Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

మనదేశం మన సంస్కృతి, మన చరిత్ర ,మనవిజ్ఞాన ం

మనదేశం మన సంస్కృతి, మన చరిత్ర ,మన విజ్ఞానం -నా అవగాహన
3 ఆర్య జాతి :
1650 నుంచి 1950 వరకు జరిగిన కాలం లో ఆర్యులు అనే జాతి భావన ఒకటి పుట్టి అది అనేక చర్చలకు దారి తీసింది .అది ఇప్పుడు అటువంటి జాతి ఒకటి ఉన్నదన్న భావన తప్పని పూర్తిగా తేలినా ఆభావన యొక్క శవాన్ని చాలా పవిత్ర భావంతో కొందరు ఇంకా భద్ర పరుచుకుని ప్రస్తావిస్తూనే ఉన్నారు .
.
సహకార పద్ధతిని సంప్రదించుకుంటూ సైన్స్ ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశం తో రాయల్ సొసైటీ ఏర్పడింది. మొదట్లో దాంట్లో న్యూటన్ కి ప్రవేశం లేక పోయింది. కానీ అతని న్యాయాలని అడ్డుకోవటం, అతన్ని అడ్డుకోవటం అంత సులభం కాలేదు . ఆపైన కొత్త సైన్స్ వికసించింది . గొప్ప యంత్రాలు నిర్మించబడ్డాయి వాటి ద్వారా పారిశ్రామిక విప్లం వచ్చింది . అంతవరకు , ప్రపంచమంతటా కేవలం గొప్పవారి, .మత పెద్దల ,చేతుల్లో అక్షరజ్ఞానం ఉండేది . దాన్ని సామాన్యులు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు .కానీ పారిశ్రామిక విప్లవానంతరం చాలామందికి అక్షర జ్ఞానం కలిగించాల్సి వచ్చి, విద్య అందరికి అందుబాటులోకి తేబడింది .
పారిశ్రామిక విప్లవానంతరం పరిశ్రమలకి కావలసిన ముడి సరుకుల కోసం , చవకైన మానవ శ్రమకోసం జరిగిన వెతుకులాటలో వారి మారణాయుధాలు వారికి తోడ్పడి ఐరోపా దేశాలకి వలస రాజ్యాలు ఏర్పడ్డాయి .
ఆంగ్ల వలస పాలకులకి ,తమ మతం, తమ విద్య ,తమ సంస్కృతి ,ఇక్కడ ఉన్నవాటికంటే గొప్పవి కనకే , తాము పాలకుల మయ్యామనే భావం గట్టిగా పని చేయటం మొదలు పెట్టింది. వారి పాలనకు వారి పరిశ్రమలకు, వారి భాషా విద్యలు నేర్చుకున్న మన వారు, వారికి అవసరమై వారి విద్యా విధానం మన దేశం లో మొదలయింది
అయితే మనకి, వారికున్నటువంటి వాటికంటే, ప్రాచీన మైన సాహిత్యం సంస్కృతి, తత్వ, ధర్మ శాస్త్రాలు , ఉన్నాయి. కుతూహలం తోనే కావచ్చు ,వాటిని తప్పుల తడకలు గా చూపించాలనే ఉద్దేశం తోనే అయిఉండవచ్చు, వాటిని చదవటం ,అనువదించటం విలియం జోన్స్ లాంటి వారు మొదలు పెట్టారు .చదివినకొద్దీ మాక్స్ ముల్లర్ లాంటి వారు ముగ్ధులవజొచ్చారు.
అప్పుడు వారికి మన గ్రంథాలలో ‘ఆర్యులు" అనే మాటలు పదే పదే కని పించాయి. ఆ పదం వర్తించే వారు పశు పోషకులని, వ్యవసాయ దారులని,తెల్లని వారని చదివారు. అదొక జాతి అనుకున్నారు . నల్లని వారు వెడల్పు ముక్కులున్నవారు అయిన కొందరు దస్యుల గురించి కూడా తెలుసు కున్నారు
దేవ దానవుల యుద్ధాలని తెల్లని ఆర్యులకు నల్లని ద్రావిడులకి జరిగిన యుద్ధాలుగా ఊహించి , ఒక నమూనాని నిర్మించుకుని దాని ప్రకారం మన పురాణాలకి , వ్యాఖ్యలు వ్రాసారు. 1924 లో కనుగొన్న మహేంజదారో అనే సింధులోయలోని పురావస్తు శిధిలాల లో కనిపించిన కంకాళాల గుట్ట ని ఆర్యుల దాడి లో నాశనమైన ద్రావిడులవి గా భావించారు. అవి 1900 BCE కి చెందినవిగా నిర్ధారించారు .అంటే ఆర్యులు ఆ కాలం లో బయటనుంచి వచ్చిన Indo European భాషా కూటమికి చెంది జాతి అని ,వారు కకేషియన్లని వారు నమ్మారు. , అంటే తమ పూర్వీకులు ఇక్కడికి వచ్చి ఇక్కడి ద్రావిడులని ఓడించారని , వేదాలు లాంటి గొప్ప సాహిత్యాని ఆర్యులు తమతో వెంట పెట్టుకు వచ్చారని , వచ్చాక ఇక్కడ భారతం మొదలైన పురాణాలు తమ వారే వ్రాసారని , ఐరోపా Indologists భుజాలు తట్టుకున్నారు.
హిట్లర్ ఏకంగా తన జాతి ఆర్య జాతి అని ప్రచారం చేసుకుని హీబ్రూ అనే అనాగరిక ( సెమెటిక్) భాష మాట్లాడే యూదులని తుద ముట్టించాలని చూసాడు
మరో పక్క, మనదేశం లో మార్క్స్ తో ప్రభావితులై ,వామపక్ష భావజాలం అల వరుచుకున్న మేధావులు దీనిని వెంటనే ఒప్పేసుకుని రామాయణంలాంటి పురాణాలకి జాతి పోరాటాల రంగులు పులిమారు ఈ సిద్ధాంతాన్ని Aryan Invasion Theory ( ATM) అంటారు దీని కి ఆద్యుడు వీలర్ .త్వరలోనే మరింత తవ్వకాలు జరిగాక ఈ సిద్ధాంతం తప్పని తేలిపోయింది.
అప్పుడు, ఆర్యుల వ్యాప్తి సిద్ధాంతం (Aryan Migration Theory – AMT) ని సంస్కృత వ్యాకరణాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న వీట్ జెల్ ప్రతిపాదించాడు . దీని ప్రాభవం కొన్నాళ్ళు వెలిగింది . అయితే మనవారితోపాటు ఐరోపా పండితులు కూడా అతని తప్పు ఎత్తి చూపటం తో ఆ సిద్ధాంతాన్ని ఉపసంహరించుకున్నాడు. అయితే మన వారిలో మూల గ్రంథాలని పక్కన పెట్టి ఆంగ్లేయుల , ఆంగ్ల అనువాదగ్రంథాలని , వాటిని చూసి మనవారు వ్రాసిన మన వారు వ్రాసిన గ్రంథాలని , చదివిన మన వారు మాత్రం ఇంకా AIT , AMT లనే పట్టుకుని వేళ్ళాడుతున్నారు
సింధులోయ నాగరికతకు చెందిన మరి కొన్ని స్థలాలూ ఈ మధ్య తవ్వగా అవి 6500 BCE కి చెందినవని తేలింది కానీ మన చదువుల్లో కాలాలు మారలేదు
1950 తరవాతి కాలం లో జీన్ జాడలు ( Markers ) వాడి చేసిన అధ్యయనాలు .మనదేశం మొత్తం జనాభా అంతా 9000 సంవత్సరాల పూర్వమే ఒకే జీన్ పూల్ కి చెంది ఉన్నట్టుగా తెలియచేశాయి .
ఆ జన్యు అధ్యనాల సమాచారాన్ని వివరించే నమూనా ని ప్రతిపాదించబడింది . మొట్ట మొదట Ancient North Indian (ANI) జన్యువులు Ancient Soth Indian (ASI) జన్యువులు అనే వర్గాలు విడిగా ఉండేవని ,9000 సంవతసారాలక్రితం పర్షియన్లు మొదలైన Sindhu Valley Peripheral జనాలు వచ్చి వీరితో కలిసారని అప్పట్నుంచి ఒక పెద్ద జన్యు వర్గం (pool ఏర్పడిందని , తరవాత సింధు లోయ నాగరికత పూర్తిగా ధ్వంసం అయ్యాక అంటే 1900 BCE తరవాత స్టెప్పీలు వచ్చారని .వారి జన్యువులు కూడా ఇప్పటి భారతీయులలో కనిపించటానికి అదే కారణం అని.
అయితే వేదాలు పురాణాలు ఎప్పటివి అన్న విషయాన్నీ ఈ నమూనా వివరించదు . అవి నిర్ధారణగా సరస్వతీ నది భూమిలో మరుగు పడక, భూమి పై ఉరకలు వేస్తూ ప్రవహించిన కాలం కి చెందినవే. ఆకాలం భూ శాస్త్ర పరిశోధనల ప్రకారం 3000 BCE దో అంతకుముందుదో !
ఈ అధ్యయనం వలన తేలిన విషయాలు రెండు .

1. మన ప్రాచీన గ్రంథాల రచనకి చాలాకాలం ముందరే ఉత్తర దక్షిణ భారతీయ జాతులు కలిసి పోయి ఉంటే కనక ఆ సాహిత్యం లోని ఆర్య అనే పదం జాతిని సూచించదు లేదూ ,
. ఒకవేళ ప్రాచీన భారతీయ గ్రంథాల రచన కాలానికి ఉత్తర దక్షిణ భారతీయ జాతులు విడి విడిగానే ఉన్నాయి అనుకున్నట్టయితే , ( అవి ఆర్య ద్రావిడ జాతులు అయినా కాకపోయినా ) ,ఆ గ్రంథాల రచనా కాలం 9000 BCE కి చుట్టుపట్లది, అయి ఉండాలి అంటే అవి బయట వారు వచ్చి రచించినవి కావు.బయట నే రచించి , తమవెంట తెచ్చినవీ కావు!
2. సింధులోయ నాగరికతా నాశనం బయటి సమూహాల దండయాత్రల వలన జరగలేదు .

Written by kavanasarma

May 1, 2018 at 12:30 pm

Posted in Uncategorized

%d bloggers like this: