Kavana Sarma Kaburlu

All Rights Reserved

Jargon లేక పరిభాష

ప్రతి శాస్త్రానికి దానిదే అయినా పరిభాష ( Jargon) ఉంటుందిఇంగ్లీష్ లో సైన్స్ అనే మాట ఉన్నది. దానికి తెలుగు మాట విజ్ఞాన శాస్త్రం దానిని కొద్ధి వాక్యాలలో నిర్వచించలేము. పెద్ద వారు వ్రాసిన విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, ఏ విభాగానికి చెందినవైనా మొదటి పుటల్లో సైన్స్ అన్న పదాన్నీ నిర్వచించటానికి కాక వివరించడానికి పూను కుంటాయి ఆ పదం పట్ల నిర్దిష్టమైన ( precise) భావాన్ని కలిగించటానికి పెద్ద పూనిక వహిస్తాయి.
కానీ సైన్స్ అభ్యసించిన వారిలో కూడా చాలామందికి అటువంటి పెద్దల పుస్తకాలు చదవక పోవటం వలన , పరీక్షల్లో సైన్స్ పట్ల విద్యార్థి కున్న అవగాహన ని అంచనా వేసే ప్రశ్నలు ఇవ్వకపోవటం వలన దాని పట్ల సరైన అవగాహన ఉండదు. అటువంటి వారే గురువులై నేర్పే చదువులు వారి శిష్యులకి ఆవిధమైన అవగాహన కలిగించవు.
అందుకే సాధారణస్థాయిలో జరిగే చర్చల్లో సైన్స్ అనే పదాన్ని ఎవరిష్ఠమైనట్టు వారు వాడుతూ ఉంటారు వాదాలు గందర గోళం గా తాయారు అవుతాయి .
ఉదాహరణకి గురజాడ వారి కన్యా శుల్కాన్ని తీసుకుందాము అందులో
" ఆకాశమనగా శూన్యము" అని ఒకరు అంటే
" మన్ను మిన్ను అంటారు కదా మన్ను ఉంటె మిన్ను ఉండదా ? "అని మరొకరు అంటారు
ఇక్కడ శూన్యం అనేది ఒక పారిభాషికపదం
ప్రపంచపు ఆవరణ లో వాయు ,ద్రవ ఘన పదార్దేలే కాక వీటికి చెందానికొక తురీయ అవస్థకి ( వేమూరి) చెందిన ‘రసి (plasmaa) ‘ అనే పదార్ధం కూడా ఉన్నాయని , అటువంటి
ఏ పదార్ద్మ్ లేని ఆవరనే శూన్యమని నిర్వచనం . అంటే రెండో వాడి వాదన ఉత్థ బుకాయింపు . ఇక్కడ తురీయా అవస్థ అనేది మరో jargon
అటువంటి ఇబ్బంది పెట్టె పదమే నాస్తికత్వం.
Articial intelligence ,వ్యాకరణ తర్క శాస్త్రాలలో నిష్ణాతులు అయినా వల్లూరి శర్మ గారు ‘నాస్తిక ‘ పదాన్ని శాస్త్రీయం గా వివరించబోతు ఉంటారు
‘అస్తి ‘ అంటే ఉన్నది అని అర్ధం అందులో వివాదం లేదు. మామూలు గా ‘ఉండేది ‘లేక పోవటమే పోవటమే ‘నాస్తి ‘ .’దేవుడు అన్ని చోట్లా అన్ని కాలాల్లో ఉంటాడు అనేది నిర్వచనం అయినప్పుడు . నాస్తికత అనేది దైవ సంబంధమైన మాట కాదు . అంటారు ఆయన . అయితే జనం ."మేము వాడుకలో ఉన్న అర్ధం లో ఆమాట వాడాము" అంటారు ఎవరి వాడుక ?
Jargon ని ‘ వాడుకలో ఉన్నదనుకుంటున్న అర్ధం లో వాడతామే ఇన్ని వాదోప వాదాలకి మూలం
శాస్త్రీయ అంటే మార్కుసీ య అంటే సైంసీ య అనుకుని వాదించటాలే చూస్తున్నాను అందుకనే ఆటు వంటి గంభీరమైన భాషకి నేను దూరం

Written by kavanasarma

March 28, 2017 at 4:07 am

Posted in Uncategorized