Kavana Sarma Kaburlu

All Rights Reserved

మనదేశం ,మనసంస్కృతి ,మనచరిత్ర ,మన విజ్ఞానం – నా అవగాహన

leave a comment »

మనదేశం ,మన సంస్కృతి, మనచరిత్ర , మన విజ్ఞానం – నా అ వగాహన !. ‘.హిందూ’ అనే పదపు వాడకం
సామాన్య శక పూర్వం 4 వ శతాబ్దం లో మెగస్తనీస్ అనే గ్రీకు రచయిత "ఇండికా " అనే గ్రంథం వ్రాసాడు (అందులో వ్రాసినవన్నీ సత్యాలు కావు )
పర్షియా భాషలో ‘స’ కి ‘హ’ వస్తుంది వారు సింధు నదికి తూర్పున ఉన్న ప్రాంతానికి హిందు ప్రాంతం అని వాడినట్టు ఊహించవచ్చు .గ్రీకులు పర్షియా ,దాటి మనదేశం వచ్చే సమయం లో వారికి ఆమాట పరిచయం అయి ఉంటుంది.
అరబ్బులు వాడిన ‘హిందూ ఆవల ‘ అన్న పదం ఆ తర్వాతది
12 వ శతాబ్ది నాటికి పైదేశాల వారు మన దేశాన్ని ‘ హిదూస్థాన్ " గా వ్యవహరించటం స్థిరపడింది.
18 వ శతాబ్దం చివరికి ఐరోపా వ్యాపారులు వలసల స్థాపకులు మనదేశం లో ఉన్న ధార్మిక సూత్ర అవలంబీకులని హిందువులు గా వ్యవహరించటం మొదలు పెట్టారు
దానిని ఒక అబ్రహామేతర ‘ ism ‘ గా వ్యవహరించటం 19 వ శతాబ్దపు మొదటి భాగం లో జరి గింది .అప్పుడే Hinduism అన్న పదం సృష్టించబడింది
మానధర్మం పేరు సనాతన ధర్మం ,మనం సనాతనీయులం .అయితే ఈ పదాలు ఇంగ్లిష్ చదువులు చదువుకున్న ఆధునికులకి 20 వ శతాబ్దం మొదటి నాటికే ఎబ్బెట్టుగా అనిపించి వారు తమని " హిందువులు’ గా తమ మతాన్ని "హిందూ మతం "గాచెప్పుకోవటం మొదలు పెట్టారు . ఇప్పుడు ఆ పదాలు కూడా తప్పుడు భావాలుకొందరికి కలిగించి " నేను హిందువుని ఎందుకు కాను ?" అనే వారిచేత వ్రాయిస్తున్నాయి.
అందుకని నేను హిందూ మతానికి బదులు వాడే మాట " బహుళ తత్వ భారతీయ మతం " అందులో ఎన్నో’ isms’ కి పూర్వం నుంచి హిందూ మతం లో ఉన్నట్టే , వాటి సముచిత స్థానాలు వాటికి ఉంటాయి .

Advertisements

Written by kavanasarma

April 30, 2018 at 2:24 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: