Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

స్త్రీ పురుష సంయోగ స్వభావాలు- నా అవగాహన

నా అవగాహన ఎవరికైనా ఏవిధంగానైనా ఉపయోగపడుతుందేమో అన్న ఆశ తో ఇది వ్రాస్తున్నాను స్త్రీలు, ముఖ్యంగా తమ యొక్క తమ సంతానం యొక్క భద్రత కోసం , ప్రేమకోసం పురుషుడి తో సంగమిస్తారు. పురుషుడు .తనకి నచ్చిన స్త్రీ తో సుఖియించటం కోసం .తన సంపద .శక్తీ ఖర్చు చేస్తాడు రక్షణ.ప్రేమ ఇస్తాడు.
అయితే కొద్దిమంది స్త్రీలు పురుషుడికి ఉన్న సుఖలాలసత్వాన్ని వాడుకుని . సమాజం లో అధికారం , సంపద పలుకుబడి .కీర్తి సంపాదించటానికి ప్రయత్ని ఉంటారు.
వారికి కావలసినది అతి చిన్నది అయినా సందర్భాలు కూడా నేను విన్నాను. ఉదాహరణకి అతి కొద్దీ మందే అయినా కొందరు రచయిత్రులు ,ప్రచురణల కోసం బహుమతుల కోసం ఈ అడ్డ దారి తొక్కా రని పూర్వం విన్నాను.
కానీ చిన్నప్పటి నుంచి ఇవి వినటం కొంతమంది పురుషుల్లో గాలం వేసి చేపని పట్టే ధోరణిని కి దారి తీస్తుంది . నా సహాధ్యాయులు నా చిన్నప్పుడే నాకు బోధించారు " "శర్మా ! నీ అందం చూసో నీ తెలివి చూసో నీ వెంట ఎవత్తి పడదు. .నీ ధైర్యం చూసి ఆమె ధైర్యం చేస్తుంది" అని
1.. అయితే ఆ ధైర్యం అందరూ చేయరు .దానికి కారణం వారి కి ఉన్న నైతిక విలువలో , ఆ విషయం బయట పడితే , సమాజం లో .సమాజం లో తలెత్తుకు తిరగ లేము అన్న పిరికి తనమో కారణాలు కావచ్చు.
2. తమంతట తామే వచ్చి గాలానికి తగులుకునే స్త్రీల విషయం లో కొందరు కొంత ధైర్యం చేస్తారు.
3 . ఇంకొంచెం ధైర్యం ఉన్నవారు "’మనం ప్రయత్నిస్తే కదా తెలిసేది" అని ప్రయత్నించి చూస్తారు. ఒకసారి తిరస్కారానికి గురయ్యాక వారి జోలికి వీరు వెళ్లరు
4. ఇంకొంచెం ధైర్యం ఉన్నవారు , మరి కొన్ని సార్లు రావాణా సురుడి లాగ ప్రయత్నిస్తూ పోతారు. విజయమో వీర స్వర్గమో పొందుతారు.
5. మరి కొందరు మగవారు దుష్టస్వభావులై బలిమిని /అధికార మదం తో భయపెట్టి ఆ భద్రత కలిగించి లొంగదీసుకుంటారు.
ఇవాళ జరుగుతున్న చర్చ అంతా 4 & 5తరహాల గురించే అనుకుంటున్నాను వారిని నియంత్రించటానికి చట్టాలు పోలీసులు సామాజిక రక్షణా కావలసి వస్తాయి
.

Written by kavanasarma

April 18, 2018 at 1:17 pm

Posted in Uncategorized

%d bloggers like this: