Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా కథ వినాయకుడి ఎలుక

నా కథ వినాయకుడి ఎలుక
నా కథ వినాయకుడి ఎలుక రచన రచన (2001 ఆగస్ట్ ) వచ్చింది
ఈ కథ నేను వ్రాయటానికి కారణం నా మిత్రుడు కీ.శే. వల్లంపాటి వెంకట సుబ్బయ్య .అతను ఒక సారి నాతో " తెలుగు లో పిల్ల గురించి పెద్దల కోసం వ్రాసిన బుడుగు లాంటి రచనలే కానీ బాల సాహిత్యం రావటం లేదు " అన్నాడు.
అప్పుడు నిర్ణ యించుకున్నాను .పిల్లల పాత్రలతో ఒక కథ పిల్ల ల కోసం వ్రాయాలని .ఆ కథే యిది. దీనికి ఒక పురస్కారం కూడా వచ్చింది అయినా దీనిని వెంకట సుబ్బయ్య గుర్తించ లేదు . అదే సంవత్సరం వచ్చిన నా కథ "విడాకుల’ని కథా నవీనుడు ఎంపిక చేసాడు .కానీ దీని జోలికి పోలేదు. ‘కథ’ సం పాదకుల దృష్టి కోణం వేరు అనుకున్నాను.
అయితే తెలుగులో బాల సాహిత్యం రావటం లేదు నొచ్చుకున్న వెంకట సుబ్బయ్య దీనిని ఎందుకు మెచ్చుకోలేదు ? అన్న ప్రశ్న నాకు కలిగింది. దీనికి రెండు సమాధానాలు చెప్పుకోవచ్చు.
1. అతను ఈ కథ బాల సాహిత్యం కోవా లోకి రాదు అని నమ్మాడు
2. అతను వాటికోసం వెతకడు కనక ఇది కనిపించ లేదు .
రామాయణం లో చారిత్రిక ఆధారాలు ఉన్నాయా ? అని సరైన దృష్టి తో వెతకని వారికి అవి కనపడవు .యాదృచ్చిక సాక్షాత్కారాలు జరిగితే తప్పించి.
దీనిపై పరిశోధనా రంగం లో ఒక చెణుకు ఉంది 5 సెం .మీ X 5 సెం .మీ ల వల వాడి ఒక జాలరి "ఈ చెరువులో ఉన్న చేపలన్నీ 5 సెం .మీ . కంటే పెద్దవే " అని ఆశర్య పోయాడుట .
మళ్ళీ కథ విషయానికి వస్తే , దీనిని 2002 లో దువ్వూరి శరదాంబ స్మారక కథా సంపుటిలో వేసా రు. ఆవిడ నాకు Engineering లో Heat బోధించిన Prof. DAS Narayana Rao గారి భార్య మిత్రుడు ప్రొఫ్ మద్దూరి రవీంద్రం అక్క .అది చాలు నాకు . వచ్చిందాయె .

Written by kavanasarma

March 16, 2018 at 2:55 am

Posted in Uncategorized

%d bloggers like this: