Kavana Sarma Kaburlu

All Rights Reserved

నేను , రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం

with 3 comments

నేను , రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం
1 నెహ్రు కాలం
నాకు నచ్చిన పాత్ర బంగారు పాపలో, పాప తండ్రి పాత్ర. . అతను చివరిదాకా తన గురించి చెప్పకుండానే కథ నడిపించాలని చూస్తాడు .నేను కూడా బహుశః అటువంటి వాడినే .నేనేమిటో చెప్పకుండా దాతేద్దామనుకున్నాను కానీ వాజపేయీ చనిపోయిన ఈ రోజున చెప్పాలనుకుంటున్నాను నేను మా అమ్మ నాన్న ల ప్రకారం సెప్టెంబర్ 23 న పుట్టాను ఆ సంవత్సరం 1940 అనుకునేవాడిని కాదని 1939 అని మామేనమామ నమ్మ బలికాడు . నేను౨న్ద్ మే 194 0 ణ పుట్టినట్టు ప్రభుత్వం విశ్వసిస్తోంది నేను ఎప్పుడు పుట్టినా , విశాఖపట్నం మీద బాం బులు పడినది 1942 లోనే .రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయం గుంటూరు నుంచి విశాఖా పట్నం వెళ్ళింది 1946 లోనే. దాంతో పాటు మా నాన్న గారు ఆయన తో పాటు మేము విశాఖ వెళ్ళినది అప్పుడే .

మనకి స్వతత్రం వచ్చింది 15, ఆగస్టు 1947 నే

..మా అ మ్మ చెల్లెలు అప్పుడు భర్త తో బెంగాలు లో ఉండటం అప్పుడే. . వాళ్ళు ముస్లిం ల చేతుల్లో హతులవకుండా బయట పడింది అప్పుడే .అందుకని పాకిస్తాన్ కోరుకున్న వారిని నేను శత్రువులుగా అనుకున్నది అప్పుడే . సోషలిస్ట్ వీరుడు జయ ప్రకాష్ బాబు .ఢిల్లీ చలో అనీ

అని పాడుకున్నదీ అప్పుడే .కేప్టెన్ లక్ష్మి .సుభాష్ చంద్ర బోస్ INA ల పేర్లు విన్నదీ అప్పుడే స్వతంత్రం వచ్చే సమయానికి మేము విశాఖ పట్నం అఫీషియల్ కాలనీ మోరిస్ వీధిలో ఉండే వాళ్ళం . ఆరోజున తెల్లారినప్పటి నుంచి హోరెత్తి పోయిన టంగుటూరి సూర్య కుమారి దేశ భక్తి గీతాలు ‘ మా చెవులు రింగుమని మారు మోగి’ పోయిన రోజు కూడా అదే . మా అన్నయ్య సీతారామ శాస్త్రిని "రాజు గాంధీ ,మంత్రి నెహ్రూ కదా " అని అడిగి తిట్లు తిన్నా. కానీ నెహ్రు మంత్రే అని తెలిసింది . అలిపితో, చొక్కాకి జండా తగిలించుకుని విశా ఖ వీధుల్లో గొప్పగా తిరిగాము ఆ రోజున . స్వేచ్చా భారతం ఉదయమ్మాయె ను ఆ విధం గా
నన్ను డిసెంబర్ లో స్కూల్ లో పడేసారు 30 జనవరి 1948 ,గాంధీ గారిని, ఎవరో గాడ్సే అన్న ఆతను, కాల్చి చంపేసా డు . మా అమ్మ ప్రకారం గాంధీ దేవుడు. ఆయన్ని చంపటం ఏమిటో మరి నాకు అర్ధం కాలేదు స్కూళ్ళు మూసేసారు .గాంధీ గారి అంతిమ యాత్ర మినర్వా టాకీస్ లో ఉచితం గ చూపించారు . దేశం అంతా ఎవరి ప్రోద్బలం లేకుండా విచారం లో మునిగి పోయింది . RSS అనే సంస్థకి చెందిన వారిని ఆ తరవాత జైల్లో పెట్టారు . కానీ RSS అంటే ఏమిటో తెలియదు . వీర సావర్కర్ అనే ఆయన సముద్రం ఈది ఇంగ్లిష్ వారి నుంచి తప్పించుకో పోయాడని విని ఆయన గొప్ప వాడు అనుకునే వారిమి .
మాకు మొదటి ఫామ్ లో జనగణమన పాట గొప్ప తనం వివరించి, ఆ పాట వింటున్నప్పుడు ,లేక పాడుతున్నప్పుడు నెత్తి మీద పిడుగు పడ్డా కదలకూడదని కాళీపట్నం రామా రావు మేష్టారు చెప్పారు .అదినేను నమ్మాను .
పటేల్ హైద్రాబాద్ నవాబ్ ని బెదిరించాడని అందుకని అది ఇండియా లో చేరాడని , అయితే ఇదే నెహ్రు అదే ఆయన మాట కాశ్మీర్ విషయం లో వినలేదని అనేవారు .ఆ తరవాత ఒక తోక చుక్క కనపడటం ఆయన చని పోవటం జరిగింది .
1949 లో మా నాన్న గారు స్వీడన్ వెళ్లారు మేము రాజా మండ్రీ వెళ్ళాము ఆ రోజుల్లో కమ్యూనిస్టులు డబ్బున్న వాళ్ళని చంపేసేవారని అందుకని వాళ్ళు దొరికితే జైల్లో పెట్టేస్తారని చెప్పుకునేవారు. మేము తాతగారింట్లో ఇనప్పెట్టె ఉన్న గదిలో పడుకునే వారిమి .అందులో ఏ డబ్బూ లేదని కమ్యూనిస్టులు వస్తే వారికి చెప్పాలని నిశ్చయించుకున్నాను . 1950 జనవరి 26 న మనదేశం డొమినియన్ నుంచి రిపబ్లిక్ అయింది. స్కూల్ లో మిఠాయిలు పంచి పెట్టారు.
తర్వాత కొన్నాళ్ళకు రాజాజీ రేషన్ ఎత్తేసాడు .చాలా సంతోషించాము . ఆయన వద్ద మల్ల వరపు వెంకట కృష్ణా రావు గారనే మా ఇంటి /కుటుంబానికి డాక్టర్ గారు మంత్రి అయ్యారు . పొట్టి శ్రీరాములు ఆంద్ర రాష్ట్రం కోసం ఉపవాసం చేస్తూ చనిపోయారు .

అయితే రాజాజీ సలహా మేరకు నెహ్రు ఆయన ఉపవాస దీక్షని పట్టించుకోలేదన్న కోపం తో తెలుగు ప్రజా ఉద్రేకపడి పోయింది. నేనూ పడ్డాను. అల్లా పడకూడదని మా డాక్టరు మంత్రి గారు చెప్పినా వినిపించుకోలేదు రాష్ట్రం స్థంభించి పోయింది. నేనూ ఆ స్ట్రైక్ ల లో పాల్గొన్నాను .మలబారు పోలీసులని చూసి ఝడుసుకున్నాను కూడా .ఒకరిద్దరు విశాఖ లో చనిపోయారు .చివరికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది .మా తెలుగు తల్లికి మల్లె పూ దండ దొరికింది .కర్నూల్ రాజధాని అయింది నాకు కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది .నేను RSS లో గణపతి రాజు వర్మ ,పిళ్ళా రామారావు గార్లు నడుపుతున్న డాబా తోట RSS శాఖ లో చేరి కర్ర సాము నేర్చుకున్నాను
నేను 1954 లో . AVN College లో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం లో చేరాను . యూనియన్ ఎన్నికల్లో నిలబడ్డాను. RSS మిత్రులు నన్ను బలపరిచినా , 6 ఓట్ల తేడా తో ఒడి పోయాను .ఆ తరవాతి ఏడు నాటక సమితి కార్య దర్శి గా ఎన్నిక అయ్యాను .జోగయ్య పంతులు SF నుంచి యూనియన్ కార్య దర్శి గా ఎన్నిక అయ్యాడు .
పటేల్ ఉంటె గోవా ఎప్పుడో విముక్తి చెందేదని ఆయన లేక పోవటం వలన నేనూ జోగయ్య పంతులు పూనుకోక తప్పదని నమ్మి 1955 లో AVN College students strike కి నాయకత్వం వహించాము . టంగుటూరి తెన్నేటి కూడా కాంగ్రెస్ విడిచిపెట్టారు .
యూనివర్సిటీ లో 1956 లో ఇంజినీరింగ్ చదవటం మొదలు పెట్టాను .అక్కడ DSU బలం గా ఉండేది . నేను మొదటి రెండు సంవత్సరాలు పోటీ చేసి ఓడి పోయాను .పెమ్మరాజు సీతాపతి రావు గారు అక్కడ RSS పెద్ద గా ఉండేవారు .అధ్యయనం పేరిట అయినదానికీ కానిదానికీ నెహ్రు ని తిట్టడమా రోజుల్లో ఒక సాంప్రదాయం గా ఉండేది. అది నచ్చని నేను RSS మానేసి ప్రతిదినం రామకృష్ణా మిషన్ వెళ్ళటం మొదలు పెట్టాను . వివేకానంద నన్ను ఆకర్షించాడు .
1906 లో BE చదువు పూర్తి అయి ఖరగ్పూర్ లో M.Tech చదవటానికి విశాఖ విడిచిపెట్టాను. ప్రేమలో పడ్డాను
1961 లో AU లో లెక్చరర్ గ చేరాను .తరవాత 1962 వచ్చిన ఎన్నికల్లో నేను పోలింగ్ ఆఫీసర్ గా పనిచేసాను .తెన్నేటి ఆ ఎన్నికల్లో ఓడి పోయారు. 1962 లో చై నా యుద్ధం లో మన దేశం సిద్ధం గా లేక ఓడి పోయింది నెహ్రు మంత్రి వర్గం లో ని కొందరు మంత్రులు ., అవినీతి పరులన్న మాట బహిరంగం గా అనుకోవటం మొదలైంది. అంతకు ముందే ఫిరోజ్ గాంధి ఆ నేరారోపణ చేసాడు . 1964 లో నెహ్రు చనిపోయాడు

Advertisements

Written by kavanasarma

August 16, 2018 at 4:36 pm

Posted in Uncategorized

3 Responses

Subscribe to comments with RSS.

 1. History incomplete gaa undi. MIru prema lO paDindi eppudu? ekkaDa? evaritO
  ? cheppakunDaa story ettEsaaru. Disappointed .

  On Thursday, 16 August 2018, Kavana Sarma Kaburlu wrote:

  > kavanasarma ప్రచురించారు: “నేను , రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం 1
  > నెహ్రు కాలం నాకు నచ్చిన పాత్ర బంగారు పాపలో, పాప తండ్రి పాత్ర. . అతను
  > చివరిదాకా తన గురించి చెప్పకుండానే కథ నడిపించాలని చూస్తాడు .నేను కూడా బహుశః
  > అటువంటి వాడినే .నేనేమిటో చెప్పకుండా దాతేద్దామనుకున్నాను కానీ వాజపేయ”
  >

  severemohan

  August 16, 2018 at 5:06 pm

 2. History incomplete gaa undi. MIru prema lO paDindi eppudu? ekkaDa? evaritO
  ? cheppakunDaa story ettEsaaru. Diappointed!

  On Thursday, 16 August 2018, Kavana Sarma Kaburlu wrote:

  > kavanasarma ప్రచురించారు: “నేను , రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం 1
  > నెహ్రు కాలం నాకు నచ్చిన పాత్ర బంగారు పాపలో, పాప తండ్రి పాత్ర. . అతను
  > చివరిదాకా తన గురించి చెప్పకుండానే కథ నడిపించాలని చూస్తాడు .నేను కూడా బహుశః
  > అటువంటి వాడినే .నేనేమిటో చెప్పకుండా దాతేద్దామనుకున్నాను కానీ వాజపేయ”
  >

  severemohan

  August 16, 2018 at 5:08 pm

 3. మాస్టారు మీ కథనంలో ఒకచోట తప్పు ఉంది.
  1960 బదులు 1906 అని ఉంది చూడగలరు. మీ తప్పును ఎంచాను అని భావించకండి. సరి
  చేయడం కోసం చెప్పాను

  On Thu 16 Aug, 2018, 22:06 Kavana Sarma Kaburlu, wrote:

  > kavanasarma posted: “నేను , రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం 1 నెహ్రు
  > కాలం నాకు నచ్చిన పాత్ర బంగారు పాపలో, పాప తండ్రి పాత్ర. . అతను చివరిదాకా తన
  > గురించి చెప్పకుండానే కథ నడిపించాలని చూస్తాడు .నేను కూడా బహుశః అటువంటి
  > వాడినే .నేనేమిటో చెప్పకుండా దాతేద్దామనుకున్నాను కానీ వాజపేయ”
  >

  Eswaridevi Kondapalli

  August 18, 2018 at 2:28 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: