my article in rachana March 2016
డి.వి . నరస రాజు 1
కవన శర్మ
1954, మార్చి 19 శుక్రవారం సాయంత్రం 6 . 30 గంటలకి ఒక గొప్ప ఘోరాన్యాయం జరిగి పోయింది నేను సాయంత్రం బాడ్మింటన్ ఆదుకుని వచ్చేసరికి ఇంట్లో మా అమ్మ తప్ప ఎవరు లేరు. నాన్న గారు ఊరు వెళ్ళారు . పిల్లి ఊరు వెళ్తే పిల్లలు ఎంత గోలగా సందడి గా ఉండాలి. కాని ఇల్లు భరించటానికి వీల్లేనంత నిశ్శబ్దం గా ఉంది
నాకు అర్ధమైపోయింది నన్ను తీసుకు వెళ్ళకుండా ఇద్దరు పెద్ద పిల్లలు నాకు అన్యాయం చేసి ఆ రోజునే సరస్వతి హాల్లో రిలీజ్ అయిన వాహిని వారి పెద్దమనుషులు సినిమాకి వెళ్ళారు . ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళటం అంటే ఎంత గొప్ప అనుభవం ! సాయంత్రం పెందలాడే భోజనం చేసి అరగంట ముందరే సినిమా హాల్ కి వెళ్లి టికెట్లు కొనుక్కుని ముందు సీట్ల పై కాలు పెట్టరాదు స్లయిడ్ పడక ముందే సీట్లో కుర్చుని చివరిదాకా అంటే మూడో జయహే అయ్యేవరకు సాంతం చూసే వాళ్ళం .సెలవలిస్తే ఒకటో రెండో సినిమాలని చూడనిచ్చే వారు.నాకు S.S.L.C.(11 వ తరగతి పబ్లిక్) పరీక్షలు జరుగుతున్నాయి 22 న అంటే సోమవారం మరో పరీక్ష ఉంది . సోమవారం అయితే నేను వెళ్ళేవాడిని . కానీ వాళ్ళిద్దరూ కొంపలంటుకుపోయినట్టు మొదటి రోజే వెళ్లి పోయారు
దేవుడున్నాడు ధర్మం గెలుస్తుంది. కాకినాడ లో ఉద్యోగం చేస్తున్న పెద్దన్నయ్య అనుకోకుండా దిగబడ్డాడు . నాకు జరిగిన అన్యానికి విచారించాడు. నాన్న గారు ఉళ్ళో లేనందుకు సంతోషించాడు . నన్ను రెండో ఆటకి తీసుకువెళ్ళాడు. ఆ సినిమా కి కథ సంభాషణలు వ్రాసిన ఆయన పేరు నరసరాజు అని టైటిల్స్ లో వేసారు ఆ విధంగా నాకు నరసరాజు గారి పరిచయ భాగ్యం కలిగింది. కనకసుందర గోవింద వరద గంగాబాయి భర్త హరిద్వారం వెళ్లి ఆశ్రమం మార్చుకున్నాడని తెలిసింది సేసావతారం ఇంట్లో ఆసుపత్రి వాసన రావటానికి కారణం అతగాడు కడుపులో గుల్మంగా ఉంటె మందుచ్చుకుంటాడని అతని భార్య చెప్పింది తిక్క శంకరయ్య కి సిద్దాంతి గారి లాంటి పెద్ద మనుషలని చూస్తే తన్నబుద్ది వెయ్యటం సాధారణంట అతనే చెప్పాడు .
పరీక్షలు పూర్తయ్యాక మరో సారి అమ్మా నా న్నల తో ఆ సినిమా చూసే అవకాశం వచ్చింది . రొజూ రాత్రి 8 గంటలకి పా ర్కు లో రేడియో ఆపేసాక ,ఉరు సద్దుమణిగి సరస్వతి హాల్లో వేసే సినిమా మాటలు పాటలు మాయింటికి వినిపించేవి .ఆకారణంగా ఆ సినిమా మాటలు పాటలు నాకు నోటికి వచ్చేసాయి . అల్లాగే శ్రీపాద వెంకటా చ లానికి కాచిభట్ల సత్య సారధి కి కూడా వచ్చేసాయి . మేము ముగ్గురం ఆరోజుల్లో డాబా గార్డెన్స్ పిల్లవాళ్ళ లో రచయితలుగా పేరు పొందాము . నేను ఆంద్ర సచిత్ర వార పత్రికలో ఒక కథ వాళ్ళు అందులోనే కాక తెలుగు స్వతంత్రలో కుడా చేరోటి వ్రాసేసి ఉన్నారు . ఆ రోజుల్లో పిల్ల రచయితలకి , సాటి రచయితల రచనలని కోట్ చెయ్యటం ఒక ఫాషన్ . ముళ్ళపూడి రాధాగోపాలాలు శ్రీశ్రీ మహాప్రస్థానాల తో పాటు మా సంభాషణలలో పెద్దమనుషుల్లోని మాటలు ‘తమ తాత గారితో చెప్పుకోండి ‘ ‘తమబోటి పెదమనుషుల్నిచుస్తే తన్నబుద్దేస్తుంది’ లాంటివి దొర్లించటం మొదలైంది ఎవరన్నా " బావున్నావా? " అని అడిగితే చాలు " మనలో చెడే పదార్ధం ఏముంది ?" అని సమాధానం చెప్పే వాళ్ళం
ఆ తరవాత అయన నాటకాల తో నాకు పరిచయం అయింది .పార్క్ లో ఉన్న మునిసిపాలిటి రేడియో లో ఆడది అని ఆయనే వ్రాసిన నాటకం రెండు మూడు సార్లు ప్రసారం అయింది. అందులో పని మనిషి "అమ్మా ! అంట్లు వేయమ్మా " అని పిలవటం తో పెళ్ళాం పుట్టింటికి వెళ్లిందని కోపగించుకున్న అయ్య ,"అంట్లు అమ్మకే గాని అయ్యకుండవా ?"అని విరుచుకూ పడతాడు. ఆ డైలాగ్ మానాన్న గారికి ఫేవరెట్. నాకు పరిచయం ఐన అయన రెండో నాటకం అంతర్వాణి. అంకితం వెంకట నరసింగ రావు సతీమని కళాశాల లో 19 55-56 విద్యా సంవత్సరం లో డ్రమటిక్ అసోసియేషన్ అనేది మొదలిపెట్టి ఎన్నికలు నిర్వహించారు . దానికి నేను కార్యదర్శిగా ఎన్నిక అయ్యాను .కాలేజి నిండా మహా మహులు మహిలు . గొల్లపూడి మారుతీరావు ,కోనా వెంకట రావు గొప్ప నటులు అన్ని నాటకాల నిండా వాళ్ళే ! వడ్డాది అప్ప చెల్లెళ్ళు ( ఇప్పుడు ఉమా రావు , సుమతి కౌశల్ లు గా మీకు తెలిసి న వాళ్ళు) గొప్ప డాన్సర్లు . నిడదవోలు మాలతి పెద్ద కథా రచయిత్రి పైగా సుమతి తప్ప అందరు నా క్లాసే .సెక్షన్లు వేరు నేను కార్యదర్శి గా పేరు నిలుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం తో , అంతర్వాణి నాటకానికి దర్సకత్వం వహించాను . అష్ట కష్టాలు పడ్డాను . నరస రాజు గారు నన్ను కష్టపెట్టిన రచయితగా గుర్తుండి పోయారు . నేను లేళ్లపల్లి లక్ష్మి నారాయణ శర్మ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లో నాటకాలు వ్రాస్తూ ఆడుతూ ఆడిస్తూ మధ్యలో పిహెచ్.డి లు చేసిన వాళ్ళం కనక ఆ స్నేహ భావం తో ఆయన నాకు వాళ్ళ బెజావాడ రచయిత ఐన నరసరాజు గారి వద్దకు మద్రాస్ వెళ్ళినప్పుడు తీసుకు వెళ్లారు. అది ఆయనతో ప్రత్యక్ష పరిచయం లేళ్లపల్లి వారు 1 969 నాటికి ఐ.ఐ.టి. కి మారిపోయి నరసరాజు గారితో బెజావాడ పేరుచెప్పి స్నేహం పెంచుకున్నారు
1982 లో అనుకుంటా నేను మద్రాస్ వెళ్ళినప్పుడు లేళ్లపల్లి, నాకు నరస రాజు గారిని పరిచయం చేసారు . "నేను రచయితనని ఆయనకు చెప్పకండి. ఆయన నన్ను " ఏమి వ్రాసారు ? " అని అడగటం నేను చెప్పటం ఆయన ‘మీరు వ్రాసే ఉంటారు నేనే చదవలేదు’ అనటం , ఇబ్బందిగా ఉంటుంది "అని చెప్పి వాగ్దానం చేయించుకున్నాను.
నరస రాజు గారు గంజి పెట్టిన తెల్ల పంచ క ట్టుకుని , చేతులున్న పలచటి బనియన్ స్వయంగా కుట్టించు కున్నది వేసుకుని కూర్చున్నారు.మమ్మల్ని లోపలి ఆహ్వానించి
లోపాలకి వెళ్లి లాల్చి వేసుకుని వచ్చారు." సినిమా వాళ్ళు కారు పంపుతున్నాము ఐదు నిమిషాల్లో అంటారు . అది అరగంటైనా రాదు .నేను చొక్కా తప్ప అన్నీ వేసుకుని పడక్కుర్చీ లో ఏదో పుస్తకం చదువుతూ కుర్చుంటాను . వాళ్ళు వస్తే చొక్కా వేసుకుంటాను . వాళ్ళు రాక పోతే నేను తయారై వాళ్ళ కోసం ఎదురు చూడటం లేదు కదా !అందుకని నాకు సైకోలోజికల్ ప్రెషర్ ఉండదు. మీరు సరిగ్గా చెప్పిన సమయానికే వచ్చారు" అని మెచ్చుకున్నారు
మా సినిమా సంభాషణ పెద్దమనుషుల మీదకి పోయింది. నేనూ, ఆయనా ఆ డైలాగ్స్ చెప్పుకుంటుండగా డగా ఆయన ఒక చోట మాటలు మర్చిపోతే గుర్తు చేసాను "ఎవరండి బాబు ఈయన .నన్ను ఇంతగా అభిమానించే భక్తుడు! పాతికేళ్ళ పాటు ఎందుకు దాక్కు న్నాడు ?" అన్నాడాయన ఆనందంగా
"ఈయనది విశాఖపట్నం, మన బెజావాడ కి కొంచెం దూరం . ఇప్పుడు,బెంగుళూరు లో ఉంటున్నరు కథలు వ్రాస్తూ ఉంటాడు కవన శర్మ పేరు తో ""ఎవరు ఆస్ట్రేలియా శర్మ ?ఆకర్షణా వ్యామోహం శర్మ ? " నరసరాజు గారి మొహం లో ఆనందం .ఇంకో రచయిత తన అభిమానైతే ఆనందం కాక మరేమిటి? నేనూ ఆనందించాను . తిరిగి వెళ్తున్నప్పుడు నా కాళ్ళు భూమి మీద లేవుట శర్మ గారు చూసానన్నాడు. పరిచయం అయ్యాక , కొనసాగింపుగా మరుసటి ఉగాది కి శుభాకాంక్షలు పంపాను. అందులో ‘మీ వీరాభిమాని శర్మ’ అని సంతకం చేసాను. వెంటనే ఆయన తిరుగు శుభాకాంక్షలు పంపారు. దాంట్లో ఆయన ‘మీ వీరడు నరసరాజు ‘అని సంతకం పెట్టారు
నేను ,మా తెలుగు సమితి కార్యదర్శి సుధాకర రెడ్డి తో ఒక సారి "మనం నరసరాజు గారిని పిలిచి మాట్లాడించాలి "ఆని చెప్పాను . అతను "అదే మన తక్షణ కర్తవ్యం " అన్నాడు. ఆయన్ని పిలిచి ఒక కోరిక కోరాం . అది ""మాకు పెద్ద మనుషులు సినిమా ప్రింట్ ఎక్కడా దొరకలేదు మీరు దాన్ని ఇప్పిస్తే వేసుకుని చూసి తరిస్తాము " అని . వాహిని వారు ఆ సినిమా ని ఒక 2 0 సంవత్సరాలుగా ఎక్కడా వెయ్యటం లేదు మరి. ఏమైపోయిందో!
ఆయన దానికోసం ఆంధ్ర మండలం అంతా గాలించగా గుంతకల్లు లో ఒక ఫిల్ముల రద్దు కొనే ఆయన దగ్గర ఉందని తెలిసింది .ఆ పెద్దమనిషి మనం అడిగితే వెతికి ఇవ్వడు కదా ! నరసరాజు గారు అక్కినేని వారిచేత అడిగించారు . గుంతకల్లు ఆయన మాకు దానిని లారీ లో పంపాడు పొద్దున్న నరసరాజు గారు మాట్లాదడే టట్టు సాయంత్రం మేము దాన్ని జింఖానా లో ప్రదర్శించేటట్టు ఏర్పాట్లు చేసాం . ఆ ప్రింటే ఆ తరవాత టి.వి. లలో మనం చూస్తున్న సంగ్రహ రూపానికి ఆధారం అన్నారు . అంటే ఆ సినిమా మళ్లి చెలామణి లోకి తెచ్చిన ఘనత మా తెలుగు సమితిదే అనుకున్నాము .
నరసరాజు గారు ముందు రోజు బృందావన్ లో వచ్చారు అతిథిగృహం లో ఆయనకీ ఏర్పాట్లు చేసాం .ఆయన తిరిగి వెళ్ళటానికి టికెట్టు కొని ఇచ్చాం . కాని రావటానికి అయిన ఖర్చు ఆయన పుచ్చుకోవటానికి నిరాకరించారు. అది ఆయన మంచితనం! అయన కు మర్యాదలు చేయాటానికి విద్యార్థులు ముందుకు వచ్చారు మర్నాడు ఆదివారం లెక్చర్ హల్లో పొద్దున్న 1 0 గంటలకి ఆయన ఉపన్యాసం . దానికి ముందర ఆయన ని నేను ఆహ్వానితులకి పరిచయం చేసాను .
ఆయన ‘పెద్దమనుషులు’ సినిమా విశేషాలు ఎన్నో చెప్పారు తనని , కె.వి రెడ్డి గారిని , బీ ఎన్ .రెడ్డి గారిని వాహిని వారి పెద్దమనుషులు గా వ్యవహరిస్తూ సినిమా ప్రపంచం లో వేళాకో ళం చేసేవారని నవ్వుతు చెప్పారు. పరమగురుడు చెప్పిన వారు కాదు సినిమాలో పాత్రలు . వాటి బుద్ధులు అన్ని పెడ బుద్ధులు కదా ! కనకసుందర గోవింద వరద గంగా బాయి గా వేసిన వెంకుమాంబ కూతురు రాజ్యలక్ష్మి ని చదలవాడ భార్య పాత్రకి ఎంపిక చేయటానికి కారణం ఆమె నిజ జీవితం లో కూడా అంత అమాయకంగా మాట్లాడటమే నన్నారు .ఆయన సినిమా వ్యక్తులు గురించి ఎంతో జన రంజకం గా మాట్లాడారు .
నేను ఆయన్ని " మీరు పండిత రంజకం గా పెద్దమనుషులు, పామర రంజకం గా గుండమ్మ కథ వ్రాసారు. కదా?" అని అడిగాను .దానికి ఆయన
" మా సినిమా వాళ్ళు తమ సినిమా రిలీజ్ అయిన రోజున తమ చారులని సినిమా హాళ్ళకి పంపుతారు . కవన శర్మ బాల్కనీ లో ఉండి నవ్వాడా సినిమా కి డబ్బులు రావని వాళ్ళకి అర్ధమై పోతుంది. పావలా పరకలో జనం నవ్వితే శతదినోత్సవమే . ఆ రెండు సినిమాలకి అదీ తేడా ! మీ మెప్పు ఎవరికి కావాలండి బాబు !. పెద్దమనుషుల కాపీకి మీరు ఎందుకు ఇబ్బంది పడ్డారో అర్ధమైందా!సినిమా కేవలం కళ కాదు వ్యాపారం కుడా ." అన్నారు . "ఆర్క్ లైట్ లలో ఇత్తడి రేకులు వేసుకుని అన్నేసి గంటలు నటించి నందుకయినా నట రత్నలాంటి బిరుదులూ ఇవ్వ వచ్చు. చాలామంది లో లేని ఎదో ఒక గొప్ప గుణం ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడే ఎవరయినా ఏ ఫీల్డ్ లో అయిన రాణించ గలరు " అని ఆ రోజున ఆ ఆయన చెప్పినది నేను ఎప్పటికి మర్చిపోను. నాకు ఉన్న గొప్ప గుణం జ్ఞాపకం .
కాలగర్భం లో మరి కొన్ని సంవత్సరాలు కలిసి పోయాక , సుధాకర రెడ్డి కి మూడు రోజుల పాటు నాటక పోటీలు నిర్వహించాలన్న కోరిక కలిగింది . మూడు రోజులు పొద్దున్న సాహిత్యోపన్యాసాలు , సాయంత్రాలు నాటక పోటీలు అది అతని పథకం . పఠాభి ( పంచాంగ కర్త , భాగ్యచక్రం, సంస్కార సినిమాల నిర్మాత ) డి.వి నరసరాజు ( సినిమాలకి నాటకాలకి మా తరానికి పెత్తండ్రి ) కాళీపట్నం రామా రావు (కథల మేష్టారు) వీళ్ళని ఒప్పించాము . ఉపన్యాసకులు న్యాయ నిర్ణేతలు వీరే ! పఠాభి, బెంగలూరు లోనే ఉంటారు . మిగిలిన ఇద్దరు మా ఇంటి లోనే . ఆ రోజుల్లో మా ఆవిడ వండ నలయదు. నరసరాజు గారు ముందు రాత్రి వచ్చారు. కాళీపట్నం వారికి మా ఇల్లు కొత్త కాదు.మా ఆవిడ అడిగింది "నరసరాజు గారూ! తెల్ల బట్టలు అందులోనూ గంజి పెట్టిన పంచ లాల్చి మెన్ టైన్ చెయ్యటం కష్టం కదా! మీరు ఎల్లప్పుడు మల్లెపూవుల్లాంటి బట్టలు ఎలా కట్టుకోగాలుగుతున్నారు?"
"మా అత్త వారు మా ఆవిడ తో పాటు ఒక అరణపు చాకలిని పంపారు. "అని నవ్వుతు జవాబు చెప్పారు. న రసరాజు గారిది భీమ వరం .మా ఆవిడది తణుకు. గోదావరి నీళ్ళకి సముద్రం తో కలిసీ పోయే లక్షణం ఉంది . ఆ ఇద్దరు విశాఖ వాడినైన నాతో కలిసి పోయారు
తరవాత అజో విభో వారు భీమవరం లో పెట్టిన ఒక కార్య క్రమం లో కలిసాం. ఆశ్చర్యంగా ఆయన మా ఆవిడని గుర్తు పట్టలేదు వెంటనే. ఆయన" నాకు వయసు వస్తోంది " అన్నారు . విశాఖ లో మిత్రులు ఆయనని ఒక సాహితి సభకి పిలవమన్నారు.పిలిస్తే " నా ఆరోగ్యం సరిగా లేదు నేను రాలేను. " అని రాలేదు.
చివరిసారి 2౦౦౦ లో ఆయన్ని హైదరాబాద్ లో కలిసాను అప్పుడు నేను ఆయనా ఆ ఉళ్ళో ఉన్నాము . కథా నిలయానికి నరసరాజు గారి కథలు పట్టుకురమ్మని ఆజ్ఞాపించారు రామా రావు మేష్టారు ‘
" మీరు వచ్చి తీసుకువవెళ్ళండి " అన్నారు నరస రాజు గారు. " రాజులు అందరిని భార్యా పిల్లలతో సహా మీరు అని సంబోదిస్తారు కదా ?" అని అడిగాను
దానికి ఆయన " మరే మాకు మీలాగా అమ్మాలని అక్కలని ఏమే అనే అలవాటు లేదు" అన్నారు రాజుల మీద ఈయన ఈగ వాలనీయడు, అది భీమవరం పద్ధతి , అదే మా కలిదిండి పతంజలి అయితే, ఆయన పద్ధతే వేరు !
ఇంతకూ , అప్పుడు నరసరాజు గారు ఆయన మనవరాలితో ఉంటున్నాడు . ఆ మనవరాలి భర్త సినిమా హీరో సుమన్ !
"నేను సినిమా హీరో ల ఇంటికి వచ్చి విధిలో గూర్ఖా చేత గెంటించు కోవటానికి ఇష్టపడను ."నేను గుమ్మం ముందు నిలబడలేను. కాని మీరు వస్తారనీ, రాగానే నాకు చెప్పమనీ ,గేటు వద్ద ఉండే మనిషి తో చెప్తాను" అన్నారాయన. ఆ మాట నిలబెట్టుకున్నారు. నేను, మా ఆవిడా గేటు వద్ద నిలబడాల్సిన అవసరం రాలేదు .
కింద అంతస్థులో ఓ పెద్దగదిలో కూర్చోపెట్టి మాట్లాడారు. తను వ్రాసిన ఏకైక కథ ‘పరస్ప్పరం’ అచ్చైన పాత పత్రిక ఇచ్చారు.వృద్ధులు తమ తరవాతి తరం వాళ్ళతో ఉండాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలని తను అనుకుంటున్నారో ఆ’వృద్ధ బాల శిక్ష ‘ వ్రాస్తానని చెప్పారు . వ్రాసారో లేదో తెలియదు. అది నాకిప్పుడు కావాలి .
" నేను ప్రతి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు , తెలిసిన అందరికి ఎందుకు పంపుతానో తెలుసా ? నేను బతికి ఉన్నానని వాళ్లకు తెలియటానికి .వాళ్ళు తిరిగి జవాబు వ్రాస్తే వాళ్ళు కుడా క్షేమమే అని నాకు తెలుస్తుంది" అన్నారు . ఇంతలో సుమన్ భార్యా కూతురు బయటి నుంచి వచ్చారు . పరిచయాలు అయ్యాక మేము సెలవు తీసుకుని బయలుదేరాము
అదే చివరి చూపు. అదే చివరి జోక్ . ఆ క్రితం సంవత్సరం పంపినవే నా వీరడు నుంచి వచ్చిన చివరి శుభాకాంక్షలు ***రాను" అన్నాను .
Quite nice Sir, I have a photo taken at that time (Sudhakara Reddy Garu, Kara Garu, Meeru, Narasa raju Garu, Nenu); shall I post it in FB?
Regards
Rajanikanth
K. Rajanikanth
March 7, 2016 at 6:22 pm