Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

గిలిగాడి కథ

అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండే వాడు. . వాడికో నాన్న ,నాన్నకి కొన్ని గొర్రెలు ఉండేవి. ఊళ్ళో తినటానికి గొర్రెలకు గడ్డి దొరకటం లేదని వాళ్ళ నాన్న పక్కనే ఉన్న చిట్టి అడవి లో వాటిని మేపటానికి తీసుకు వెళ్తుంటే " నాన్నా నేనూ వస్తాను" అంటూ అబ్బాయి వెంట పడ్డాడు . వాళ్ళ నాన్న కి వీడంటే ముద్దు. "సరే రా ! " అంటూ తీసుకు వెళ్ళాడు . పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గొర్రెలు అడవి లో కడుపు నిండా మేసి ఇంటికి బయలుదేరాయి అబ్బాయి గొర్రెల మంద ముందర నడుస్తున్నాడు నాన్న వెనకాతలే నడుస్తున్నాడు .నెమ్మదిగా చీకటి పడింది వాళ్ళ నాన్న " ఒరేయ్ 1 పులీ గిలీ రాగలదు జాగ్రత్త గా చూస్తూ నడు " అన్నాడు.
"అల్లాగే నాన్నా ! నా చేతిలోకర్ర ఉందిగా ! నాకేం భయం ! " అన్నాడు.
అప్పటికే ఆ చీకట్లో ,సందట్లో సడే మియా అని ఒక పులి ఆ మందలో దూరిపోయి , ఉంది పొద్దున్న నుంచి ఆ గొర్రెలని చూస్తూ ఉంటె ఆ పులికి నోరు ఊరి పోతోంది కానీ వీలు దొరకలేదు పెద్ద కర్ర పుచ్చుకుని నాన్న , చిన్నకర్ర పుచ్చు కుని కొడుకు కాపలా కాస్తూ ఉండటం తో. ,
" ఇంటికి వెళ్ళాక గొర్రెలు పడుకుంటాయి కదా .ఆ తర వాత పెద్ద కర్ర వాడు ,చిన్న కుర్రవాడు , నిద్ర పోతారుకదా అప్పుడు తినచ్చులే " అనుకుని పులి ,తానూ ఒక గొర్రెలా నడుస్తూ వాటితో నడవటం మొదలు పెట్టింది. ఇల్లు దగ్గిర అవుతున్న కొద్దీ చీకటి ఎక్కువ అవుతోంది. పులికి ఆకలి ఎక్కువ అవుతోంది .అబ్బాయికి నిద్ర ఎక్కువ వస్తోంది ఇంట్లో ఉంటె ఈ పాటికి అబ్బాయి అమ్మ పెట్టిన బువ్వ తిని నాన్న చెప్తున్న కథ వింటూ నిద్ర పోయేవాడు ‘
నాన్న "ఒరేయ్ అబ్బాయి ! పులీ గిలీ వస్తుంది జాగ్రత్త " అని మరో సారి వెనక నుంచి హెచ్చరించాడు .
.
"సరే నాన్నా.నువ్వుండగా ఏ పులిగాడు రాడు. నేనుండగా ఆ గిలి గాడు రావాటానికి వాడికి ఎన్ని గుండెలుండాలి !’ అన్నాడు అబ్బాయి.
" పులిని నేను ఉన్నాను నేను వచ్చేసాను . ఇంక ఈ గిలి గాడు ఎవడో ఎక్కడ ఉంటా డో ఎప్పుడు వస్తాడో 1 ఎలా వస్తాడో ! ఏమిటి తింటాడో !పులులని తినడనుకుంటాను !నాలాగే గొర్రె లనే తింటాడు అనుకుంటాను. నాకు ఒకటి చాలు .మిగిలిన వాటిని వాడి నే తిన నిస్తాను వాడితో నాకెందుకు తగూ " అని ఆలోచించుకుంటూ పులినడుస్తోంది . అబ్బాయికి ఆవలింతలు ఆగటం లేదు.
"నేను హాయిగా నిద్ర పోవటానికి లేదు నడవాలి కనక . ఏదైనా స్వారీ దొరికితే బావుండు . ఎందుకు దొరకదు ? .మంచి బలిసిన గొర్రె పై స్వారీ చేయచ్చు . ఒక దాన్ని చూసుకుని , ఎక్కి నిద్ర పోతాను అదే ఇంటికి మోసుకు పోతుంది. " అన్న ఆలోచన అబ్బాయికి వచ్చింది .ఆ ఆలోచన రాగానే అబ్బాయి చేతిలో కర్రని జార విడిచేసి , చేతులతో ఒకొక్క గొర్రెనే తడుముతూ " ఇది నన్నేం మోస్తుంది " అని దాన్ని వదిలి పెడుతూ , పులి దగ్గరకి వచ్చి చేత్తో తడిమి చూసాడు. అది చాలా బలంగా పెద్దదిగా చేతికి తెలిసింది ‘ఇదిరా నాగొర్రె ‘ అని దాని మీద కి ఒక్క ఎగురు ఎగిరి కూర్చున్నాడు. పులి బెదిరి పోయింది .
"నా మీదకి దూకింది గిలిగాడు అన్నమాట. మామూలుగా అయితే గొర్రె లని తినేవాడు కాబోలు ఇవాళ వాడికి నేనుచిక్కాను .నన్ను తింటాడో ఏమో నేను వేగంగా పరిగెత్తాలి ఆ వేగానికి వాడు దభీ మని కింద పడతాడు " అని ఆలోచించి పరుగు లంకించుకుంది .అబ్బాయి పులి ని మరింత గట్టిగా కరుచుకు పడుక్కున్నాడు పడిపోకుండా ." వీడు నా మెడ కొరకడు కదా ? " అని భయపడుతూ పులి వేగం మరింత పెంచింది
చిట్టడవి లోకి ప్రవేశిస్తుంటే ఎలుగు బంటి ఎదురైంది.
‘ఆగు పులిబావా !ఎక్కడికి పరిగెత్తుతున్నావు నీ వీపు మీద ఎవరిని మోస్తున్నావు ? ఎందుకు మోస్తున్నావు?" అని అడిగింది
అబ్బాయికి భయం వేసింది తను పడుక్కున్నది గొర్రె మీద కాదు పులి మీద అని తెలిసి . ఎదురుగా ఉన్నది ఎలుగు బంటి .తను వీపు మీద ఉండి, పులికి కనపడలేదు. అందుకని అది భయ పడలేదు తెలిస్తే కిందపడేసి తన్నే తినేసును కాని ఎదురుగా ఉన్న ఎలుగు బంటి కి ఎందుకు కనిపించాడు ! కనిపిస్తే రెండూ కలిసి తనని చంపేస్తాయి . ఎలాగో తప్పించుకోవాలి అనుకున్నాడు .
పులి పరిగెత్తడం ఆపకుండా ‘"నేను ఎవరిని మొయ్యటం లేదు. నా వీపు మీద ఉన్న వాడు గిలిగాడు .వీడు పులుల్ని తింటాడు అనుకుంటాను "అన్నది. అలా అంటున్న
ఆ సమయానికి పులి ఒక చెట్టుకింద నుండి పరిగెత్తుతోంది .ఇదే మంచి సమయం అని అబ్బాయి చెట్టుకొమ్మ ని ఒకదాన్ని పట్టుకుని, పులిని వదిలేసాడు . చేట్టుకొమ్మని పట్టుకుని ఆ పైన నెమ్మదిగా చెట్టుపైకి పాకటం మొదలు పెట్టాడు .
వీపు మీద బరువు తగ్గటం తో పులి ఆగింది. గిలిగాడు ఏమయ్యాడో అని చుట్టూ చూడసాగింది. అక్కడికి ఇంతలో ఎలుగు బంటి వచ్చింది
" ఎలుగు బావా ! నా వీపు మీద ఉండే గిలిగాడు ఏమయ్యాడు కింద పడిపోయాడా నువ్వు చూసావా ?" అని పులి అడిగింది .
" నువ్వు మరీ భయపడి పోతున్నావు బావా ? నేను గిలిగాడు అన్న వాడు ఒకడున్నాడని ఎప్పుడూ వినలేదు. చూడ లేదు .నీ వీపు మీద ఉన్న వాడు చెట్టెక్కడం మాత్రం చూసాను. నేను చెట్టెక్క గలను కదా . ఎక్కి వాడి మొహాన్ని నా తోక తో తడిమి వాడు నిజం గా గిలిగాడు అవునో కాదో చూసి తేల్చుకుని నీకు చెప్తానాగు . " అని చెప్పి ఎలుగు బంటి అబ్బాయి ఉన్న చెట్టేక్కటం మొదలు పెట్టింది.
ఎలుగు బంటి,

వాడు నిజం గా గిలి గాడే అయితే వాడికి తన గొంతు దొరక కుండా జాగ్రత్త పడాలి అనుకుని

తోక పైకి మూతి కింద ఉండేలా చేట్టేక్కటం మొదలు పెట్టింది.
అబ్బాయి, ఎలుగు బంటిని దగరసా రానిచ్చి దాన్ని ముడ్డి మీద తన కాలితో కింద పడేలా తన్నాడు .
ఎలుగు బంటి కిందపడి కుయ్యోమోర్రో అని ఆపైన " పులి బావా ! నువ్వు గిలిగాడు అంటే కామోసని ధైర్యం చేసాను .కాని వాడు గిలిగాడు కాదు .వాడు ‘ పెద్ద దిగ తాపుడు గాడు’. వాడు కిందకి దూకక ముందే పెరిగెత్తుదాము పద " అంది. సరే నని పులి ,ఎలుగుతో పరిగెత్త సాగింది . అబ్బాయి పులి ఎలుగు బంట్ల పీడా పోయింది అనుకుని బోడ్లోని పిల్లన గ్రోవి , తీసి వాయించుకుంటూ వెనక్కి తిరిగి ఇంటికి బయలు దేరాడు నిద్ర ఎగిరిపోవటం తో.
ఆ రెండూ కొంతదూరం పరిగెత్తే సరికి నక్క ఎదురైంది ‘" పులి పెద్ద నాన్న ! ఎందుకు పరిగెత్తుతున్నావు?" అని అడిగింది
వెనకాతల గిలిగాడు తరుము కొస్తున్నాడు కొడకా ! " అన్నది పులి ఆగి ఆయాసం తీర్చుకుంటూ .
"వాడు గిలిగాడు కాదని చెప్తే పులి బావ వినటం లేదు " అంది ఎలుగు బంటి తనూ ఆగుతూ .
" అవును ఎలుగు మావా ! నేనెప్పుడూ గిలిగాడు అన్న పేరు వినలేదు .మొన్నటి కి నేను పుట్టి నాలుగు వారాలు దాటింది కూడాను" అంది నక్క
"అవున్రా అల్లుడా !వాడు గిలిగాడు కాదు పెద్ద దిగాతా పుడు గాడు "అంది ఎలుగు.
" నాకు తెలివి తేటలు ,జిత్తులు ఎక్కువ ని మీకు తెలుసు కదా . నేను వాడసలు ఏమిటో కనిపెట్టేస్తాను .వాడు మనిషేనేమో అని నా అనుమానం .వాడిచేతిలో ఏ ఆయుధం ఉన్నట్టు లేదు వాడు మనిషే అయితే మీరు వాడిని హాయిగా తినచ్చు .మీరు తినగా మిగిలిందే నేను తింటాను . మీరు నాకు తోడు రండి . " అని నక్క ఆ రెండింటిని వెనక్కి మళ్లిం చింది . .వాడు మనిషికాక ఏ గిలిగాడో ,దిగ తాపుడు గాడో అయితే .వెనక్కి పారి పోవటానికి వీలుగా కొంచెం వాడికి కొంత దూరం లో తాము ఉండేటట్టుగా జాగ్రత్తపడుతూ వెళ్ళ సాగాయి
కొంతదూరం పోయేసరికి అబ్బాయి కి తన వెనకాతల కొంత దూరం లో మెత్తని అడుగుల అలికిడిఅవుతోందనీ ఆ ఆడుగుల చప్పుడు దగ్గిర ఆవు తోందని గుర్తించాడు . .పులీ ఎలుగులే కాకుండా జిత్తులమారి నక్క కూడా తనకేసి వేగం గా, తన సంగతి తేల్చుకోవటానికి వస్తున్నాయని పసి గట్టిన ఆబ్బాయి " చచ్చానురా "అనుకుని దాక్కోవటం కోసం స్థలం వెతుకు తుంటే ఒక పాత గుడి కనిపించింది అక్కడికి వెళ్లి తోస్తే తలుపులు తెరుచుకున్నాయి . అమ్మయ్య అనుకుని లోపలి వెళ్లి గడియ పెట్టుకున్నాడు . అక్కడి కొద్దిసేపటికి పులి ,ఎలుగు నక్క వచ్చాయి. ఎందుకైనా మంచిదని పులి , ఎలుగు కాత దూరం గా నిలబడ్డాయి .నక్క , దొంగ చూపుల్ చూస్తూ గుడి తలుపుల వద్ద చేరింది .
నక్క గుడి తలుపులు తోసి చూసింది తెరుచుకోలేదు కాని రెండు తలుపు రెక్కల మధ్య ఖాళీ లోంచి గుడిలో చెక్క గడియ కనిపిస్తోంది అది తీయటం ఎలా ?కోతిబావ ఇక్కడికి ఉంటె బావుండును ఒక కర్ర ముక్కో రేకు ముక్కో ఎదో పెట్టి గడియని ఎత్తేసే వాడు. లేడు కదా ! తనే ఎదో ఆలోచన చెయ్యాలి అన్నట్టు తనకి తోక ఉన్నది కదా ! దాన్ని ఆ ఖాళీ లో దూర్చి గడియ తీయటానికి అవుతుందేమో చూద్దాం అనుకుని దూర్చింది తోక కొంచెం కష్టంతో లోపాలకి వెళ్ళింది..దంత గడియ ఎత్త బోయింది.నక్క తోక దాని బుద్ధి లాగానే వంకర . గడియ తెరుచుకో లేదు.
నక్క గడియ తెరవలేక పోతోంది అని అబ్బాయికి అర్ధమైంది . వెంటనే వాడికి ఒక కొంటె ఆలోచన వచ్చింది. నక్క తోక పుచ్చుకుని బలంగా లోపలి లాగటం మొదలు పెట్టాడు . నక్క బయటకి లాక్కోబోయింది. వాడు తోకని అటులాగా , నక్క ఇటు లాగ .నక్కకి నొప్పి ఎక్కువై ఇకిలించటం సకిలించటం మొదలు పెట్టింది .
‘ కొడకా .! ఎందుకు అంతలా ఇకిలిస్తున్నావు ? " అని అడిగింది పులి " అల్లుడ ఎందుకంత సకిలిస్తున్నావు ? " అని అడిగింది ఎలుగు .
" ఇకిలించకా ఇకిలించక , సకిలించకా సకిలించక పాత దేవుడి గుడి తలుపులు ఎలా తెరుచు కుంటాయి " అంటూ నక్క తోక ని గట్టిగా బయటకు లాగ ప్బోవటం తో అది అబ్బాయి చేతిలోకి ఊడి చక్కా వచ్చింది. దాంతో నక్క నొప్పితో గోల పెడుతూ పరిగెత్త సాగింది .దానితో పాటు పులి ఎలుగు ఎందుకైనా మంచిదని పరుగు అందుకున్నాయి అడవి వైపు
పులి " ఎరా కొడకా ఎందుకలా పరిగేడుతున్నావు ? " అని అడిగింది పరిగెత్తుతూ
‘నువ్వు వాడు గిలిగాడు అన్నావు కావా ? " అని కోపం గా దిగింది పులి ని "అవును అన్నాను" అని ఒప్పు కుంది పులి వాడు గిలిగాడు కాదు అంది నక్క
‘ " నేను చెప్పాలా వాడు పెద్ద దిగ తాపుడు గాడని పులి బావ నా మాట నమ్మ లేదు " అంది ఎలుగు పరిగెత్తుతూనే .
"వాడు దిగ తాపుడు గాడు కూడా కాదు " అంది నక్క
" మరి వాదేవరూ ? " అని అడిగాయి పులీ ఎలుగూ కూడబలుక్కుని.
" వాడా ? వాడు తోక పీకుడు గాడు మీ మాట లు నమ్మి తోక తేమ్పుకున్నాను " అంటూ నక్క పరిగెత్తుతుంటే దాని వెంట పులి. ఎలుగు అడవి లోకి పరిగెత్తాయి
కాస్సేపటికి అబ్బాయి వాళ్ళ నాన్న , మరో నలుగురిని దీపాలతో కర్రలతో వెంట పెట్టుకుని వెతుకు తూ గుడి దగ్గరకు వచ్చే సరికి అబ్బాయి ధైర్యం గా గుడి తలుపులు తెరుచుకుని బయటి కి నక్క తోక తో బయటకు వచ్చాడు .
అప్పటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు , ఆ నక్క తోక తొక్కి వెళ్ళటం మొదలుపెట్టారు. అలా తొక్కి వెళ్తే అదృష్టమని వాళ్ళకో నమ్మకం . ఆ తోక ని వాళ్ళని తోక్కనిచ్చినదుకు అబ్బాయికి జంతికలు జీళ్ళు అవీబాగా దొరికేవి అదీ వాడి అదృష్టం .!

.

Written by kavanasarma

March 27, 2018 at 10:18 am

Posted in Uncategorized

%d bloggers like this: