Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

రంగస్థలం -చిత్రం

రంగస్థలం సినిమా నిన్న చూసాను . టూకీగా- అనగా అనగా ఒక భూపతి రాజు అనే ప్రెసిడెంట్ గారు 30 సంవత్సరాలుగా ఒక ఊరిని అక్కడి జనాన్ని ప్రెసిడెంట్ గా జంధ్యం వేసుకుని బలులు వేస్తూ పూజలు చేస్తూ , ‘సొసైటీ’ ని అధర్మంగా పాలిస్తూ ఉంటాడు . కుమార్ అనే దుబాయ్ రిటర్న్డ్ కి అది నచ్చదు అంతకు పూర్వం అతనికి అత్త వరసయినా రంగమ్మ మొగుడికి ఇంకో మరో ముగ్గురికి కూడా ఆ పరిపాలన నచ్చదు . వారందరు అయిపు లేకుండా పోతారు కుమార్ గొప్పోళ్ళ పిల్ల ని ప్రేమిస్తాడు. అతని తమ్ముడు చెవిటి మాలోకం చిట్టి బాబు , అందరికీ తెలిసినా తనకి చెముడన్న విషయం ఎవరికీ తెలియదని నమ్మేస్తూ రామలక్ష్మి అనే పిల్ల పొట్ట గిల్లుతూ , మొగుడు దగ్గరిలేని రంగమ్మత్తకి దగ్గరగా ఉంటూ , వాళ్ళ అమ్మతో పాటు ,ఈ ఇద్దరు అయిన వాళ్ళ వంటలు లొట్టలు వేసుకుని తింటూ ఉంటాడు . అతను వాళ్ళ నాన్న గోవిందా రాజులు లాగా అందరి వాడూ కావటమే కాకుండా అంతే బలమైన వాడు అందరిని పిచ్చకొట్టుడు కొట్టగలిగినవాడు . తన నటనతో ,డైలాగులతో అంత బాగాను నవ్వించగలడు. డార్విన్ పరిశోధనలు చేసిన ప్రాంతాల్లో కొన్నిప్రాంతాలు , మిగిలిన ప్ర[పంచం తో ఏ సంబంధం లేకుండా ఐసోలేటెడ్ గా ఉండి మార్పుని అవరుద్ధం (dampen) చేస్తూ మార్పు రహితముగా ఉన్నవని , మనకి తెలుసు .ఆ ప్రాంతాల్లో రంగ స్థలం ఒకటి . సెల్ ఫోన్లు, టివి. లు లేని ఊరు.
తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ,తన నాయనమ్మ పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకి మొదట్లో అన్న ఆ పైన తమ్ముడు తమ పిన తండ్రి ,వారసత్వపు ధోరణి లో ,సహించక రేడియో ( మీడియా ) వినే మొగల్ మీద తిరగ పడతారు.
అన్న చని పోవటం తమ్ముడు అన్నని చంపించిన గొప్పింటోడి పైనా మీడియా రాజు మీద పగ తీర్చుకుని రామ లక్ష్మిని పెళ్లి చేసుకోవటం తో ఆ కుటుంబం తో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవడంతో, మొగుడు పోయిన రాజకీయ స్త్రీలందరికీ చేసే మాదిరిగానే రంగమ్మత్త కి పట్టాభిషేకం చేయటం తో కథ సుఖాంతం అవుతుంది
కొట్టుకోవటాల నరుక్కోవటాల భీభత్స దృశ్యాలనుంచి సున్నితమైన హాస్యం మరీసున్నితం కానీ సరసం, మన దృష్టిని ,

తమ వైపు తిప్పుకుని మనల్ని సినిమా లో కూర్చోపెడతాయి.
మన చిట్టబ్బాయి నటనలో ఎదగటం గమనిస్తాం .అయితే మామూలుగా గుడ్డి వాళ్ళు , శబ్దం వచ్చే వైపు చెవులు తిప్పివింటారు . కనిపించక పోయినా కను గుడ్లు తిప్పుతారు . చిట్టిబాబు కి కొద్దీ పాటి గా పెద్ద శబ్దాలు వినిపించే చెముడు అందుకని , శబ్దాలు పట్టుకోవటానికి చెవులు అటు కేసి తిప్పి వింటూ ఉంటాడు
సినిమాలోని అసహజత నన్ను బాధించలేదు.

ఊరందరు హరి కథ వింటున్నప్పుడు పూర్వం ‘ షావుకారు. రోజుల్లో అన్యాయాలు జరుగబోవటం దాన్ని పసి కట్టి ఆపడం జరిగేవి. కానీ ఇప్పుడు ప్రపంచంతో ఈవూరికైనా ఉండే ఏకైక సంబంధం ఐటెం ఆట . అది జరుగుతుండగా ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది అదే సహజత అంటే

కథా ,కథనం, దర్శకత్వం ,నటులందరి నటన , పాటలు నన్ను ఆకట్టుకున్నాయి . మా ఇంటి పక్కనే ఉన్న పలేటూరి సినిమా హాల్లో మనిషికి 120 రూపాయలు చెల్లించినందుకు నేను బాధపడలేదు .

Written by kavanasarma

April 27, 2018 at 4:33 am

Posted in Uncategorized

%d bloggers like this: