Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

16 January, 2018 11:49

బ్రెయిన్ డ్రెయిన్ నా మొదటి పుస్తకం దాన్ని ఎమెస్కో వారు అచ్చు వేసారు ( 1974 ) .నా ఆరవ పుస్తకం సంఘపురాణం .దాన్ని నవోదయా రామ మోహన్ రావు గారు వేసారు( 1979) .వీటికి మరి కొన్ని రచనలు కలిపి వ్యంగ్య కవనాలు గా వాహిని బుక్ సంస్థ శాయి గారు ( 1994 ,2001) వేసారు. ఈ పుస్తకం మీద మిత్రులు శ్రీ రమణ గారు సమీక్ష వ్రాసారు . పుస్తకం పెట్టుబడి వెనక్కి రాక పోయినా మంచి పేరు తెచ్చిం ది . అది నా అదృష్టం .బహుశః ఈ పుస్తకం వలనే నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హాస్య రచనలకి గాను 1996 లో నాకు పురస్కారం ఇచ్చింది
బంగారు రోజులు నా రెండో పుస్తకం .198 వ దశకం లో నవలలకి కథల కంటే గిరాకి ఎక్కవ అని పుస్తక ప్రచురణ కర్తలు అనే వారు.ఈ నవల వ్రాయటానికి ఇదొక కారణం .PGWH వ్రాసిన మైక్ ఎట్ రైక్లిన్ చదవి " మన కాలేజి దినాలు మాత్గ్రం ఇంత బావుండవా" అనుకోవటం మరో కారణం. ఈ నవల వ్రాసేటప్పటికి నేను ఆంద్ర పత్రిక ,ప్రభ వార పత్రికల్లో వ్రాసిన శేషగిరి శకుంతల కథల వలన కొంత హాస్య రచయితగా పేరు పడి ఉన్నాను. నవలాకారుడిగా పేరు కొట్టేయటం, నవ్బలా ప్రియదర్శని ప్రవేశ పెట్టిన ఆంధ్రజ్యోతి లో చోటు సంపాదిన్చాలనుకోవటం మూడవ కారణం .
ఈ నవల 1975 దీపావళి సంచికలో మొత్తం ఒకే సారి ప్రచురించారు. అయితే ఎన్నాళ్ళకకీ వేస్తారో వెయ్యరో తెలియక పురాణం కి ఉత్తరం వ్రాసి పడేసాను. ఆ ఉత్తరానికి పురాణం జవాబిచ్చి స్నేహితుడు అయిపోయారు. ఇది మొదటి లాభం. నాకు ఈ నవల చాల మంది fans ని సంపాదించింది. ముఖ్యం గా నేను వ్రాసిన స్వ పరిచయం వలన . ఈ నవల చదివి ముళ్ళపూడి ( అప్పటికే ఆయన తో కొద్ది పరిచయం ఉంది ఏకలవ్య శిష్యరికం వలన )తో శ్రీ రమణ " వీడు పైకి వస్తాడు " అన్నారుట . ఆతరవాత పరిచయం అయ్యాక శ్రీరమణే స్వయం గా నాతో అన్నారు. ఇది మూడో లాభం . ముఖ్యమైన లాభం నవ భారత్ ప్రచురణ కర్తలు నా నవల వేస్తామని వాళ్ళంతట వాళ్ళే ముందుకు వచ్చి బాపు చేత బొమ్మలు వేయించి 1976 లో ప్రచురించారు.
2003 రచన శాయి గారు దీన్ని తిరిగి పుస్తక రూపం లో తీసుకు వచ్చారు. ఇది సినిమాకి మంచి ఇతివృత్తం అని నా కో అభిప్రాయం ఉండేది. అదే అభిప్రాయం శాయి కి కలిగి జంధ్యాల కి పంపారు. ఆయన ఇది చాల భాగాలలో గొప్పగాను , సినిమాకి పనికి రాకుండాను ఉన్నదని తేల్చేసారు.
ఆ రోజుల్లో శేఖర్ కమ్ముల సినిమా ప్రపంచం లో పుట్టి ఉంటె ఇదే తీసి ఉండే వారు హాపీడేస్ బదులు. అనుకున్నాను ఆసినిమా చూసాక . అంటే నేను నా కాలం కంటే ముందు వాడినని సరి పెట్టేసుకున్నాను

తియ్యని బాధ నా మూడో పుస్తకం. .నవభారత్ వారు నా బంగారు రోజులు వేస్తామనగానే "నేను కొన్ని హాస్య ప్రేమ కథలు వ్రాసాను పుస్తకం వేస్తారా ? " అని వారినే అడిగాను,. వారు "నవలలే వేస్తాము కథల పుస్త్కకాలు అమ్ముడు పోవు " అని జవాబు ఇచ్చారు.
నేను శేషగిరి శకుంతల( చీరలు ,మిరియాల కషాయం ,ఇసుక తిన్నెలు) కథలు, బావమరిది కారు కథ రౌడి అబ్బాయి సింహం ( నర ) సరోజ కథలు నారాయణ రాజు ( పౌడరు డాబ్బా) రాధారాణి కథ, చలం ( ఇడ్లీలు) కనకమహాలక్ష్మి కథ ,బెంగళూరు అయ్యర్ ,అయ్యంగార్ మామీల వటా రం కథ ఇలా ఎన్నో ఒకే పాత్రలతో
1956 -74 మధ్య కాలానికి చెందినా కథలు వ్రాసి ఉన్నాను ఆ కథలనే ఇటుకలని, సిమెంట్ మోర్టార్ లాంటి వాక్యాల తో కలిపేసి సివిల్ ఇంజనీర్ని అయిన నేను నవలా గోడ కట్టేసాను ( ఈ మాట శ్రీ రమణ ది ) .దాని పేరే తియ్యని బాధ .ప్రేమే ఒక తియ్యని బాధ . దానిని 1976 లో నవభారత్ వారు అచ్చు వేసారు ఆ పుస్తకం ఇప్పుడు దొరకదు. కానీ అక్టోబర్ 1995 నుంచి ఏప్రిల్ 96 వరకు మిత్రులు రచన శాయి, దానిని ధారావాహికం గా ప్రచురించి మళ్లి దానిని జనం లోకి తీసుకు వెళ్ళారు.
ఈ మధ్య శ్రీమతి కె.బి లక్ష్మి దాని మీద వ్యాసం వ్రాస్తానని ఉన్న ఒకే ఒక కాపి తీసుకుని వ్యాసం వ్రాసి ప్రచురించి దాని కి ఆయుష్షు పోసి నా పుస్తకాన్ని పువ్వులో పెట్టి వాపస్ పంపించారు
ఒక చిన్న పిట్ట కథ . ఆ మధ్య ఒకాయన , తెలుగులో హాస్యనవలల మీద పి.హెచ్ డి చేసిన ఆయన ,"మీ నవల బ్రెయిన్ డ్రెయిన్ నాకు అందుబాటులో లేక దానిని నా థీసిస్ లో చేర్చలేదు" అని వాపోతూ వ్రాసారు. " అయ్యా అది నవల కాదు మీరు ఏ పొరపాటు చేయలేదు. ఆ విషయం లో పోతే నేను నా , బంగారు రోజులు , తియ్యని బాధ నవలలని ఇన్నాళ్ళు హాస్య నవలలు అనుకున్నాను కాదన్నమాట " అంటూ వోదారుస్తూ వ్రాసాను. తెలుగు లో పి. హెచ్. డి లు చేయించేవారు ,చేసే వారు మేము చేసేటట్టు literature survey అంటూ చెయ్యరా? అన్న అనుమానం మిగిలిపోయింది .మరి నేను చదివిన అన్ని పద్య కావ్యాల్లోనూ పూర్వ కవి స్థుతి చూసానే ! తెలుగు ఆచార్యులు ఎవరైనా నా సందేహం తీరుస్తారని ఆశిస్తున్నాను

నా నాలుగో పుస్తకం పరిధి 1975 లో దీపావళి సందర్భం గా ఆంద్ర సచిత్ర వార పత్రిక నిర్వహించిన నవలికల పోటీలో నా నవలిక మొదటి బహుమానం సంపాదించింది అది డిసెంబర్ 1975 – జనవరి 1976 లలో 4 వారాల పాటు ధారావాహికంగా ప్రచురితమై మన్నలను పొందింది . అవి ఇంకా నవలల రోజులే. ఇది extensions ఉంటె కాని నవల అవదు. నాలోని సివిల్ ఇంజినీర్ వెంటనే దీనికి ‘ఎదురీత ‘ పెంపకం’ కథలు జోడించి approval కి నవ భారత్ వారికి పంపాను. వారు దీన్ని పరిధి అన్న పేరు కొందరికి తలనొప్పి కారకం అవుతుందని నా ఆనుమతి పొంది దానిని "తల్లి చాటు బిడ్డ ‘ గా అక్టోబర్ 1978 లో ప్రచురించారు. ఆపైన నేను వెస్ట్ ఇండీస్ కి ఉద్యోగ రీత్యా షికారు వెళ్లి వచ్చాను.
నా అభిమానులు " మీ పరిధి ఎందుకు పుస్తక రూపం లో వెయ్య లేదు ?" అని అడుగుతుంటే సెప్టెంబర్ 1998 లో దాన్ని నాకు నచ్చిన పేరు తోనే అచ్చు వేసి అడిగిన వారికల్ల పంచి పెట్టాను 1999 లో నా 60 ఏళ్ల పండగ సందర్భంగా మిత్రులు వల్లం పాటి ,వ్యాసం వ్రాసారు. శ్రీమతి గౌరీ కిరుబానందం గారు స్నేహధరమం గా పరిధిని PDF చేయించి ఇచ్చారు.కోరికబలం గా ఉన్న వారుkavanasarma.wordpress.com లో ఆ నవలని చదవవ్చు extensions కట్టడంలో నా సివిల్ ఇంజీరింగ్ నేర్పరితనం గురింఛి( నేను సంఘపురాణం లో అనుసరించిన పద్ధతి లో నే )" కవన శర్మ 6 పదులని అతిక్రమించుట " అని పేరు పెట్టిన వ్యాసం లో ఉటంకించిన మిత్రులు శ్రీ రమణ కి ఎల్లపుడు కృతజ్ఞుడిని

Written by kavanasarma

January 16, 2018 at 11:49 am

Posted in Uncategorized

%d bloggers like this: