Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా అవగాహనలు -4

నా వాగాహనాలు-4ఇంజినీరింగ్ విద్య కాలం తో కాలంతో వచ్చిన మార్పులు
రెండో దశ :
12 లో మంచి మార్కులు వచ్చినా ఇంజీరింగ్ చదువు ఆర్ధిక స్తోమత వకాశాల అవగాహనా లేక చదవని వారు ఉన్న కాలం లోనే ఆర్ధికంగా బావుంది మంచి మార్కులు రాక చదవలేని వారి లో కొందరు , కర్ణాటకా లోని ‘Donation ‘ కాలేజీల్లో ( Private Colleges ) లో చదువుకుని వచ్చి అవకాశాలను అంది పుచ్చుకునేవారు . అప్పుడు "తెలుగు వారి డబ్బు ఫై రాష్ట్రాలకి ధారపోసే బదులు అటువంటి కళాశాలలను మనమే ఏల అనుమంతిచరాదు అన్న ఆలోచన ఆంధ్ర ప్రభుత్వానికి కలిగింది దాన్ని ఫలితమే 1978 తరవాత వ్యక్తి రంగం లో ఏర్పడిన కొన్ని కళాశాలలు నాకు గుర్తున్న వరకు ; CBIT, మాతృశ్రీ ,వాసవి కళాశాలలు ( హైదరాబాద్ ) సిద్ధార్థ ( విజయవాడ ) గీతం ( విశాఖపట్నం ) రాజుల కళాశాల ( భీమవరం ) , హిందూ కళాశాల ( మచిలీపట్టణం ) , వాకాడు కళాశాల, బాపట్ల కళాశాల , KLCE ( విజయవాడ ) RVR college ( గుంటూరు) KITS(వరంగల్)
ఇవి స్థానిక విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఏర్పడ్డవి . వీటిపై ఆ యా యూనివర్సిటీ లా ఆధిపత్యం ,తనిఖీలు ఉండేవి. ఆ తనిఖీ బృందాల్లో అవినీతి పరులైన అధ్యాపకులు కొందరు దూరటం , వారు కళాశాలల యాజమాన్యాల నుంచి అన్న పానాలు , బహుమానాలు పొందటం మొదలు అయింది
మొదట్లో వాటిల్లో ప్రవేశానికి ,12 లో వచ్చిన మార్కులే గీటు రాళ్లు అన్న నియమం ఉన్నా , యదార్ధం లో అడిగిన డబ్బు చెల్లించిన వారికే Application forms ఇవ్వటం , ప్రవేశం ఇవ్వటం ఆనవాయితీ గా ఉండేది . షా పరిపాలనలో ఉన్న ఇరాన్ జాతీయులు ఇండియాలో చదువులకోసం ఆ కాలం మొదట్లో కొంత ఎగ బడ్డారు . ఇంజినీరింగ్ కళాశాలలో మూక ఉమ్మడి కాపియింగులు కూడా జరుగుతూ ఉండేవి .
ప్రవేశ పరీక్షల ప్రారంభ దశ కూడా అదే
కొన్ని కళాశాలల్లో labs ఉండేవి కావు
నాకు ఆ దశ లోని పరిస్థితులతో కొద్దే అయినా ప్రత్యక్ష పరిచయం ఉంది.
అయితే విద్యార్థులు ప్రభుత్వ రంగం లో ఉన్న కళాశాల విద్యార్థులతోపాటు ఏవ్ పరీక్షలు వ్రాయ వలసి ఉండటం వలన కొంత గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు పరిస్థితులు ఉండేవి
ఆ కాలానికి సంబంధించిన నా కథలు ;1 సంచార పరిశోధనాలయం oct 1982 2. శత ప్రవేశపరీక్షావధానం, మే 1982 , 3. రంగడికి నవ్వొచ్చింది April 1988, 4. చెత్తకుండీ Oct 1993
ఈ కథలు విద్యాకవనాలు విభాగం లో వ్యంగ్య కవనాలు సంకలనం లో ఉన్నాయి

Written by kavanasarma

February 26, 2018 at 11:29 am

Posted in Uncategorized

%d bloggers like this: