Kavana Sarma Kaburlu

All Rights Reserved

కాలం కొలవటం

మానవులు మొదట సూర్యోదయం సూర్యాస్తమయం గమనించారు. దానితో వారు కాల్ గణన మొదలుపెట్టారు. ఒక పగలు( అహం ) ఒక రాత్రి కలిసి ఒక దినం అన్నారు. అది సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం దాకా . తర్వాత చంద్రుడు వృద్ధి పొందటం క్షీణించటం గమనించారు ఆ రెండు పక్షాలు కలిపి ఒక నెల అన్నారు. అది సాధారణం గా పున్నమి నుంచి పున్నమి కో అమావాస్య నుంచి అమావాస్యకో . లెక్కపెట్టేవారు. ఆ నెల 29 దినాలకంటే కొద్దిగా ఎక్కువ అని తెలుసుకున్నారు. అతి దూరం గా ఉన్న తారలు ప్రతి దినం ఒక చోటే కనిపిస్తుంటే వాటిని ఆధారంగా చేసుకుని సూర్య చంద్ర గమనాలని గుర్తించారు .ప్రతి దినం ఆకాశం లో చరించి అదే స్థానం కి రావటానికి 27 దినాలకంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది అని గ్రహించారు ప్రతి అమావాస్య నాడు సూర్యుడు ఆకాశం ఉండే స్థానం ఒకటి కాదని సూర్యుడు కదులుతాడ ని గుర్తించారు. సూర్యుడు ఆకాశం లో స్థిరం గ ఉన్నట్టు కనిపించే తారలతో ఒక తార వద్ద ప్రయాణం మొదలు పెట్టి అక్కడకి తిరిగి రావటానికి 365 దినాలకి మీద కొద్దిగా పడుతుందని గ్రహించారు. దాన్ని సంవత్సరం అన్నారు. ఆకాశం లో ఒక చుట్టు తిరిగి రావటానికి చంద్రుడికి రమా రమి 27 దినాలు పదుందికనక ఖగోళం లో రమి 26000 ఒక దినం లో 27 వ భాగం తిరుగు తాడుకనక ఖగోళాన్ని 27 భాగాలుగా విభజించి ఆ భాగాలకు అశ్విని ,భరణి అంటూ పేర్లు పెట్టారు. ఇవి నక్షత్రాలు అని పిలవబడుతాయే కానీ నక్షత్రాలు కావు .ఉదాహరణ కి అశ్వని , అశ్వ ముఖం లా కనిపించే మూడు తారల సముదాయం. కొన్ని భాగాల్లో వెలిగే తారలే కాక మేఘాలు కూడా ఉన్నాయి
సంవత్సరాన్ని కొలవటం ఎక్కడ నుంచి కొలవటం మొదలైన 365. 25 దినాలకి పూర్తి అవుతుంది . కొలతవటం మొదలు పెట్టిన బిందువుని ,మూలబిందువు అంటాము. అవి సాధారణం గా మొదట్లో ఉత్తరాయణ ప్రారంభ బిందువులు గాను విషు బిందువులు గానో ఉండేవి. . అయితే ఈ బిందువులు కూడా ఖగోళం లో చరిస్తూ ఉంటాయి. వీటి ఆవృత్త కాలం మొదట్లో 27 X 1000 సంవత్సరాలుగా గణించారు ఇప్పుడు మనకి అది రమా రమి 26000 సంవత్సరాలని తెలుసు.
ఇంతకు చెప్ప వచ్చేదేమిటంటే సంవత్సరం లో ప్రతి దినం సూర్యుడి ఒక ప్రత్యేక స్థానం తెలియ చేస్తుంది . కానక మూలా బిందువుగా ఏ దినం తీసుకున్నా అది వీలు ప్రకారమే. చంద్రుడి ప్రకారం సంవత్సరాది ని తీసు కుని . సంవత్సరానికి 12 నెలలు గా తీసుకుంటే సంవత్సరానికి 12X29.5 ( 354) దినాలే అవుతాయి. కానక అధిక మాసాలు లాంటి కావలసి వస్తాయి.

Written by kavanasarma

January 4, 2017 at 12:18 am

Posted in Uncategorized