Kavana Sarma Kaburlu

All Rights Reserved

నేను, రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : ర ెండో విడత 1964.-1985

leave a comment »

నేను, రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : రెండో విడత 1964.-1985

మా అమ్మ మా నాన్న దేశం లో లేని సమయం లో అమ్మమ్మ గారింట్లో ఉండటం మూ లాన సమయం దొరికి , దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి పరీక్షలు ,మధ్యమ ,రాష్ట్ర అనే వాటికి కట్టి కృతార్థురాలైంది. ఆ విద్య ,మా నాన్న తో 65-66 ల మధ్య కెనడా వెళ్ళినప్పుడు, నాతో ట్రినిడాడ్ కి 1979- 80 లో వచ్చినప్పుడు మా అమ్మకి ఉత్తర భారతీయులు ,’మాజీ !’ అంటూ భక్తి చూపించటానికి తోడ్పడింది .కానీ నా పరిస్ధితి అదికాదు.
దేశానికి స్వతంత్రం రావటం విద్యా విధానం లో మార్పులు, నా చదువు మొదలవడం రమా రమి ఒకే సారి జరిగాయి నాకు 6 వ తరగతిలో ఇంగ్లీష్ లేదు హిందీ లేదు . 7 వ తరగతిలో రెండూ పెట్టారు . 8 వ తరగతిలో సంస్కృతమో హిందీయో చదవమన్నారు. .సంస్కృతం చదివాను .9 వ తరగతిలో హిందీ తప్పదు అన్నారు రెండు తె లుగులు పెట్టారు సాధారణ తెలుగు ప్రత్యేక తెలుగు అని రెండో దాని బదులు సంస్కృతం చదవ వచ్చు 4 గురు ఉంటె. కానీ లేరు .అందుకని 3 భాషా సూత్రం ప్రకారం తెలుగు హిందీ ఇంగ్లిష్ చదివాను.ఉత్తరదేశం లో వారికి రెండే భాషలు .ఈ వివక్ష వలన నాలాంటి దేశభక్తుడికి కూడా హిందీ అంటే కోపం వచ్చింది . 1953-54 SSLC ( 11 వ తరగతి ) పరీక్షలలో హిందీ పరీక్ష వ్రాయ తన్ని వ్యతిరేకిస్తూ , విద్యార్థుల కి నాయకత్వం వహించి హెడ్ మాస్టర్ కి చెప్పేసాను. పిల్లి తన మెడలో గంటకి మురిసి పోయి ఒప్పుకుంది అది నా మొదటి హిందీ వ్యతిరేక ప్రథమ ప్రకటన .
నెహ్రు చనిపోయాక వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం లో హిందీ రుద్దటానికి మరో ప్రయత్నం జరిగింది .ఆ పని దేవానంద్ కి నూతన కి వదిలి పెట్టిన రోజుల్లో నాకు బాగానే హిందీ పట్టు పడింది పైగా ఖరగపూర్ IIT లో ఉండటం వలన ( 1960-61) "క్యా యార్ మోహుబత్ ,దిల్ దేనా " భాష తొందరగా వచ్చింది. బెంగాలీ అమ్మాయిలకి ‘బాలో భాషి’ చెప్పటం కుదరక తెలుగు అమ్మాయినే ప్రేమించి 1962 డిసెంబర్ లో ఇటు పెద్దలు అటు పెద్దలు ఒప్పుకోవటం తో తప్పుకోలేక పెళ్లాడేసాను .1962 లో IISc లో Ph.D కి జేరి కాపురం పెట్టేసాను. సుఖంగా కాపురం చేస్తున్నాను. మా పెద్దమ్మాయి పుట్టింది. రెండో అమ్మాయికి సిద్ధపడుతున్నాము
.సరిగా అప్పుడే శాస్త్రి గారు హిందీ రుద్ది పెద్ద తప్పు చేసాడు. దక్షిణ దేశము లో హిందీ వ్యతిరేకత పెద్ద వరద లా పొంగింది. .
నేనూ మరో మిత్రుడు కలిసి IISc లో ఒక దినం ఉపవాసం చేసాం .ఆ విషయం వార్తా పత్రికల్లో రావటం తో నా గైడు , మా డైరెక్టర్ ,విడి విడిగా అక్షింతలు వేసా రు.కానీ నా ఇతర స్నేహితులు దాన్ని relay hungar strikes అంటూ కొనసాగించారు అక్షింతలు పడ్డా హిందీ జగన్నాధుడి రథ చక్రాలు ఆగి పోయాయి .
మధ్య కాలం లో మేము కోదండ రావు అనే Servants of India Society ( గో.గోఖలే ) సంస్థ ఆయనని పిలిచి టౌన్ హాల్లో ఇంగ్లీషే కావాలని సభపెట్టాము. ఆ సభని RSS వారు అడ్డుకున్నారు. అది నాకు నచ్చలేదు. దాంతో నేను పూర్తిగా ఆ సంఘానికి దూరం గా జరిగాను.

లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్థాన్ తో మొదటి యుద్ధం గెలిచారు. రష్యాలో చ నిపోయారు. గాంధీ వంశ పాలన ఇందిరా గాంధీ తో మొదలైంది. రాజరికపు భరణాలు పోయాయి. బ్యాంకులు జాతీయం చేయ బడి,మనం దాచుకున్న డబ్బులు లోన్ మేళా ల లో వె దజిమ్మటం ప్రారంభమై ఇప్పటిదాకా కొనసాగుతోంది . సిండికేట్ పప్పులు ఉడకలేదు . జాకిర్ హుస్సేన్ అధ్యక్షుడయ్యాడు .

నేను 1970 -72 మధ్య ఆస్ట్రేలియా లోని మొనాష్ యూనివర్సిటీ లో పనిచేయటానికి అనుమతి పొంది ,సెలవు తీసుకుని ఒక భార్యా ఇద్దరు పిల్లలతో వెళ్ళాను . ఆ యూనివర్సిటీ రాడికల్ స్టూడెంట్స్ కి పట్టుకొమ్మ. అది వాళ్ళ JNU అన్నమాట . స్టూడెంట్ నిరసనలు దగ్గరుండి గమనించటం, అక్కడి వారికి మన దేవుళ్ళ అవసరం లేక పోవటం , శుభసమయాలు అక్కర్లేక పోవటం , మేము కూడా వారి విశ్వాసాలు లేకుండా అన్ని ( 30 సంవత్సరాలు ) బతికేయటం తో ,రెండూ అనవసరంగా అర్ధమయ్యి . దేవుడి ప్రసక్తి లేని secure జీవితానికి అలవాటు పడి ఇండియాకి వెనక్కి వెళ్ళాను
ఇండియా వచ్చాక Indian Rationalist Association లో సభ్యుడిగా చేరటం , విశాఖ వెళ్ళినప్పుడల్లా కాళీ పట్నం రామా రావు గారితో తిరగటం ,విరసపు రచయితల పరిచయాలు పెంచుకోవటం జరిగాయి .నా మొహం కంద గడ్డలా ఎరుపు ఎక్కిందని ఒక విద్యార్ధి అనటం నా చెవిన పడకపోలేదు .గణేష్ పాత్రో నాటకాలు IISc లో రాయుడు , సాంబశివరావు పటాలం ఆడసాగింది.
1975 లో ఎమర్జెన్సీ పెట్టారు కొందరు రచయితలని మూసేసారు. మా నాన్న గారు " ఎక్కడ ఉన్నావు ? " అని టెలిగ్రామ్ ఇచ్చారు . నేను ఇంట్లోనే క్షేమముగా ఉన్నాను అని జవాబు ఇచ్చాను .నేను రాజకీయ ఉద్యమకారుడిని కాను కేవలం హేతు వాది ని అందుకని దుర్గా దేవి అనుచరుల దృష్టి నా పై పడలేదు
ఎమర్జెన్సీ ఎత్తేసారు . మా మల్లేశ్వరం నుంచి KS Hegde (Janatha party) అనే జడ్జి గారిని గెలిపించాము. అదే నాజీవితం లో నా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రథమ సంఘటన .
IISc లో అబ్రహం కోవూరు ఉపన్యాసం ఏర్పాటు చెయ్యటం BV Raman గారిని సభలో ప్రశ్నించటం లాంటి చిన్న చిన్న తిరుగు బాటు తనాలు ప్రదర్శించే వాడిని ఆ రోజుల్లో .
1979 లో మా నాన్న పోయారు .అమ్మని భార్య ని పిల్లలని తీసుకుని ట్రినిడాడ్ వెళ్ళాను. అక్కడున్న NRI INdians Emergency కాలం లో ఇండియా పరువు గొప్పగా పెరిగి పోయినది అనటం నాకు కోపం తెప్పించింది ." అంత గొప్ప సమయం లో మీరు అక్కడికి వెళ్పోచ్చేయక ఇక్కడే ఎందుకున్నారు ? "అని అడిగాను అ క్క డ హిందువులంతా ( Originally of Idian Origin) సంపన్నం గా ఉండటం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండటం నన్ను ఆకట్టుకోలేదు .నేను Secular భావాల వాడిని కాదా !
తిరిగి వచ్చాను Operation Blue Star జరిగింది. ఇందిరా గాంధీ హత్యకు గురి అయింది. Indira was no more But India continued to exist. Gareebi continued to prosper .

Advertisements

Written by kavanasarma

August 17, 2018 at 5:27 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: