Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

FRom IISC to VITAM

పెద్ద బడి నుంచి చిన్న బళ్ళకి నా ప్రయాణం Trail of Kandula V N sarma from IISC to VITAM ( మొదటి విడత )
నేను 1992 జనవరి 1 బ తేదీన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISc)వదిలి చివరగా ఈ నాటికి విశాఖ పట్నం లోని విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆ ఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ ( VITAM) వరకు చేసిన ప్రయాణాన్ని సాంప్రదాయ దృష్టి తో చూసి దాన్ని వివేక భ్రష్ట సంపాతములుగా వ్యాఖ్యానించారు స్నేహితులు కొందరు .
లోక సమ్మతమైన వివేకం మనిషి వటు డి నుంచి త్రివిక్రముడిగా ఎదగాలని చెప్తుంది. ఆలా ఎదగటం అనేది అధికారం, గౌరవం, డబ్బు అనే మూడింటిలో ఎందులో ఎదిగినా లోకం ప్రయోజకుడు అంటుంది .నా ప్రయాణం Conventional Wisdom సూచించే దిక్కులో కాక వ్యతిరేక దిశ లో ఉండటం లోకానికి నచ్చక పోవటం లో ఆశ్చర్యం లేదు
నా ప్రయాణం ఆ దిశలో జరగటానికి కారణాల ఉన్నాయి .
1 నాకు విశాఖపట్నం అంటే వల్ల మాలిన అభిమానం తిరిగి గూటికి గూటికి చేరాలనే తపన నాది .
2. నాకు Fluid Mechanics వలన Reverse Transition ( from Turbulence to Laminar Flow ) అనే భావం తో పరిచయం ఏర్పడి , మన కి మనం Value Addition చేసుకుంటూ పోవటం ఒక చోట ఆపి మనకి అబ్బిన ( అంటుకున్న) జ్ఞానాన్ని మనకి పట్టిన అదృష్టం పట్టని వారితో పంచుకోవచ్చు కదా .పూర్వం ఋషులు ఆచార్యులు తపోవనాల్లో పోగు చేసుకున్న జ్ఞానాన్నిజనాలతో పంచుకోవటాని కి తపో వనాలు విడిచి జన సంకులాలలోకి వస్తూ ఉండేవారు కదా .నాకు అంటినది తక్కువే కావచ్చు కానీ అదీ సోకని, జనాలు ఉన్నారుకదా, అనే ఒక భావన నన్ను చిన్న బళ్ల కి ,ఇరాక్ . ఇథియోపియాలకి పోయేలా చేసింది

Written by kavanasarma

October 15, 2018 at 2:02 am

Posted in Uncategorized

%d bloggers like this: