Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

17 April, 2017 23:50

6. సాపేక్షత
ఒక పరిశీలన పై పరిశీలిస్తున్న వ్యక్తి ప్రభావం ఉంటుంది అని ఒప్పుకుంటూనే ,అసలు సత్యం అనేది ఒకటి , ప్రదేశ కాల ఆవరణలో ఉంటుందని ,దానికి ఎందరు పరిశీలకులు పరిశిలించగలరో వారందరూ పరిశీలించినప్పుడు కనిపించే అన్ని అంశాలు అది కలిగి ఉంటుందని అయితే అందులో ఒకటి మాత్రమే ఒక పరిశిలకుడికి కనిపిస్తుందని , అన్ని అంశాలు దైవ దృష్టికి మాత్రమే కనిపిస్తాయని ఐన్ స్టీన్ నమ్మాడు , మానవ దృష్టికి నైరూప్యమైన ఆ సత్యాన్ని, ఆయన గణిత సమీకరణాల లో వివరించాడు.
అటువంటి పరమ సత్యం ఉన్నదని దానిని శాస్త్రజ్ఞులు పరిశిలించగలరని నమ్మిన వాడు న్యూటన్ .మానవులు తమకి అత్యనుకూల నమ్మకాలతో తమ తమ వ్యక్తిగత ప్రచ్యోదనాలల(Impulses) వెంట పడతారని ఫ్రాయిడ్ , నీట్జే( Nitzsche) చేసిన ప్రతిపాదనలలో అంతర్గతం గ పరమ సత్య భావన ఉన్నది.
ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలలో సాపే క్షకత చాల లోతుగా పాతుకు పోయి ఉంది. నిర్మాణాన్ని తొలగించే ఆధునికానంతర వాదం లాంటి తాత్వికతలు . ప్రామాణిక మూ సత్యమూ అయిన విలువలు అని అనుకునే వాటి పట్ల, ఒక స్థిరమైన దృష్టి కోణం పట్ల ,మళ్లి మాట్లాడితే హేతువు పట్ల తిరుగు బాట్లు గా వచ్చినవి .
ఇప్పుడు వాడకం లో రెండు మాటలు ఉన్నాయి .అవి ఒకే విషయం గురించినవి. కాని రెండు విశ్వ వీక్షనాలకి సంబంధించినవి .అవి సానుభూతి సహా అనుభూతి. మొదటిది మనం అవతల వారి పరిస్థితి లో ఉంటే పడే బాధకి ప్రతి స్పందన. ఇది న్యూటనిక విశ్వ వీక్షణం కి చెందిన భావజాలానికి సంబంధించిన మాట. రెండోది , మనం ఆ పరిస్థితుల్లో ఉండలేము అని తెలిసి , ఆ పరిస్థితుల్లో ఉన్న వారి కి సత్యం గా భాసించేది మనకి గోచరించే దానికి వేరుగా ఉండ వచ్చు అన్న అవగాహన తో కూడిన భావజాలానికి చెందిన న్యూటననిక విశ్వ వీక్షణానికి తరవాత వచ్చిన స్థాన మార్పు వలన కలిగిన అవగాహన .
ఇది ఈ నాడు సాహిత్యం లో చాలా ప్రధాన పాత్ర వహిస్తోంది . అస్తిత్వ వాదులు " మీరు మా ఇబ్బందులను సానుభూతి తో అర్ధం చేసుకోలేరు. సహా అనుభూతి చెందే అంతగా మీ విశ్వ విక్షణ స్థానం మారలేదు " అంటున్నారు.
ఐన్ స్టీన్ యొక్క గురుత్వాకార్షక సూత్రాలకి , విశ్వం వ్యాకోచిస్తోందన్న పరిశీలన జోడిస్తే ఇప్పుడు రమా రమి అందరు అంగీకరించిన ‘పెద్ద పేలుడు’ ప్రతిపాదన ను ఇస్తుంది.
విశ్వ పదార్ధం యొక్క ఇప్పటి సగటు సాంద్రత, ఒక కీలక మైన విలువ కంటే ఎక్కువ అవటం, తక్కువ అవటం , దానికి అతి దగ్గరగా ఉండటం అనే పరిస్థితి బట్టి విశ్వం మళ్లి కుచించుకు పోతూ ఒక గోళాకారం తీసుకుని సాంద్రత పెరుగుతూ పోయి దాని పరిమాణం తిరిగి ఒక బ్రహ్మాండం ( అతి బరువైన రేణువు) గా మారటం లేక , అనంతమైన గంప ఆకారం లో వ్యాకోచిస్తూ పోయి సాంద్రత తగ్గుతూ పోవటం , లేక సాంద్రత తగ్గుతూ , ఆ తగ్గటం తగ్గుతూ పోయి ఆ కీలక విలువను స్పర్స రేఖ గా చేరుతూ, చదునైన విశ్వానికి దారి తీయటం జరుగుతుంది అని సాధారణ ( సామాన్య ) సాపేక్ష సిద్ధాంతం వివరిస్తుంది. ఈ మూడు పరిస్థితుల్లోనూ గురుత్వాకర్షణ వ్యాకోచాన్ని వ్యతిరేకించి తగ్గిస్తుంది . ఈ రోజున మనకి ఈ మూడింటిలో ఏమి జరగబోతోందో తెలియదు కానీ కీలకమైన సాంద్రత కి పెద్ద దూరం లో ఇప్పుడు మనం పరిశీలించగలిగిన విశ్వ సాంద్రత లేదు !
వెలుగు వేగం స్థిరమన్నభావం ఐన్ స్టీన్ ప్రదేశ- కాల ఆవరణ కున్న ఒక లక్షణం నుంచి సాధ్యం అవుతుంది. అది కదులుతున్న వస్తువు దిశలో కాలం సాగి నెమ్మదిగా గడుస్తుంది. పొడుగు కుచించుకుని పొట్టిది అవుతుంది. అయితే ఆ వేగం , వెలుగు వేగం తో పోల్చినప్పుడు గణనీయం కాకపోతే , న్యూటనిక న్యాయాలు వర్తిస్తాయి.
అటువంటి దే శక్తి విషయం లో ఐన్ స్టీన్ విశ్వానికి మరో లక్షణం ఉన్నది. అది వేగం పెరిగినకొద్దీ ద్రవ్యం ( mass ) పెరుగుతుంది అనే లక్షణం. ఇక్కడ గుర్తు ఉంచుకోవాల్సిన విషయం పదార్ధం వేరు , ద్రవ్యం వేరు. అదే పదారధం యొక్క ద్రవ్యం వేగం పెరిగిన కొద్ది పెరుగుతుంది. అంటే వేగం పెరిగిన కొద్ది , దాని వేగం ఒక ఏకకం ( unit) మార్చాలంటే అవసరమయ్యే బలం పెరుగుతూ పోతుంది. ఆ ఏకకం మార్పుకి ఇవ్వాల్సిన శక్తీ కుడా పెరుగుతూ పోతుంది. వెలుగు వేగం తో పోల్చినప్పుడు సాపేక్షికం గా పదార్ధ వేగం గణనీయం కానప్పుడు , న్యూటనిక న్యాయాలు వర్తిస్తాయి. ఐన్ స్టీన్ విశ్వానికి , న్యూటన్ విశ్వం ఒక ఉజ్జాయింపు అన్నమాట . పదార్ధ వేగం వెలుగు వేగానికి దగ్గర పద్దకొడ్డి కావలసిన బలం, శక్తీ అనంతమైపోతాయి .అందుకని ఆ వేగాన్ని అందుకోవటం కాని దాటటం కాని సాధ్య పడదు.
కాలం లో ప్రయాణించటం సాధ్యమా ?సైన్సు కల్పనలు మనకి విచిత్రమైన ఉహాలు కలిగించాయి..ఇవాళ బయలుదేరి నిన్న మళ్ళి ఇక్కడకు చేర గలమా ? ఎవరైనా గతం లోకి ప్రయాణించి తన తల్లిని కన్యగా ఉండగానే హత్య చేశారనుకుందాం .అప్పుడు చరిత్ర మారిపోతుంది కదా అదెలా సాధ్యం ? అప్పుడు ఆ ఎవరు , ఎవరుగా ఉంటారు? ఈ ప్రశ్నకి రెండు విధాలుగా సమాధానాలు చెప్పవచ్చు.
మనకి ఏ పనైనా చేయటానికి స్వతంత్రత ఉంటుందన్నది ఊహ మాత్రమే కనక మనం గతం లోకి వెళ్లి నప్పుడుసాక్షిగా మాత్రమే ఉంటాం అన్నది ఒక సమాధానం.
రెండోది ప్రదేశ కాలాలకి సంబంధిచిన జంట సంఘటనలలో శక్యాలు( potentialities ) ఎన్నో ఉంటాయి. అందులో మనం చూస్తున్న ప్రపంచం లో ఎదో ఒకటి జరుగుతుంది . అది మనచరిత్ర. తరవాతీ జంట సంఘటనలలో మళ్లి ఎన్నో శక్యాలు . ఒక చరిత్ర చొప్పున జరుగుతూ పోతాయి. . అంటే ప్రదేశ కాలాలతో ముడి పడి ఎన్నో చరిత్రలు ఉంటాయి. అంటే ఎన్నో విశ్వాలు ఉన్నాయి శాక్యాల వద్ద కలిసి ఉన్న విశ్వాలు ఒక సంఘటన జరిగాక విడిపోతాయి అక్కడనుంచి ఈ మార్గం లో మళ్లి కొత్త విశ్వాలు కలిసి ఉంటాయి.
కాలం లో ప్రయాణించి చరిత్ర మారిస్తే అక్కడనుంచి పయనం కొత్త విశ్వాల గుండా ఉంటుంది.
వెలుగు వేగాన్ని మించిన వేగం తో కాలం లో ప్రయాణిస్తే తప్ప గతం లోకి వెళ్ళటం సాధ్యం కాదు. కాని ఆ వేగాన్ని అందుకోవటమే చెయ్య లేనప్పుడు దాన్ని మించటం సాధ్యమా ? కాదు.
అంటే గతం లోకి వెళ్ళాలంటే కాల ప్రదేశ ఆవరణలో , క్రిములు ఒక పండులో ఒక వైపు నుంచి మరో వైపుకు దొలుచుకుంటూ పోయినప్పుడు ఏర్పడే సొరంగగ మార్గం లాంటివి ఉంటె సాధ్యం అవుతుంది అన్నది ఒక ఉహ.
విశ్వం ఏర్పడక ముందు ఏం ఉండేది ? చతుర్విధ బలాలు విడిపోక ముందు కలిసి ఉండేవా ? అన్నిటిని వివరిస్తూ ఒక సిద్ధాంతం ( Theory of every thing) వస్తుందని ఆశిద్దాం

Written by kavanasarma

April 17, 2017 at 11:50 pm

Posted in Uncategorized

%d bloggers like this: