ నవమి పందిళ్లు వేసేవారు నిక్కర్లు వదిలి పొడుగు లాగులు వేసుకోవటం మొదలు పెట్టిన మేము , ఈ చివరినుంచి ఆ చివరిదాకా రాత్రి ళ్లు తిరుగుతూ దేవుడిని , నాటకాలని , అప్పుడే వోణీల్లోకి మారుతున్న అమ్మాయిలని చూసుకుంటూ మా ఇళ్ల దాకా నడుచుకుంటూ వెళ్లేవారిమి . చూపులు చిరునవ్వులె గాని ‘టీజింగులు " లేవు. అందరు అందరికి తెలిసిన చోట అల్లరి పెట్టడానికి అవకాశమే లేదు. ఆ దినాల్లో విశాఖ కేవలం పట్టణమే .నగరం కాదు

Written by kavanasarma

April 5, 2017 at 2:52 am

Posted in Uncategorized

%d bloggers like this: