Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

My Drama

గీతం :వార్షికోత్సవ ప్రదర్శనలు : నాటివిద్యార్థులు ప్రదర్శించిన నా నాటకం : నేను (1979) ఆంద్ర భూమిలో దశ దినో త్సవం అనే కథ వ్రాసాను .దానికో నేపథ్యం ఉంది. నాకు ఇంజినీరింగ్ లో ఒక సంవత్సరం సీనియర్, మెకానికల్ ఇంజినీరింగ్ faculty , అయిన I Ch Basavaraju, ఎదో పని మీద మాయింటికి వచ్చి " శర్మా ! నాకివాళ గొప్ప ఆనందం గా ఉంది. కాలేజీ తెరిచి ఇంకా 40 రోజులు కూడా పూర్తికాలేదు .నిన్నటి తో మేము 10 Working Days పూర్తి చేసిన ఘనత సాధించాం " అన్నాడు.
ఆ రోజుల్లో విద్యార్థులు ఎదో ఒక నెపం మీద

స్ట్రైకు

చేసే సాంప్రదాయం ఏర్పరుచుకుని ఉన్నారు .మా చిన్నప్పుడు మేమూ చేసాం స్ట్రైకులు .ఆంధ్రరాష్ట్రం కోసమో ,గోవా విముక్తి కోసమో ! అందరికి అంత గొప్ప కారణాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా !అందుకని VC తనమనవడి బారసాలకి సెలవు ఇవ్వక పోవటం లాంటి చిన్న తప్పిదాలు చేయటం తడువు స్ట్రైకు చేసే రోజులు అవి అందుకని దశ దినాల పాటు పనిచేసిన విద్యాలయాలు Celebrate చేసుకోవాలని అనుకుంటే వారిదా తప్పు ?.అల్లా బసవరాజు ఇచ్చిన స్ఫూర్తి తో నేను ‘దశ దినోత్సవం ‘ కథ వ్రాసాను .దానిని శ్రీ కాళీపట్నం రామా రావు గారు తాను అచ్చు వేసిన, నా కథల సంపుటికి 1995 లో ఎంపిక చేశారు. ఆ కథని నేను బసవరాజుకే అంకితం ఇచ్చాను. పాపం అప్పటికే BP కి వలన అనుకుంటాను అతను కీర్తి శేషుడయ్యాడు .మీకు జేష్ఠ అనే రచయిత గుర్తుంటే అతనే ఇతను .అతని పేరు మీద ఆయన భార్య జానకి గారు ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారాల్లో ఒకటి ఆ సంవత్సరం నాకిచ్చారు . ఇద్దరం ఇంజినీరింగ్ మేష్టర్ల మవటం వలన మాకు మా విద్యార్థులు స్ట్రైకులు చేసేటప్పుడు పాటించే సూత్రాలు తెలుసును
మన దేశం లో Indian Standards Organisation ( ISO ) అనే ఒక సంస్థ ఉంది అది Design సూత్రాలని ( Codes) ఇస్తుంది .ఉదాహరణకి Concrete లో కలిపే రాళ్ళకి పరిమాణాల పరిమితులని ఇస్తుంది.
అంత పెద్ద సంస్థ, స్ట్రైకులు చేసే విద్యార్థులు రువ్వే రాళ్ళ Sizes విషయం లో పాటించాల్సిన సూత్రాలు ఏవీ ఇవ్వలేదు. అందుకని మా విద్యార్థులే పరిశోధనలు చేసి ‘ బస్సు అద్దం బద్దలు కొట్టాలంటే రాయికి ఇండాల్సి ద్రవ్య రాశి ఎంత. ? రైలు బండి కిటికీ ఊచలలోంచి దూసు కు వెళ్ళాలి అంటే విసర బడే రాయి ఏ గరిష్ఠ పరిమాణానికి లోబడి ఉండాలి ?’ అనే విషయాలు, స్వయంగా తేల్చుకున్నారు
గీతం విద్యార్థులకి "సినిమా పాటలకి చిరంజీవి స్టెప్పులు వేయటం కాదు మీ నిత్య జీవితం తో ముడి పడిన , మీ జన్మ హక్కు అయిన స్ట్రైకుల గురించి మీరు మీ సహాధ్యా యి లని చైతన్య వంతులుగా గా చేయాలి " అని జ్ఞానం బోధించాను
వాళ్ళు భక్తిగా " అటువంటి వ్రతంబొక్కటి ఆనతిచ్చి మమ్మలిని కృతార్ధులని చేయండి !" అని సవినయంగా కవనుని ప్రార్ధించిన వారైరి .వారికి దశ దినోత్సవ సందర్భంగా బసవుండు AU విద్యార్థులకు చెప్పిన వ్రతంబు , గీతం పిల్లలకి కవనుండు ఉపదేశించెను
వారు అప్పుడు " మేము ఏమి నెపంబున స్ట్రైకు చేయగలవారమో కూడా చెప్పి మమ్ములను ఉద్ధరించుడు" అని కోరగా .
"మీరు 3rd year 2nd semester Regular , 3rd year 1 st semester Advanced , 2nd year Supplimentary అనే పరీక్షలు రాయటానికి సతమత మవుతూ ఉంటారు కదా వాటివిషయం లో పరీక్షకి పరీక్షకి మధ్య ఒక రోజు Gap ఉండాలని స్ట్రైకు చెయ్యండి . అప్పుడు మేష్టర్లకి ప క్లాసులు పీకటానికి టైం ఉండదు. అందుకని విధిగా సిలబస్ నెత్తిన ఇంక బస్ అని శీల కొట్టేస్తారు " అని వారికి చెప్పి ఆ పిమ్మట ఆ విషయం పై ఒక ప్రదర్శనార్హమైన ఒక నాటకం వ్రాసి ఇచ్చాను .హెడ్ తలుచుకుంటే నటులకి కొదవా !
ఆ నాటకం విద్యార్థులకి కొత్త ఆలోచనలను రేకెత్తించటం తో , విజయ వంత మైంది

Written by kavanasarma

June 24, 2018 at 2:26 am

Posted in Uncategorized

%d bloggers like this: