Kavana Sarma Kaburlu

All Rights Reserved

Teasing

with 5 comments

Teasing లో స్థాయి భేదాలు 1. పొగడటం –"వాలు కనుల దానా హంస నడకదానా
2. ఉడికించటం – " మొగుడంటే మోజు లేని దానా
3. ఏడిపించటం .– గోడ మీద పేర్లు వ్రాయటం , తాను వెన్న తిని , కొద్దిగా నెలతల మూతులకి వ్రాయటం , మధురా నగరిలో చల్లలు అమ్మబోతే దారి విడక కొంగు పట్టుకోవటం
4.. హింసించటం –. ప్రేమించమని బలవంతం చేయటం , వినక పోతే దాడి చేయటం
ఇందులో కృష్ణుడి దగ్గరనుంచి , దేవానంద్ ,నాగేశ్వర రావు చిరంజీవి నాగార్జున రవితేజాల దాకా మొదటి మూడింటిలో కథల్లోనూ సినిమాల్లోనూ చేసిన వారే వారివి చూసి ప్రేక్షకులు ఆ నందించిన వారే. ఎందుకంటే రాధ క్యోమ్ జలే మనకి తెలుసు .నూతన్ కి దేవానంద్ అంటే ను , జమున కి నాగేశ్వర రావు అంటే ను నగ్మాకి చిరంజీవి అంటేను, టాబుకి నాగార్జున అంటే ను , నయన తారకి రవితేజ అంటేను ఇస్తామని మనకి ముందు నుంచే తెలుసు
అయితే వీటిలో ప్రేమించినవాడు మంచివాడు అందమైన వాడు,ధైర్యశాలి ,కార్య శూ రుడు , ఊరికి ఉపకార, దుష్ట శిక్షకుడు . . అతను రాజ కుమారుడు కావచ్చు, తోటమాలి కావచ్చు జట్కా నడిపే వాడు కావచ్చు కూలి కావచ్చు ఆఖరికి రౌడీ కావచ్చు
సమస్య అల్లా , అవి చూసి ఇంకే గుణాలు లేని రౌడీలు అమ్మాయిలని హీరోల్లాగా ‘టీజ్ ‘ చేస్తున్నామనుకుని హింసించటమే !

Advertisements

Written by kavanasarma

April 5, 2017 at 4:32 am

Posted in Uncategorized

5 Responses

Subscribe to comments with RSS.

 1. అవునండీ బాగా చెప్పారు. హీరోయిజమ్ / ప్రేమ పేరుతో మన సినిమాలలో హీరో పాత్రలు చేసే వెకిలి చేష్టల ప్రభావం సమాజంలో రౌడీల మీదే ఎక్కువ పడుతున్నట్లుంది. సినిమాలలో ఈ తరం హీరోల చేష్టలు అయితే మరీనూ. ఏమన్నా అంటే ‘మాస్’ కోసం చేస్తున్నామంటారు.
  శర్మ గారూ, 1970వ దశకంలో అనుకుంటాను ఓ తెలుగు వారపత్రికలో “ఉద్యోగ పర్వాలు” అనే కథలు వచ్చాయి (నిరుద్యోగ పర్వం, చిరుద్యోగ పర్వం వగైరా పేర్లతో). అవి వ్రాసింది మీరే కదా?
  మా అన్నగారు ప్రొఫెసర్ వి.వి.కుటుంబరావు గారు (మెటలర్జి) మీకు పరిచయమేనా? ఐ.ఐ.ఎస్.సి లోనే చదివారు. కీ.శే.ప్రొఫెసర్ D.H.శాస్త్రి గారు వారి క్లాస్ మేటే.

  విన్నకోట నరసింహారావు

  April 5, 2017 at 1:20 pm

 2. Dear Sir THe author of Udyogaparvaalu is lellapalli venkata lakshminarayana sarma .I met once pRof Kutumba Ro Principal of GITAM

  kavanasarma

  April 5, 2017 at 10:23 pm

  • థాంక్స్ శర్మ గారు. లేళ్ళపల్లి వారని ఇప్పుడు గుర్తొచ్చింది. అయితే మీరు వ్రాసిన సీరీస్ కూడా ఒకటి వచ్చేది కదా దాదాపు ఆ సమయంలోనే (పేరు గుర్తు రావడం లేదు క్షమించాలి)? అందువలన రచయితలుగా మీరిద్దరి పేర్ల గురించి కొంచెం తికమక పడ్డాను.
   ప్రొఫెసర్ కుటుంబరావు గారు BHU లో Metallurgy Professor గా చాలా కాలం పని చేసారు. అక్కడ రిటైరయిన తరువాత మీరన్నట్లు గీతం ప్రిన్సిపాల్ గా చేసారు. అప్పుడు కలిసారన్నమాట మీరు. సంతోషం.

   విన్నకోట నరసింహారావు

   April 6, 2017 at 11:24 am

   • Brain drain anabadu amerika majili kathalu, vaddinche manavalla kathalu

    kavanasarma

    April 9, 2017 at 11:27 am

 3. Thank you Sir, for the information.

  విన్నకోట నరసింహారావు

  April 10, 2017 at 5:02 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: