Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

శ్రీ రెడ్డి

కొద్దీ రోజులుగా సంచలనం కలిగిస్తున్న శ్రీ రెడ్డి ఆక్రోశం నా అవగాహన :మనకు కొన్ని కావాలి .అవి ఇవ్వగలిగినవారికి కొన్ని కావాలి .అవి వారి కిస్తే వారు మనకు కావలసినవి మనకి ఇస్తారనినమ్ముతాము . దేవుడికి నైవేద్యం పెట్టటం లో కూడా ఈ భావం ఉంటుంది.
మనకి పెద్ద సంపాదన లేక కీర్తి కావాలి .ఆ సంపాదన వచ్చే మార్గాలు గా మనం కొన్నిటిని ఎన్నుకుంటాము .ఉదాహరణకి
1 ఎక్కువ వడ్డీలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం
2. పెద్ద జీతాలు వచ్చే దేశ విదేశ ఉద్యోగాలు
3. న్యూస్ పేపర్లలో టి.వి.ల్లో కనపడటం
4. రకరకాల అవార్డులు పొందటం
5 సినిమాల్లో ,టి.వి ల లో నటించటం ఉద్యోగాలు చేయటం
1 ,& 2 పొందటానికి మన దగ్గరున్న వనరులు వాడుకుంటాము .లేకపోతే అప్పు తెచ్చి కంపెనీల్లో మదుపుపెడతాము . ఏజెంట్స్ కి పెద్ద మొత్తాల్లో ముడుపులు చెల్లిస్తాం కంపెనీలు బోర్డులు తిప్పేసినప్పుడు ,ఏజెంట్ల చేతిలో మోస పోయినప్పుడు ఘొల్లుమంటాం .ప్రవిభుత్వపు జోక్యాన్ని ఆశిస్తాం
వార్తామాధ్యమాల్లో ప్రచారానికి ,ప్రదాతలని సంతోషపెట్టడానికి మనం చేసే ప్రయత్నాలు విఫలం అవటం తో అవార్డులు రావు .దగ్గర వాళ్ళ వద్ద వాపోతాము
మగవాళ్లు వేషాలకోసం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటె ఆడవాళ్ళలో కొందరు అడ్డదార్ల గురించి విని ప్రయత్నిస్తారు. అందమైన ఆడవారు తమ అంద చందాలతో రాజు లని వశపరుచుకున్న వైనాలు .అందమైన వేశ్యలు డబ్బున్న మగవారిని పూర్తిగాదోచుకున్న వైనాలు మనం ఎన్నో విన్నాం . అందులో " నీకిది నాకది " అన్న కాంట్రాక్టు ఉంటుంది . ఆ కాంట్రాక్ట్ .illegal and immoral అయితే అవవచ్చు కానీ పాటింపబడుతుంది.
ప్రశ్న అల్లా అటువంటి కాంట్రాక్టులు పాటింప బడనప్పుడు , నష్ట పోయిన వారి ఆక్రోశాలకి మనం ఎలా స్పందించాలన్నది ?
1. వారు అమాయకంగా మోస పోయారా .?అమాయకంగా కాక పోయినా దురాశ వలెనే అయినా అన్యాయంగా మోస పోయారా ? అన్న ప్రశ్నలు మనకి కలుగుతాయి

2 అమాయకంగా మోస పోయిన వారి పట్ల మనకి జాలి ఉంటుంది తప్పకుండా .ఉదాహరణ కి గల్ఫ్ దేశాలకి ఉద్యోగాల విషయం లో ఏజెంట్ల చేతుల్లో అమాయకంగా డబ్బులు పోసి ఆదేశాలకు వెళ్లి ఇక్కట్లు పడుతున్న వారి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అనుకుంటాం. చాలామంది మోస పోయినా , పోనీ కొద్దిమందిని చూసి వారిలా లబ్ది పొందాలనుకునే అమాయక చక్రవర్తులు ఎప్పుడూ ఉంటారు .

2 ‘మీ ప్రయత్నాలు దురాశ తో కూడుకున్నవి .మీ కర్మ మీరు అనుభవించండి’ అనటం ఒక moralistic holier than thou పద్ధతి. Consenting Adults మధ్య sex నేరం కాదు కనక

3. Real question is ‘ When an illegal and immoral contract is violted by the powerful party ‘ What is our attitude ?

4 There is a beautiful Book Titled " Justice " By Sanders .It is worth reading .He says ‘ When the weaker of the two parties is unable force the honouring of the contract by the more powerful party " it is injustice !

Written by kavanasarma

April 11, 2018 at 3:04 am

Posted in Uncategorized

%d bloggers like this: