Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

16 January, 2018 11:52

ఆకర్షణా వ్యామోహం నా 5 వ పుస్తకం. నేను 1970 -72 మధ్య ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ యునివర్సిటీ లో జల విద్య బోధించాను తిరిగి వచ్చాక అక్కడి వాతావరణం నా బోటి ఇండియన్ల మీద చూపించే ప్రభావం గురించి నాకు అర్ధమైనది ఒక నవలగా వ్రాసాను .అదే ఇది. దీనిని ఆం.స.వా .పత్రిక 1978 నవంబర్ నుంచి 1979 జనవరి వరకు ధారా వాహికగా ప్రచురిం చింది . ఆ తరవాత నవోదయా రామ్మోహనరావు గారు దీన్ని మే నెలలో పుస్తకంగా వేసారు. .దీనిలో ఎక్కవగా చిత్రించిన విషయం Cultural shock. అక్కడి వారు మన చీర కట్టుణు sexy గా ఉంటుందని ఆఫీసుల్లో స్కూళ్ళల్లోణు నిషేధించటం కార్ల కింద ని మ్మకాయలు పెట్టక ఒపోయిన అక్కడ accidents అవక పోవటం ,వినాయక చవితి పూజ అయ్యాక ఆ పత్రి పూలు ఎక్కడ పారెయ్యాలన్న ప్రశ్న ఉదయించటం , అక్కడ తల్లులకి ఇస్కాన్ అంటే కోపం ఉండటం ,ఇలా ఎన్నో.!
నాతో పాటే IISc లో Ph.D చేసి IIT(M) కి వెళ్ళిన ఉద్యోగపర్వాల రచయిత లేళ్లపల్లి లక్ష్మీ నారాయణ శర్మ ని ‘మెడ్రాస్ శర్మ’ అని నన్ను’ఆస్ట్రేలియా శర్మ’ అని మా గుంపుల్లో వ్యవహిరించే వారు.
నేను 1954 నుంచి పెద్ద మనుషులు సినిమాకి సంభాషణలు వ్రాసిన డి.వి నరసరాజు గారికి వీరాభిమానిని. ఆయనని కలుసుకొనే భాగ్యం 19 75 లో మెడ్రాస్ శర్మ గారి వలన కలిగింది. రాజు గారి వద్ద పెద్దమనుషులు సంభాషణలని అప్ప చెప్పి ఆయన మెప్పు పొంది సెలవు తీసు కుని వస్తుంటే మెడ్రాస్ర్ శర్మ గారు ఆగలేక " ఈయన పేరు కవన శర్మ " అని చెప్పేసారు . రాజు గారు " ఆహా (‘ అంటారు అనుకున్నాను. ఆయన అల్లా కాక " ఆస్ట్రేలియా శర్మ ఆకర్షణ వ్యామోహం శర్మ ఈయనేనా! " అని నన్ను ఆశ్చ ర్య పరిచారు. నా వీరడు నన్ను గుర్తించేలా చేసిన ఈ నవలంటే నాకు గొప్ప ఇష్టం.
నా నాస్తిక భావాలు నచ్చని బాపు గారు అట్టమీద బోలెడు దేవుళ్ళ బొమ్మలు వేసి చదువరులని ‘రచ్చించారు’
సంఘపురాణంనా 6 వ పుస్తకం. సెప్టెంబర్ 1979 లో దీనిని నవోదయా రామమోహన రావు గారు ప్రచురించారు ఇదంతా మే 1994 లో వాహినీవారు ప్రచురించిన వ్యంగ్య కవనాల పుస్తకం లో భాగమైనది

మారీ మారని మనుషులు నా 7 వ పుస్తకం .1965 లో బెంగళూరు జిల్లా రచయితలకి పెట్టిన కథల పోటీలో ఇదే పేరు తో వ్రాసిన నా కథ కి మొదటి బహుమతి వచ్చింది. 1968 జూన్ లో ఆంద్ర సచిత్ర వార పత్రిక లో ఈ కథ అచ్చు అయింది 1984 జనవరిలో దీన్ని ఎమెస్కో మూడో తరం వారు కోరగా నవలగా వ్రాసాను, ఆ నవలని ఆ కథ తో పాటు ఎమెస్కో ప్రచురించింది. నాకు నచ్చిన కథ ఇది. ఈ నాటికి ఇందులోని విషయం వర్తిస్తుంది అని అనిపించి 2017 లో బెంగళూరు ఆకాశవాణి వారిచ్చిన అవకాశం వాడుకుని తిరుగ వ్రాసి చదివాను. కథా స్థలం IISc బెంగళూరు .పాత్రలు ఒకటి తప్ప బెంగళూరు అనంతపురం కి చెందినవి. బెంగళూరు మాండలీకం అన్ని versions లోను ఉమ్మడి గా ఉంది

నా 8 వ పుస్తకం వ్యంగ్య కవనాలు. దాన్ని రచన శాయి గారు వాహిని బుక్ ట్రస్ట్ పేరిట
1994 మే లో ప్రచురించారు. ఆ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం ఇది. రచన ప్రారంభ సంచికలో మాయాబజార్ సంభాషణల పై నేను వ్రాసిన సాహిత్య వ్యాసం రావటం , ఈ పుస్తకమే ఆ సంస్థ మొదటి పుస్తకం కావటం నా అదృష్టం.
ఇవి నాకు నచ్చిన కథలు .నేను మసిలే గుంపుల్లో జనాలు మెచ్చిన కథలు

Written by kavanasarma

January 16, 2018 at 11:52 am

Posted in Uncategorized

%d bloggers like this: