Kavana Sarma Kaburlu

All Rights Reserved

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : 3 వ విడత ,సతీశ్ ధవన్ Indian Institute of Science కి డైరెక్టర్ గా ఉ న్న కాలం 1962-1981

leave a comment »

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : 3 వ విడత ,సతీశ్ ధవన్ Indian Institute of Science కి డైరెక్టర్ గా ఉన్న కాలం 1962-1981 ; రెండో భాగం1970- 73
నేను ఆస్ట్రేలియా వెళ్లి 1972 జులై లో తిరిగి వచ్చేసరికి నాకు, ఇందిరాగాంధీకి ధవన్ కి, కొంత ప్రఖ్యాతివచ్చింది
నా విషయం లో మొదటి కారణం నేను బ్రెయిన్ డ్రైన్ , వడ్డించే మనవాళ్ళ కథలు అనేచిన్న సీరియల్సు ,ఆంద్ర సచిత్ర వార పత్రికలో వ్రాసి ఉన్నాను .అదే పత్రిక దీపావళికి నిర్వహించినపోటీలో ఎదురీతకథ అనే నాకథ బహుమతిపొందింది .ఆ రచనలు IISc లోని తె లుగు ప్రొఫెసర్లలో నాకు రచయితగా కొంత గుర్తింపు తెచ్చాయి . చదువు కోసం కాక చదువు చె ప్పటానికి విదేశం వెళ్లిన ఘనుల జాబితాలో నేను చేరటం రెండో కారణం . ఉద్యోగపర్వాలు వ్రాసిన లేళ్ళపల్లి శర్మని IIT శర్మ గాను నన్ను ఆస్ట్రేలియా శర్మ గాను ,సాహితీ బృందాలలో వ్యవహరించా సాగారు .ఏదైతేనేమి "వీడు.మన ఆయుపట్ల మీద దెబ్బ కొట్టాడాంటే వీడు మరీ డిపార్ట్మెంట్ మనకి చెప్పినంత ఏబ్రాసి కాడు " అన్న సదభిప్రాయం నామీద కలిగినట్టు పోల్చుకున్నాను .
నాతో, ఆస్ట్రేలియన్లు ,"పాకిస్థాన్ కి F-16 లు ఉన్నాయి మీరు పాకిస్థాన్ తో చాల Compete ) లేరు "అనేవారు బంగ్లాదేశ్ యుద్ధ సందర్భం లో . కానీ ఇందిరా గాంధీ బాంగ్లాదేశ్ ని విముక్తి చేసింది
నేను తిరిగి వచ్చేటప్పటికి ధవన్ ఇస్రో (ISRO) Chairman అయ్యారు ఆయనే Space డిపార్ట్మెంట్ కి సెక్రటరీ కూడాను బెంగళూరే దానికి Head Quarters గా ఉండాలని అమ్మ దగ్గర మంకు పట్టు పట్టి సాధించుకున్నాడు .ఆయన తిరిగి వచ్చే సరికి మొదటి అంతర్ గ్ర హం పంపే ప్రయత్నాల లో ఉన్నారు . నేను వారిని కలవటానికి సమయం అడిగి ఉత్త గౌరవార్ధం అని బతిమాలాక నాతో 5 నిముషాలు గడిపారు అంతకు పూర్వం ఆయన గదికి తలుపు మాత్రమే అడ్డు. ఇప్పుడు పూజారి కూడా అడ్డుగా ఉన్నాడు .
తిరిగి రాగానే " నేను ఒచ్చేసానోచ్ ! నా ప్రమోషన్ మాట ఏంటి" అని తలకాయని అడిగాను. "

ఆయన నన్ను గట్టిగా సమర్ధిస్తూ సిఫార్సు చేశారు రెండు నెలలు గడిచినా కాయితం కి చలనం రాలేదు ఈ లోపల మా తలకాయ రిటైర్ అయి .మాకు ఇంకో తలమొలిచింది .కొత్త ఆయనని వెళ్లి అడిగాను " డీపీర్ట్మెంట్ నిన్ను Recommend చేసింది . Registrar తో చెప్పి ప్రాసెస్ మొదలు పెట్టించులో" అన్నాడు ఆయన . రిజిస్ట్రార్ నాకథలకి Fan కనక ధైర్యంగా వెళ్లి అడిగాను ఈ విషయం వంగతోట పరిధి లోనిది అంటూ ," పాత తలకాయ ,రిటైర్ అయ్యే రెండ్రోజుల ముందు recommend చేస్తే కుదరదు కొత్త తలకాయ కొత్త కాయితం వ్రాయాలి " అన్నాడు . మళ్ళీవెళ్లి తలకాయ కాలు పట్టుకున్నాను ".చూడమ్మా శర్మా ! రిజిస్ట్రార్ మీ తెలుగు వాడే కదా ఇక్కడ నుంచి వెళ్లిన కాయితం చెల్లదు కొత్త కాయితం వ్రాయమంటూ నోట్ పెట్టి వెనక్కి పంపించమను " అని నచ్చచెప్పారు. ఆయనా , వెనక్కి పంపడు ఈ యనా, ముందుకు పంపడు . అడకత్తెరలో పోక చెక్క అయిపోయాను ,
ధవన్ , తో "నీవే మొగుడివి నీవే గతివి నిజముగా సతీశా !" అని చెప్పదలుచుకున్న వాడినై appointment ని కోరాను కానీ ఆయన ఇవ్వ నిరాకరించాడు అప్పుడు నాకు స్థిరపడుతున్న దినాల్లో ఇందిరాగాంధీ కి స్థిరపడిన ఇందిరా గాంధీ కి తేడా ఉన్నట్టే పాతా ధవన్ కీ కొత్త ధవన్ కీ తేడా ఉన్నద ని తెలిసింది
ఏంచేయ్యాలా? అని ఆలోచిస్తుంటే నాకు ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్న ఆసు( ace) అస్త్రం స్ఫురణకు వచ్చింది .నేను తిరిగి వస్తూ నేను మనసు మా ర్చుకుంటే ఏడాది లోపల తిరిగి వెళ్ళగలగటాని వీసా గుద్దించుకుని వచ్చాను. ఆ దినాల్లో అడిగితే చాలు ఇచ్చేవారు
" ఆయన నన్ను చూడకపోతే, ఆ కారణం గా resign చేసి వెళ్లిపోతానని చెప్పు " అని పూజారికి చెప్పి వచ్చేసాను
నేను డిపార్ట్మెంట్ కి చేరానో లేదో "డైరెక్టర్, నిన్ను ఫోనులో పిలుస్తున్నారు" అని ఆఫీసునుంచి కబురు వచ్చింది. అప్పుడు నాకు టేబుల్ లేదు అందుకని దానిమీద ఫోనూలేదు .ఆఫీసుకి వెళ్ళాను .ఆయన నా కినుకకి కారణం తెలుసుకుని ‘ మీ హెడ్ ని కాయితం పంపమని నేను చెప్పానని చెప్పు " అన్నాడు
" ఆ మాట మీరే ఆయనతో చెప్పండి నేను చెప్తే నేను తన మీద మీకు ఫిర్యాదు చేసా నని అనుమానిస్తాడు. పైగా మీరు మాట్లాడుతున్నది ఇక్కడ ఎవరికీ వినపడదు కానీ నేను మాట్లాడేది వినపడుతోంది ఆఫీసులో బోలెడు ఉత్సవాహం గా వింటున్నారు " అని చెప్పాను. ఆయన "సరే నేనే చెప్తాను " అని చెప్పాడు నాకు జులై 1973 ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్ ప్రొఫెసర్ గా. తరవాత తరవాత ధవన్ తో ఫోన్ లో మాట్లాడటం కూడా గగనం అయిపొయింది. ఆయన శాఖ అప్పు డదే కదా 1
ఆయా రోజుల్లో నేను IISc ,మీద వ్రాసి ప్రదర్శించిన బుర్ర కథలో ఇలా వ్రాసాను
" అన్నుల మిన్నా అందాల భరిణ
అతని చిన్న రాణీ అతని స్పేసు రాణీ "
"చిన్న రాణీ మోజులో పడి పెద్దరాణీ అయినా Institute ని ఆమెవలన కలిగిన పిల్లలమైన మమ్మలిని,మర్చిపోయాడు తన రాజ్యానికి నాలుగు భాగాలు చేసి నలుగురు ప్రతినిధులని నియమించి పరిపాలన కొనసాగించసాగాడు"

ఆ ప్రదర్శన చూడ టానికి వచ్చిన తెలుగు రిజిస్ట్రారు ,తెలుగు Divisional Chairman ముసి ముసి నవ్వులు నవ్వుతూ చూసారు ఆ DC కి ధవన్ శిషుడే కనక ( పైగా ఇద్దరూ Calech వారే ) ననే న్నది చెప్పే ఉంటారు
నేను మరో రెండు సార్లు ధవన్ రిటైర్ అయ్యేలోపల ధవన్ తో తలపడ్డాను ( మరో రెండు భాగాల్లో ఇటుపిమ్మట ) .

Advertisements

Written by kavanasarma

August 20, 2018 at 2:50 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: