Kavana Sarma Kaburlu

All Rights Reserved

మనదేశం ,మనసంస్కృతి , మన చరిత్ర ,మనవిజ్ఞానం

leave a comment »

మనదేశం ,మనసంస్కృతి , మన చరిత్ర ,మనవిజ్ఞానం -నా అవగాహన
4 మన చరిత్ర :

ప్రతి శాస్త్రం లోను కొన్ని ప్రతిపాదనల ఆధారం గా నమూనాలని నిర్మించటం జరుగుతుంది . ఆ నమూనాలు అప్పటికి అందుబాటులో ఉన్న యదార్ధ సమాచారాన్ని వివరించి తీరాలి .( ఇక ముందు ఈ వ్యాసం లో సమాచారం అన్న మాటని యదార్ధ సమాచారం అనే అర్ధం లోనే వాడుతానని గుర్తించాలి)
ఆ నమూనాలు వివరించే కొన్ని ఇతర విషయాలు , సరైనవి అనో, తప్పువి అనో తేల్చి చెప్పటానికి అవసరమైన సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉండదు .ఆ సమాచారం లభ్యము అయ్యే వరకు వేచి ఉండాల్సిందే . వేచియున్న కాలం లో ఆ విషయాలు తప్పనో సరైనవే అనో శాస్త్ర వేత్తలు రెండు వర్గాలుగా విడిపోయి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక వర్గం వారు మరో వర్గం వారూ వాదించుకుంటూ ఉంటారు . కొందరు శాస్త్ర వేత్తల అభిప్రాయాలు అంతక మునుపు చాలా విషయాల్లో సరైనవే అని తేలినా , ఈ తేలని ఊహల పట్ల వారి అభిప్రాయాలు , స్థిరపరచబడ్డ విషయాలుగా మనం స్వీకరించరాదు .
వ్యతిరేక నిదర్శనాలు పోగు పడినకొద్దీ , ఈ కొత్త సమాచారపు పోగుని కూడా వివరించే విధంగా నమూనాలని మెరుగు పరచుకోవటమో , పాత కొత్త సమాచారాలనివివరించే కొత్త నమూనా నిర్మించుకోవాటమో జరగాలి . అంటే
,ఏది యదార్థ మని తెలుసో ఆ జ్ఞానం , ఏది ఇంకా యదార్ధమని తెలియదో ఆ జ్ఞానం , మనం కలిగి ఉండాలి .
మన చరిత్ర విషయంలో రెండు రకాల అభిప్రాయాలు బలంగా ఉన్నాయి .
మొదటిది ముఖ్యపాయ అభిప్రాయం అంటాను. ఇది పాశ్చాత్య పండితులు కొన్ని ప్రతిపాదనలు మీద ఏర్పరుచుకున్నది దీనినే మనకి బడుల్లో నేర్చుతున్నారు
రెండో అభిప్రాయం మన పండితులు మన గ్రంథాలలోని కొన్ని ప్రతిపాదనలు ఆధారం గా ఏర్పరుచుకున్నది
ఈ రెండు అభిప్రాయాలు ఏ నమూనాల వలన కలుగుతున్నాయో , ఆ నమూనాలు ఆధారపడ్డ ప్రతిపాదనలని , ,ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం, పూర్తిగా సమర్ధించటం లేదు. . అంటే మనం ఈ రెండు నమూనాలని పక్కన పెట్టి కొత్త నమూనాని నిర్మించుకోవాలి
అంటే మన చరిత్రని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదదని గుర్తించాలి.
దానికి మనం ఇన్నాళ్లుగా యదార్ధాలుగా నమ్ముతున్న వాటిని ,వదులుకోవాల్సి ఉంటుంది.
, మనం ఇన్నాళ్లు నిర్ద్వంద్వము గా శాస్త్రీయమ అని నమ్మిన దానినిపట్ల మనకున్న జ్ఞాన ఆవేశాన్ని , లేక జాతి గొప్ప దనం పట్ల మనకి ఉన్న భక్తి ఆవేశాన్నిపక్కన పెట్టగలిగితే కానీ ఇది సాధ్యం కాదు ( సశేషం ) .

Advertisements

Written by kavanasarma

May 2, 2018 at 4:51 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: