Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

మనదేశం మనసంస్కృతి, మన చరిత్ర మన విజ్ఞానం

మనదేశం మనసంస్కృతి, మన చరిత్ర మన విజ్ఞానం – నా అవగాహన
2. ద్రావిడ- ఆర్య పదాలు :

, ద్రావిడ ఆర్య అనే పదాలు జాతి సూచకాలని ఇప్పటికి చాలా మంది గట్టిగా నమ్ముతారు. ద్రావిడులపై ఆర్యుల దండయాత్రగురించి వారి వ్యాప్తి గురించి చరిత్ర పుస్తకాలు ఇంకా బోధిస్తూనే ఉన్నాయి .వీటిగురించి కొంత చెప్పటానికి ప్రయత్నిస్తాను . ద్రావిడ పదం ;
తమిళ నాట ఇప్పుడు ద్రావిడ జాతి తాలూకా వి అని చెప్పుకునే రాజకీయపక్షాలున్నాయి.
.ద్రావిడ భాషాకూటమి ఒకటి ఉన్నది. ప్రపంచ జనాభాలో ఆ కూటమికి చెందిన భాషలు మాట్లాడే వారు

1.1 % ఉన్నారు. ఆ భాషా కూటమి కి చెందినవె కాశ్మీర్ కి చెందిన శీ నాయ్, ఆఫ్ గనిస్తాన్( గాంధారాని) కి చెందిన బ్రహుయి భాషలు
బ్రాహ్మణులలో పంచ ద్రావిడుల పేరు మీద , గుజరాతీ, మహారాష్ట్ర , కన్నడ ఆంధ్రా తమిళనాడు లకు చెందిన వారున్నారు. ద్రావిడ్ అనే పేరు గల పెద్ద ఆటగాడు ఉన్నాడు.
ఒక ప్రాంతం బట్టీ అక్కడ నివసించే ప్రజలకి మాట్లాడే భాషకి పేరు రావటం మనకి తెలుసు. నివసించే జాతి బట్టీ ప్రాంతానికి పేరు రావచ్చు .అందుకని డీఏ విషయం కొద్దిగా చెప్పుకుందాము
అతి పురాతన కాలం లో ద్రావిడ అన్న పదం ఎక్కడ వాడ బడింది అని నేను వెతుకుతుంటే, నాకు ఆ పదం సంస్కృత భాగవతం 9 వ స్కంధం మొదటి శ్లోకం లో కనిపించింది .దాంట్లో " సత్య వ్రతుడు అని పేరు గల వైవస్వతుడు ఒక ద్రావిడ రాజు " అని ఉండటం చూసాను . ఇతఁడు రాముడికి పూర్వీకుడు. ఇతని మరో పూర్వీకుడు దండకుడు ఇప్పటికి అతని పేరు మీద దక్షిణా పథం లో ఒక అరణ్యం ఉన్నది. రఘు వంశీయుల గురువు అయిన వశిష్ఠు డి, భార్యా పేరు మీద వ్యవహరింపబడే అరుంధతీయులు ఇప్పటికీ దక్షిణ భారత దేశం లో ఉన్నారు.
వైవస్వతుడి కాలం లో అతని సంతతిలో హెచ్చు మంది, తెలుగు నాట నుండి అయోధ్యకి తరలి వెళ్లి నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. అక్కడ పుట్టి పెరిగిన వాడే రాముడు.. వీరి కాలం లో ను తరవాత కాలం లోను పరస్పరం పిలుచుకోవటం ", ఇప్పుడు మనం "you gentleman " అని పిలుచుకునే ధోరణిలో "ఆర్యా ! " అని చేసే వారు అని అనుకుంటున్నాను
అందుచేత ద్రావిడ అనేది ప్రాంతానికి చెందిన విశేషణము కానీ జాతి కి చెందినది కాదు అనుకుంటున్నాను . ఆర్య పదం గురించి చర్చించాక , సింధులోయ నాగరికతను చర్చించాక , ఆర్య భాష ఆర్య జాతి, ఇండియాకి సంబంధించిన అధ్యయ నాలు( Indic studies ) అవసరం మేరకు వివరించాక , జీన్ సూచికల అధ్యయన ఫలితాలతో నా వాదనని బలంగా సమర్ధిస్తాను ,.
( స శేషం )

Written by kavanasarma

April 30, 2018 at 12:56 pm

Posted in Uncategorized

%d bloggers like this: