Marpuleni sapam
నాకు జ్ఞాపకం ఎక్కువ . మరుపు తక్కువ . అది ఒక విధమైన శాపమే ! నాకు ఇతర్లు వారి పనులు బాగా గుర్తు ఉంటాయి .వారు చేసిన మంచి మరిచిపోలేను ఆ తరువాత ఎంత చెడు చేసినా . వారు చేసిన చెడు క్షమించగలను కాని మర్చిపోలేను నేను నాతో చదువుకున్న వారిని ఆడుకున్నవారిని , అందరిని కాకపోయినా కొందరిని గుర్తున్చుకున్నాను . కొన్ని పేర్లు మాత్రమే గుర్తు ఉన్నాయి
నా చిన్నప్పుడు కోరిటిపాడులో (గుంటూరులో) ఉండే వారిమి అక్కడ నాతో (దెబ్బలాడుకున్న ) ఆడుకున్న అమ్మాయి ఒక income tax ఆఫీసర్ గారి అమ్మాయి లక్ష్మి పక్కింట్లో గండికోట బాబు( ముఖ్య ప్రాణ నీల రతన్ ).
అక్కడనుంచి యుద్ధం ఐపోయాక విశాఖపట్నం వెళ్ళాం 1946 లో ఆఫిసిఅల్ కాలనీ లో ఉన్నాము అక్కడ నా స్నేహితులు కస్తూరి, మోహన్‌దాస్ తోలేటి తంబు . కోచెర్ల కోట బాబ్జీ అనబడే లక్ష్మి నారాయణ నా సహాధ్యాయి . బోరింగ్ పంప్ ఉన్న వీధి బడిలో చదువు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముడు అందరు నా ఫ్రెండ్స్ . Dr లక్ష్మి నారాయణ తరవాత కొల్హాపూర్‌లో ప్రొఫెసర్ అయ్యాడు
To be continued