Kavana Sarma Kaburlu

All Rights Reserved

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

5 మనచరిత్ర (కొనసాగింపు );
మౌ ఖిక లిఖిత సాహిత్యాలు, శాసనాలు , వ్రాతలో నమోదు చేయబడిన విషయాలు ( Records) భూమి పైన భూమి లోపల నీటి లోపల దొ రికే పురాతన వస్తువులు,, చరిత్ర రచనలకి ఆధారాలు గా ఉంటాయి .కాలం లో వెనక్కి వెళ్ళినకొద్దీ, చరిత్ర రచన సాహిత్యం మీదే ఆధారపడాల్సి వస్తుంది.
పురాణ ఇతిహాస మహా కావ్యాలలో రమ్యత కి ప్రాముఖ్యత ఉండటం చేత కల్పన ,చేర్చబడి ఉంటుంది . అందుచేత వీటి విషయం లో ఏవి కల్పనలు ఏవి అతి శయోక్తులు అని జాగ్రత్త గా పరిశీలించి వడకట్టి చూడాల్సి ఉంటుంది .
ముఖ్య పాయ చరిత్ర :
ఈ నాడు బడుల్లో కళాశాలలో విశ్వవిద్యాలయాలలో నేర్పబడుతున్న మన చరిత్ర ని నేను ముఖ్య పాయ చరిత్ర అని వ్యవహరిస్తాను .
ఈ చరిత్ర రచనకి 1859 లో ఆంగ్లేయులు శ్రీకారం చుట్టారు . ఇంగ్లండ్ లో స్థాపింపబడి రాయల్ సొసైటీ నమూనాలో ఏషియాటిక్ సొసైటీ ని విలియం జోన్స్ అనే న్యాయమూర్తి ,బహుభాషాది కోవిదుడు జనవరి 15, 1784 లో స్థాపించాడు. దానికి అనుబంధంగా ఎన్నో ‘Survey ‘ సంస్థలు మొదలయ్యాయి .. 1861 లో Archaeological Survey of India స్థాపించబడి పురా వస్తు తవ్వకాలనకి అనువైన స్థలాలని వెతకటం మొదలు పెట్టింది. దాని ప్రయత్నాల వలన 1920 లో సింధులోయ నాగరకతగ ఈ నాడు మనం చెప్పుకునే నాగరకతకు చెందిన హరప్పా మహేంజెదా రో ప్రదేశాలు కనుగొన బడ్డాయి.అక్కడ దొరికిన వస్తువులు కనిపించిన కట్టడాలు 1900 BCE కి చెందినవని నిర్ణయించారు. అక్కడ లిపి తో కూడిన ముద్రలు దొరికాయి. .ఆ లిపి చదవటం మెలాగో ఇప్పటికి తెలియటం లేదు.
ఇక్కడ నుంచి ,మన ముఖ్యపాయ చరిత్ర రచన కొన్ని ప్రతిపాదనల ( Hypotheses)ఊహనల( Assumtions) ఆధారంగా ఒకరూపం దాల్చటం మొదలు పెట్టింది.
ప్రతిపాదనలు /ఊహనలు :
1. మొదట్లో ‘హిందూ " దేశం లో ఉన్న జనాలు ద్రవిడులు .వీరు నల్లని రంగువారు వీరు సింధు నది వారికీ విస్తరించి ఉన్నారు.
2. ఆర్యులు సంచార జాతికి చెందిన వారు. వీరు తెల్లని వారు కకేషియన్ లు వారు హిందూ దేశం వచ్చి దండయాత్రలు ( Invasion ) చేస్తూ ,విస్తరించు ( Migration ) కుంటూ పోయారు.
3 అటువంటి దండయాత్రల వలెనే హరప్పా మహెంజెదారో నగరాలు 1500 BCE కి నాశనం అయ్యాయి.
4. వీరు తమతో తమ మౌఖిక సాహిత్యమైన వేదాలను ఉపనిషత్తులను తెచ్చుకున్నారు . ఇవే హిందువులు అతి గర్వంగా చెప్పుకునే విజ్ఞాన ఖనులు రామాయణ భారతాలు 1500 BCE తరవాత రచించబడ్డాయి
.5. ప్రపంచమంతటా గ్రీకుల జ్ఞానమే వ్యాపిం చి ఉన్నది
6. క్రైస్తవ మతం సత్య మతం . సృష్టి క్రీ .పూ . 4000 కి 5000 కి మధ్య జరిగింది .
7 అలెగ్జాండర్ ఇండియా పై దండెత్తి వచ్చినప్పుడు హిందూ దేశం లో మగదని పరి పాలిస్తున్నది మౌర్య చంద్ర గుప్తుడు
ఒకొక్క ప్రతిపాదననే పరిశీలిద్దాం .
1. మొదట్లో హిందూ దేశం అంతటా ద్రావిడులు విస్తరించి ఉండేవారు అనటానికి ఆధారాలు ఏమి లేవు. మౌఖిక సాహిత్యం లోను ,ఆ తరవాతి లిఖిత సాహిత్యం లోను వింధ్యకి దిగువున ఉన్నప్రాంతంకి ద్రవిడ ప్రాంతం అని వ్యవహటించేవారని మాత్రమే తెలుస్తోంది .
2 రామాయణ, భారతాల్లోని ఆర్యులుగా వ్యవహరింప బడిన రాముడు, కృష్ణుడు ద్రౌపది నల్లని వారు అందమైన వారు. ఆర్య గ్రంథకర్తగా చెప్పబడే వ్యాసుడు కూడా నల్లని వాడే . AIT ,AMT లు తప్పుడు ప్రతిపాదనల్ని ,మొదటనుండి ఖండింపబడి ,ఆపైన తప్పుగా నిరూపింపబడినవి. .
3 సింధులోయ నాగరికత నాశనానికి కారణం మొదట్లో వరదలు, ఆ తరవాత నదీ ప్రవాహం, దారి మార్చుకోవటం ,భూమిలోకి అంతర్ధానం అవటం. మెసపొటేమియా లోని జనవాసాలు కూడా నీటిపారుదల, వ్యవసాయాల వలన అక్కడి భూములు క్షారవంతమై పోవటం వలన ,ఏ ఇతరుల దండయాత్రల ప్రమేయం లేకుండా నే , నా ప్రాంతం లో మిగలకుండా పోయాయని తెలుసుకున్నారు.
4 .ఆర్యులు ఎక్కడ నుంచో వచ్చి,తమతో వేదాలు తెచ్చుకున్నారని చెప్పటానికి IndoEuropean భాషాకూటమికి సంస్కృతం చెందటం ఋ జువు కాదు. దీని గురించి పూరా వ్యాసం లో చెప్పటం జరిగింది.
5 ప్రాచీన ప్రపంచం కలిగి ఉన్న జ్ఞానం అంత గ్రీకుల నుంచే వ్యాపించినది అనేది ఊహ మాత్రమే ఏ ఋజువూ లేదు. జ్ఞానం ఎటునుంచి ఎటు వెల్లింది అన్న విషయం చివరి వ్యాస ఎం లో చె ప్తాను .
6 క్రైస్తవ మతం పూర్తిగా సత్య మతమనీ ఇప్పుడు ఎవరూ నమ్మటం లేదు పైగా వారి గ్రంథం లో సృష్టి గురించి చెప్పినది పూర్తిగా అసత్యమని అందారూ నమ్ముతున్నారు.
7. అసలు సమస్య అంతా ఈ ప్రతిపాదన తోనే .మన సాహిత్యం లో శాసనాల్లో చెప్పబడిన కాలాలకు వలస పాలకులు వాడుక లోకి తెచ్చిన క్రీస్తు శక కాలాలకు లంకె పెట్టగలిగితే కాని మనదేశ చరిత్ర వ్రాయటం కుదరదు. మనవాళ్లకి కలియుగం ప్రారంభం అయ్యాక ఇన్ని సంవత్సరాలకి అని చెప్పటం ఒక అలవాటు. అందుచేత ముఖ్య పాయ చరిత్ర కారులకి , కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందో తెలియాల్సి వచ్చింది . వారు వచ్చేసరికి వాడుకలో ఉన్న శకం శాలివాహన శకం అది 78 CE లో ప్రారంభమైనట్టు లెక్క కట్టగలిగినా కలియుగ ప్రారంభం అంతకు ముందు ఎప్పుడో తెలియలేదు.
మన గ్రంథ కర్తలకి ,తమ కాలం లో అమలులో ఉన్న శకం లో ఏ సంవత్సరం నడుస్తుందో చెప్పే అలవాటు ఉన్నది కానీ అది ఎవరి శకమో స్పష్టం గ చెప్పే అలవాటు లేదు. మనదేశం లో శాలివాహన శకానికి ముందు ఎన్నో శకాలు వాడుకలో ఉన్నాయి . అందులో ఒకటి యుధిష్ఠర శకం అది కలియుగ ప్రారంభానికి 36 సంవత్సరాల ముందుది. వారు కలియుగ ప్రారంభం నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచాయో కూడా చెప్తూ ఉండటం వలన వారున్న శకం ఎవరిదో తెలిసే అవకాశం ఉన్నది. విక్రమార్కజననం కలి 3000 లో అని అతని శకం కలి 3044 లో అని మనకీ , ముఖ్య పాయ చరిత్రా కారులకీ తెలుసు . వారికి తెలియనిదల్లా కలి ఎప్పుడు ప్రారంభమైనదన్నది
వారు ఆ సమస్యకి సమాధానం కోసం చేసిన ప్రయత్నం లో కొన్ని ఊ హనాలు చేశారు. భారత యుద్ధం 1500 BCE కి 1900 BCE మధ్య జరిగింది .వారికి మన చరిత్ర లో ఎదో ఒక ఘట్టాన్ని వారికి తెలిసిన ఒక కాలం తో ముడి పెట్టగలిగి న ఊహన కావలసి వచ్చింది , అప్పుడు వారు మనదేశం పైకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చినప్పుడు ఏ రాజులు పరి పాలిస్తున్నారో తెలిస్తే ఆ చిక్కుముడి విడిపోతుందని భావించారు .దానికి సంబంధించిన ఊహనే ,అప్పటి రాజు మౌర్య చంద్ర గుప్తుడనేది. అటు గ్రీకుల పుస్తకాల్లో చాణక్య, చంద్ర గుప్తుల పేర్లు లేవు .పురు పేరుంది కానీ అతని కలి కాలం తెలియదు. ఇటు మన మౌర్య చంద్ర గుప్తుడి కాలం, కలి కాలపు లెక్కల్లో తెలుసు కానీ ,ముద్రారాక్షసం లాంటి పుస్తకాలలో ,అలెగ్జాండర్ ప్రస్తావన లేదు. అయినా ముడి గట్టిగా పెట్టేసారు . దాన్ని సమర్ధించటానికి భాషా శాస్త్రాన్ని ఎరువు తెచ్చుకుని వారి భాషలో పేర్లకి సంస్కృతం లో పేర్లకి ఒక నమ్మ శక్యం కాని సంధానం చేశారు.
ఈ సంధానాన్నీ అప్పటి నుంచి ఇప్పటివరకు వారి భాషావేత్తలు మన బాషా వేత్తలు ప్రశ్నిస్తూనే ఉన్నారు .ఫలితం శూ న్యం.
ఈ ముడి తో నిర్మించిన చరిత్రనే నేర్చికున్న వారు తరవాతి తరాలకి నేర్పుతూ వచ్చారు .మనం మన గురించి తెలుసు కోవటానికి ఆంగ్లానువాదాలపైన , వాటిని చూసి వ్రాసిన పుస్తకాల పైన ఆధారపడటం దురదృష్టం .మన మూల గ్రంథాలతో మనకి పరిచయం తక్కువ
ఈ ముడి వలన మం చరిత్రని కుదించాల్సిన అవసరం ఏర్పడిండి అదే గౌతమీ పుత్ర శాతకర్ణి ని శా లివాహనుడి ని ఒకటి చేసింది .అదే గుప్త చంద్ర గుప్తుడిని, విక్రమార్కుడిని ఒకడిగా చేసింది. .చరిత్రనంతా తప్పుల తడకగా చేసింది
పూర్తి వివరాలు కవన శర్మ సత్య శారద వ్రాసిన ‘మన ప్రాచీన చరిత్ర ఒక కొత్త చూపు’ ని సంప్రదించ వచ్చు
మన చరిత్ర గురించి నా వ్యాసం మూడో భాగం లో మన జాతీయ చరిత్రకారుల ఊహనాల లోని తప్పులు కూడా చెప్తాను ( స శేషం )

Advertisements

Written by kavanasarma

May 3, 2018 at 10:34 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: