Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

వశీకరణ విద్యా ప్రదర్శన

గీతం:వార్షికోత్సవ ప్రదర్శనలు 3.: వశీకరణ విద్యా ప్రదర్శన నేను ఈ ప్రదర్శన ని మొట్టమొదటిసారి అర్బిల్ ( ఇరాక్) లో ఇచ్చాను హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వైద్యుడు (మరో )శర్మ ని నా మంత్రోచ్చారణ తో వశ పరుచుకుని ప్రజలు నా చెవిలో చెప్పిన మాటల ని డా.శర్మకి మానసిక తరంగాలు పంపి తెలియ చేసి ఆ మాటని అతని చేత చెప్పింఛి జనాన్ని ఆశ్చర్యచకితులను చేసాను
అర్బిల్ లో నేను మంత్రోచ్చారణ చేస్తుంటే చిన్న పిల్లలు జడుసుకున్నారు.
నా రెండో ప్రదర్శన KITS వరంగల్ లో ఇచ్చాను. ఆ ప్రదర్శన లో నేను ప్రొఫ్. కుందుర్తి రజనికాంత్ ని నా మంత్రాలతో వశ పరుచుకున్నాను. వశ పరుచుకోబడ్డ వ్యక్తికి ఏకాగ్రత ముఖ్యం. రజనీ కాంత్ కి ఆ ఏకాగ్రత ఉంది . ఆ ప్రదర్శన కి మా గురువుగారు యవన రావు గారే కాకుండా ఆ కళాశాల సెక్రటరీ Capt. లక్ష్మీకాంత రావు ( మాజీ మంత్రి) గారు కూడా వచ్చారు మొత్తం ఆ ప్రదర్శనని 200 మంది ఎదుట మేము ఇద్దరం చేసాము కనక మరింత అట్టహాసంగా , అట్ట సాయం తో చేసాము .
1. రజనీకాంత్ గారిని ప్రేక్షకుల వైపు తల ఉండేలా కుర్చీలో కూర్చో పెట్టి మంత్రాలు చదివి వశపరుచుకున్నాను రజనీకాంత్ గారి వెనక వైపు పెద్ద నల్ల బోర్డు పెట్టి " విద్యార్థుల్లో ఎవరైనా వచ్చి సుద్దతో బోర్డు మీద వారికి తోచిన మాట వ్రాయండి ఆమాట చూడటానికి రజనీకాంత్ గారి అవాకశం లేదు కదా నేను ఆయనని ఇదా ఇదా అని ప్రశ్నలు అడుగుతూ పోతాను తప్పు అయినప్పుడు ‘కాదు ‘ అని సరైనది అయినప్పుడు’ అవును ‘ అని చెప్తారు " అని చెప్పాను.
రజనీకాంత్ గారు " నన్ను వశం చేసుకోవటం మీతరం కాదు " అని నన్ను ప్రదర్శన ఆరంభం లో రెచ్చ గొట్టారు .
"రాళ్ళని రప్పలిని వశం చేసుకోగలను రా ఒక సాధారణ ఆచార్యుడెంత !" అని మంత్రాలు చదివి ఆయనని మైకం లో పడేసి వశం చేసుకున్నాను .
విద్యార్థులు వ్రాసినవనీ ఆయన సరిగా చెప్తే ప్రిన్సిపాల్ యవన రావు గారు ఆ పైన లక్ష్మీ కాంత రావు గారు కుడా నా విద్యని పరీక్షించారు
నా మంత్ర శక్తి పై నమ్మకం లేక పెద్దలిద్దరు మా ఇద్దరికీ ఒక ‘కోడ్’ ఉందన్న అనుమానం తో మరో పరీక్ష పెట్టారు. అది బోర్డు మీద వ్రాసిన మాట కాక మరో నాలుగు తప్పుడు మాటలు 4 సార్లు అడిగి ఆపైన 5 వ సారి సరైన మాట అడగాలి అన్న ని బంధనల లాంటివి బోర్డు మీద వ్రాసారుఅందుచేత నేను అడిగే ఎన్నో ప్రశ్నలో కరెక్ట్ జవాబు ఉంటుందో రజనీకాంత్ గారికి తెలిసే అవకాశం లేదు ఇద్దరం ఆపరీక్షల్లో నెగ్గాము అయితే ఓ చిన్న అపశ్రుతి. దొర్లింది నేను రజనీకాంత్ గారిని మామూలు మనిషి ని చేయటం మరిచిపోయాను. అయితే రజని కాంత్ గారు తన సమయ స్ఫూర్తి తో నన్ను ఆ ఇబ్బంది నుంచి బయట పడేసారు .
అందుచేత గీతం ప్రదర్శన ని మరింత కట్టు దిట్టంగా చేయటానికి పథకం రచించాను .
నిక్కూ శ్రీనివాస్ తెలివి ఏకాగ్రతకల వాడు.కానీ కొద్ది మాటల వాడు. ఎన్ పి శ్రీనివాస్ ,తలివైన వాడు. మాటల గారడి చేయగల శక్తి వున్న వాడు .ఒక మాటంటే ఆశువుగా అల్లుకు పోగలిగిన వాడు . ఉద్దండ పండితుడేకాని ఉండవలసిన ఏకాగ్రత లేని వాడు. అందుకని ఇతన్ని నా సహాయకుడిగా అంటే వంత పాటగాడిగా పెట్టుకున్నాను నిక్కూ ని వశపరచుకునే వాడిగా ఎన్నుకున్నాను. ఇంతవరకు ఏప్రద్రర్శనలోనూ చేయని పని నేను కొంచెం కాళ మాంత్రికుడి లా makeup చేసుకున్నాను మంత్ర దండం ధరించాను ఎన్ పి ని శిష్యుడు సదా జపుడి వేషం వేసుకోమన్నాను. నిక్కుని మామూలుగా ప్రేక్షకుల్లో ఉంచాం .
కాళ మాంత్రికుడు ( కా మా ) సదాజపుడు ( స జ ) స్టేజి మీదకు వెళ్ళాం.
కామా :ఇప్పుడేమి సేయవలెరా ?
సజ : గీతం students కి భయం భక్తీ లేకుండా పోతున్నాయి. వారిని భయపెట్టు గురూ కామా : మనం ప్రజా రంజకులం ప్రజా రంజన సేయవలెరా.సరైన కోరిక కొరుము రా !
సజ :అయితే వశీకరణ విద్య ప్రదర్శించు గురూ !
కామా : నచ్చి నావుర. మెచ్చినానురా..ఎవరిని వశం సేసుకోను .ఒక మంచి డింభకుడి పేరు సెప్పర
సజ : ఈ జనం లో నిక్కు అనే ఎవరి మాటా వినని మొండి బ్రహ్మచారి మేష్టరు ఉన్నాడు గురూ .అతడిని వశం సేసుకోవటం ఎవరి తరం కాదని ప్రిన్సిపాలే అ న్నారుట
కామా : అయితే పిలవరా
సజ : బాబూ నిక్కూ
నిక్కు వచ్చాడు .
కామా ;నిన్ను నా వశం సేసుకుంటానురా డింభకా నదరక బెదరక లొంగుముర .రాజకుమారి లాంటి పిల్లని ప్రేమిస్తివి కదరా. !మీ మావ సివిల్స్ పాస్ అయితే కానీ పిల్ల నివ్వనన్నాడు కదరా! సెప్పినట్టు వినరా ! నీ పెళ్లి సేయిస్తాను
నిక్కు : అయితే సరేగురూ ! ప్రేమకోసం ఈ పసివాడు మీ వశం అవుతాడు
కామా : చండీ ప్రసన్న !చాముండీ ప్రసన్న ! కాత్యాయినీ ప్రసన్న ! ( అంటూ భయంకరం గా మంత్రాలు చదివి ) నా కళ్ళల్లోకి సూటిగా చూడరా నా వశం అవుతావు నా వాడివి అవుతావు . నీ కళ్ళు మూసుకు పోతున్నాయి .. పోయాయి .సదా జపా ! డింభకుడిని నేలపై పం డ పెట్టు .మీద ఈ వస్త్రము కప్పు .( ఎన్ పి ఆపని
చేసాడు )
సజ : ( జనం తో ) ఇప్పుడు గురువు గారు మీ మనసులోని మాట అతని నోటా చెప్పిస్తారు. మీరు చేయ వలసిన దల్లా పెద్దయ్య వారి దగ్గరున్న ప్రియ లేఖిని మీద మీకు నచ్చిన మాట వ్రాయటమే ఆ బొమ్మ ఆ వెనక కట్టిన తెరపై ప్రత్యక్షమవుతుంది మీరు ఏమి తలుచుకున్నారో నే ల మీద నిద్రిస్తున్న డింభకుడికి తప్ప అందరికీ త తెలుస్తుంది. మా గురువు డింభకుడిని "ఇదా ! ఇదా ? "అంటూ అడుగుతూ పోతాడు. అంతవరుకు ‘కాదు ‘ అంటూ వచ్చే డింభకుడు మీరు తలుచుకున్నది రాగానే ‘అవును అంటాడు నడు ములు వంగిన నాయకులు వెనక్కి ఉండండి. ఉత్సాహవంతులైన యువకులు ముందుకు రండి "
ప్రశ్నలు వారు ట్రాన్స్పరెన్సీ ల మీద వ్రాయటం అవి OHP వలన స్క్రీన్ మీద కనిపించటం నేను ప్రశ్నలు అడగటం నిక్కు అన్నీ సరిగ్గా చెప్పటం జరుగుతుంటే ఒక పెంకి ఘటం ‘ జ్యోతి లక్ష్మి ‘ అని వ్రాసి మొదటి ప్రశ్నలో నే చెప్పించాలి అని కూడా వ్రాసాడు
సజ : గురూ మీ విద్యా పరీక్షకి ప్రప్రథంగా ఒక గడ్డు పరీక్ష పెట్టగలిగిన గట్టి పిండం ఇన్నాళ్లకు ఎదురయ్యాడు నీ మహిమ చూపు గురూ
కామా : డింభకా నిర్భయం గా సెప్పు ‘జ్యోతి లక్ష్మ్యా ? ‘
నా గుండెలు డ బా డబా కొట్టుకుంటుంటే నిదానం గా
డింభ : అ ..వు.. ను..అన్నాడు
చప్పట్లు మోగాయి
మా ప్రిన్సిపాల్ RPR గారితో "నా విద్యను నీవు కూడా పరీక్షించు ప్రాచార్యా " అన్నాను
అయన షీట్ మీద Angular Momentum అని వ్రాసారు. ప్రశ్నలు అన్నీ ఒకేలా ఉండాలి ! Odd Man Out లా ఉండరాదు కదా
కామా Velocity ?
డిం : No
Acceleration ?
NO
momentum ?
NOooo
White noise ?
Noooo
Black body ?
NOOO
Angular Momentum /
Yes Yes Yes
200 మంది విద్యార్థులు 20 మంది మేస్టర్లు Standing Ovation ఇచ్చారు

గీతముచ్చట్లు సమాప్తం మీ ఆదరణకు కృతజ్ఞతలు

Written by kavanasarma

June 25, 2018 at 12:29 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

 1. బాగుంది అండి. కానీ నేడు హేతువాదులు,మానవవాదులము అంటూ చాలా మంది అన్ని
  మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తున్నారు కదండీ.

  On Mon 25 Jun, 2018, 05:59 Kavana Sarma Kaburlu, wrote:

  > kavanasarma posted: “గీతం:వార్షికోత్సవ ప్రదర్శనలు 3.: వశీకరణ విద్యా
  > ప్రదర్శన నేను ఈ ప్రదర్శన ని మొట్టమొదటిసారి అర్బిల్ ( ఇరాక్) లో ఇచ్చాను
  > హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వైద్యుడు (మరో )శర్మ ని నా మంత్రోచ్చారణ తో వశ
  > పరుచుకుని ప్రజలు నా చెవిలో చెప్పిన మాటల ని డా.శర్మకి మానసిక తరంగాల”
  >

  Eswaridevi Kondapalli

  July 5, 2018 at 3:59 pm


Comments are closed.

%d bloggers like this: