Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : 3 వ విడత ,సతీశ్ ధవన్ Indian Institute of Science కి డైరెక్టర్ గా ఉ న్న కాలం 1962-1981

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : 3 వ విడత ,సతీశ్ ధవన్ Indian Institute of Science కి డైరెక్టర్ గా ఉన్న కాలం 1962-1981. ధావన్ తో రెండో భేటి :

మా సంస్థలో ప్రతి ఒక్క బోధకుడు, విద్యార్థి ,ఆఫీసరు ,తప్సని సరిగా సభ్యత్వ రుసుముచెల్లించి సభ్యులుగా ఉండే క్రీడలు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించే ,జింఖానా (GK) అనే ఒక సంఘం ఉంది .దానిని పర్యవేక్షణ కి ఒక గరిష్ఠుడైన ఒక ఆచార్యుడిని Director నియమిస్తాడు అతనిని అధ్యక్షుడు( ప్రెసిడెంట్) అంటారు. కథాకాలానికి ఆ పదవిలో కామా అనే బయో కెమిస్ట్రీ ( BC) ఆయన ఉన్నాడు . సభాపతి ( చైర్మన్ సప ), కార్యదర్శి ( కాద) ,కోశాధిపతి ( కోప) పదవుల్లో ఎన్నికైన వారు ఉంటారు .కథాకాలానికి , కెమికల్ ఇంజినీరింగ్ ( Ch.E.) చెందిన

వైశ్ అనే

పరిశోధక విద్యార్థి సప గాను ,BC కి చెందిన సలీమ్ ఖాన్ అనే పరిశోధక విద్యార్థి కాద గాను ఉన్నారు.
నేను ఆస్ట్రేలియా నుంచి 1972 లో వెనక్కి వచ్చాక తెలుగు సమితి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉండేవాడిని .ఆ సందర్భం లో GK లో నాటకం వేయటానికి అనుమతి కావాలంటే, ఉత్తరం పెట్టి వచ్చాను నాటకం ముందు రోజు నాకు వైశ్ అనుమతి ఇవ్వలేదని తెలిసింది .అతన్నే అడిగాను " నువ్వు అడిగావు కానీ నేను ఇవ్వలేదు కదా" అన్నాడు .ఆ సారికి మరో చోట సర్దుకున్నాను . నేను అవమానాలని భరించే విషయం లో చాణక్యుడి లాంటి వాడిని .క్రమేపి అతను GK కి ఏక చాత్రాదిపత్యం గా ఏలుతున్నాడని ,UP కి చెందిన అతను దక్షిణాత్యుల పట్ల ఉదాసీనం గా ఉంటాడని తెలిసింది .
7 3 -74 లో ఎన్నికలు ప్రకటించగానే నేను కోప గ నామినేషన్ వేసాను . వైశ్ కి ఎన్నికలు ఇష్టం లేదు .అందుకని నాకు ఆపదవి వదిలి పెట్టడం ద్వారా అందరం నాతో సహా ఏకగ్రీవం గా ఎన్నికయ్యేటట్టు జాగ్రత్తపడ్డాడు తద్వారా అతను సప గ ఖాన్ కాద గా మళ్ళీ గెలిచారు ..వైశ్ తన పేరు స్థిరంగా ఉండాలని GKకి ఒక అయు బయలు రంగ స్థలం కట్టిస్తున్నాడని నాకు తెలుసు . అతనికి తెలియనిది డబ్బు ఎందుకో చెప్తే తప్ప నేను చెక్కుల మీద సంతకం పెట్టనని .నాకు తెలియనిది మా ముగ్గురిలో ఏ ఇద్దరు సంతకం పెట్టినా డబ్బు తీయవచ్చనన్న నిబంధన గురించి అతనికి తెలుసునన్నది .నన్ను పక్కన పెట్టేసాడు. కానీ అకౌంట్స్ వ్రాయాల్సింది నేనే కదా నాకు వౌచర్లు కుప్పతిప్పలుగా వచ్చిపడ సాగాయి. అవి bank నుంచి తీసిన మొత్తానికి చాలా రెట్లు ఉండటం తో డబ్బు ఎక్కడ నుంచి వస్తోందన్న అనుమానం కలిగింది .
కాఫీ క్లబ్ లో కాఫీలు అమ్మిన డబ్బు, షటిల్స్,టి టి బంతులు అమ్మిన డబ్బులు అతను వాడేసుకున్తున్నట్టు అర్ధమైంది .కాఫీ క్లబ్ కోసం హాస్టల్ నుంచి అప్పు మీద తెచ్చిన పాల ,కాఫీ పొడి బిల్లులు , ఆటల కొట్లవాళ్ళ సప్లై బిల్లులు చెల్లించటం లేదని అర్థమైంది .
ఆచార్య కామా కి వెళ్లి చెప్పాను .
ఆయన" విద్యార్థుల గొడవల్లో నేను తలదూర్చను " అన్నాడు
‘" నేనూ మీలానే కానీ కాస్త చిన్న సహాయక ( అసిస్టెంట్) ప్రొఫెసర్ని. విద్యార్థిని కాదు " అన్నాను
ఆయన "అయినా నేను నీ మాట వినను .సలీం మంచివాడు "అన్నాడు
అప్పుడు ధవన్ దగ్గర మొర పెట్టుకోడానికి చాల విశ్వాసం తో వెళ్ళాను .ఆయన నన్ను చూడ నిరాకరించాడు సమయం లేక .
నాకు ఉక్రోషం వచ్చింది ఆయన PA తో : "నేను ౩౦౦ సంతకాలు సేకరించి ప్రత్యేక GBM కి పిలుపు ఇస్తాను ‘అందులో దోషులుగా వైశ్ తో పాటు కామా గారిని ,వారితో పాటు విధి లేక మిమ్మలిని ఇరికిస్తాను’ అన్నాను అని ధవన్ గారికి చెప్పండి" అని చెప్పి మా డిపార్టుమెంటు కి వచ్చేసాను . కాస్సేపటికి కామా నుంచి ఫోను .ఆయనని, ధవన్ నాతో GK విషయం సామరస్యం గా చర్చించి సమస్య పరిష్కరించమాన్నాడని ,నను రమ్మనీ ను .
డబ్బు విషయం లో నా అనుమతి లేకుండా ఖర్చు పెట్టె వీలు వైశ్ కోల్పోయాడు. GK ని పట్టాలు ఎక్కించాను .మరుసటి ఏడ ఎన్నికల్లో అన్ని పదవులకి సరైన అభ్యర్ధుల చేత పోటీ చేయించి , అజయులు అని అందరూ నమ్మిన అతని పాతాళం లోత్తన్ని ఏక మొత్తం గా ఓడేలా చేశాను. అది కొందరు పెద్ద ఆచార్యులకి నచ్చ లేదు . కానీ ధవన్ నన్ను ఏమీ నలేదు
నా స్నేహితుడు పరీక్షలో, బీహారుకి చెందిన విద్యార్థి తప్పాడు. పైగా అతను దళితుడు. ధవన్ మీద కేంద్రం నుంచి వత్తిడి వచ్చింది .ఆయన , ఆ విద్యార్థికి మరోసారి పరీక్ష పెట్టమన్నాడు . .ఆ పరీక్షలోనూ తప్పాడు ఆ విద్యార్థి.
."మీరు తప్పదు ఆ స్థాయి విద్యార్థికి లేక పోయిన పరవాలేదు పాస్ చెయ్యి అంటే చేస్తాను .కానీ ఆ పాపం మీ ఖాతాకే వేస్తాను " అన్నాడు నా స్నేహితుడు.

" కేంద్ర మం త్రి తో నా తిప్పలు నేను పడతాను. ఆ విద్యార్ధి మరో సారి చదువుతాడు.నువ్వు పాస్ చేయ వద్దు " అన్నాడు ధవన్.
ధవన్ గొప్ప తనం ఏమిటంటే సవ్యమైన కారణానికి ఆయనని ఎదురించి బతికి బట్టకట్ట వచ్చు ఎంత చిన్న వాళ్ళు అయినా.

ఆ ఏడు TT నేషనల్ చాంపియన్ కబాడ్ జయంత్ మా సంస్థ విద్యార్థి గా ఉండటం కారణం గా వైశ్ పూనికతో జపాన్. ఇండియా ల మద్య అంతర్జాతీయ పోటీ నిర్వహించాము
.

ఈ కథకి ముగింపు . వైశ్ కట్టిన ఆరుబయలు రంగస్థలం తో నాకు కొన్ని మధుర స్మృతులు ఉన్నాయి .ఆ ఆరుబయలు రంగస్థలం లో ఆ సంవత్సరం కాళ రాత్రి నాటకం ఆడించాను. విశ్వనాధ సత్యనారాయణ గారి సభ ని అక్కడే ఏర్పాటు చేసి పరిచయం చేసాను 400 మంది వచ్చారు

అదే వేదిక మీద ఒక దశాబ్దం తరవాత అంతర్కలళా శాల ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం దానికి నేను న్యాయ నిర్ణేతగా ఉండటం ,ఆ పోటీలో రమేశ్ అరవింద్ UVCE నుంచి పాల్గొని బహుమతి పొందటం ఒక గోప్ప జ్ఞాపకం

నేను Convenor of Environmental studies program (1978-79 ) గా ఉన్న సమయం లో GK యొక్క ఈతకొలను ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ధవన్ నన్ను పిలిచి నాకు అప్పచెప్పటం ఒక గొప్ప అనుభవం.
ధవన్ తో నా చివరి భేటి మా ఇద్దరికీ బాధ కలిగించింది అది మరో సారి

Written by kavanasarma

September 6, 2018 at 10:46 am

Posted in Uncategorized

%d bloggers like this: