Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా వాగాహనాలు-4

నా అవగాహనలు -4
కవన శర్మ
వేటలు -బూటకాలు
సింహం ఒంటరిగా వేటాడుతుందని అది ఏనుగ కుంభ స్థలాన్ని కొడుతుందని , ఎంత ఆకలి వేసినా ,నీరసపడి పోయినా , ఏది పడితే అది తినదని చిన్నప్పటినుంచి వింటూ వచ్చాను. ఈ మధ్య జంతువుల వేట టి.వి. లో చూసాక నాకు అవన్నీ బూటకాలు అని తెలిసింది.
వేటాడే జంతువు ( వేజం , Predator) తన శక్తి ని తన వేటలో గొప్పగా ఆచి తూచి వాడుతుంది. .వేటాడబడే జంతువు ( వేబజం Prey) కుడా తన శక్తిని ప్రాణ రక్షణ లోనే వాడుతుంది. ఆ ప్రయత్నాలే వాటి వ్యాయామం .
వేగం :
వేటాడటానికి పనికి వచ్చేది, తప్పించుకోవటానికి ఉపయోగ పడేది, వేగం . ఎంత ఎక్కువవేగంగా, ఎంత సేపు వేజం , వేబజం పరిగెత్త గలవు అనేది ఒక ముఖ్య మైన పరామితి. వేబజంలు నీరు ఆహరం దొరికే నెలవుల దగ్గర ఉంటాయి. వేజంలు కూడా వేబజంలు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి .అంటే వేటి ఆహారం దొరికే చోట అవి ఉంటాయి .వేబజంలు మేస్తూనో, సేద తీర్తూనో ఉంటె ఆపక్కనే వేజంలు కూడా కొద్ది దూరం లో సేద తేరుతూ ఉంటాయి వే జంలకి ఆకలి వేయగానే నెమ్మదిగా వాటి సవ్వడి లేకుండా వేబజంలని సమీపించి అందుబాటు దూరం లోకి రాగానే వేగాన్ని పెంచి పట్టుకోవాలని ,తరమటం మొదలు పెడతాయి . ప్రమాదాన్ని పసి గట్ట గానే వేబజంలు అందకుండా వేగంగా పారిపోవటం మొదలు పెడతాయి. ఈ రెంటికి ‘వేగం’ ఆ విధంగా ప్రాణాధారం . ఈ వేటలో కొన్నిసార్లు వేజంలు విజయం సాధిస్తే కొన్ని సార్లు వేబజంలు సాధిస్తాయి. వేజంలు అలిసి పోయినప్పుడు మూర్ఖం గా వేట సాగించావు . అలుపు తీర్చుకుని మిగిలిన శక్తి తో మరో అనువైనప్పుడు వేట సాగిస్తాయి. పూర్తి గా శక్తి ఖర్చు చేసేసుకుంటే అవి ఇంకా వేటకి పనికి రాకుండా పోయి , ఆకలి తీరక చని పాయితాయి
మంది బలం లేక మందే బలం :
వేటని ప్రభావితం చేసే మరో పరామితి మంద ఎంత పెద్దది అన్నది. మంద పెరిగితే తిండికి చేటు. అందు చేతలో మందలో జంతువులు దొరికే తిండికి సమతుల్యంగా ఉంటాయి . కాని వేటకి మంది బలం కావాలి . వేటాడ బడ కుండా ఉండటానికి మంది బలం కావాలి . పెద్ద జంతువుకి మాంసం ఎక్కువగా ఉండి , ఎక్కువ వేజంల తిండికి సరిపోతుంది. కనక వేటలో అవి అనుసరించే వ్యూహం ఒక పెద్ద వేబజం ని మంద నుంచి వేరు చేసి మూక ఉమ్మడిగా దాడి చేసి చంపటం. కొన్ని కదలకుండా కాళ్ళని లంకించుకుంటే మరోటి మెడ కొరుకుతుంది . వేబజం ల వ్యూహం మందతోనే ఉండటం. వేజం ల మంద లో ఉండే జంతువుల సంఖ్య , వేబజం ల మందలో ఉండే జంతువుల సమాఖ్య తో పోలిస్తే అతిస్వల్పం .అలా ఉండటాన్ని వివరించేదే జీవావరణ శాస్త్రం ( Ecology )వివరించే సమ తుల్యత ( Balance).
ముఖ్యంగా వేబజంలు ఇంకా పూర్తిగా బలం పొందని తమ శిశివులని మూక ఉమ్మడిగా రక్షించుకునే విధానం ఒక అద్భుత దృశ్యం. ఒక బలమైన సింహం , ఒక బలమైన అడవి దున్న తో కాని ఏనుగుతో కానీ ‘చాల’ లేదు . అది ఉత్త బూటకం . ఒక సింహం సహాయం లేకుండా ఒక లేడినో ఒక మేకననో చంప గలదు . సింహం కంటే ఎక్కువ వేగం గ ఎక్కువ సేపు పరిగెత్త గలదు ! అందుచేత కొన్నిసార్లు తన ప్రాణాన్ని రక్షించుకో గలదు . అంటే జీవరాశుల పరిణామం లో విడి జీవి రక్షణ కాక మంద రక్షింపబడే విధానం రూపొంది ఉంటుంది
ద్రవ్యరాశి -దళసరి చర్మం :
వేబజం యొక్క ద్రవ్య రాశి (mass) వేజం నుంచి ద్వంద యుద్ధం లో ఉపయిగా పడుతుంది . ఖడ్గ మృగాలకి , నీటి గుర్రాలకి ద్రవ్య రాశి ఎక్కువగా ఉండటమే కాక , దళసరి చర్మం తినడానికి అసౌకర్యంగా ఉండ టం వలన వాటి జోలికి వేజంలు పోవు.
ముసలి ఒంటరి తనం :
ఏనుగులు సింహాలు కూడా ముసలి తనం లో మంద నుంచి వేరు పడి జీవిస్తాయి. సాధారణం గా ముసలి వేజంలు, గాయాలు తగిలి క్షీణించి ఉన్న జంతువులు కంటపడితే వాటిని చంపి తిని ప్రాణాలు నిల బెట్టుకుంటాయి . వేజంలు తమని తాము రక్షించుకోలేని స్థితికి వచ్చినప్పుడు వాటిని రాబందుల దుమ్ముల గొండు లు మొదలైన బలి భుక్కులు ( Scavenger) వాటిని ఆరగిస్తాయి .
అహింస -మచ్చిక- బూటకపు భద్రత :
వేటలో ఆకలి వేసినప్పుడే ఆహారాన్ని సంపాదించుకొనే పద్ధతుంది. తినటానికే చంపటం లేక హింస ఉన్నది . చంపబడే వాటికి తప్పించు కునే మార్గం ఉంది. చెట్లు చేమలు తప్ప మిగిలిన జీవ రాశులన్నీ , ఇతర జీవ పదార్ధాలు తినే జీవిస్తాయి . విత్తనం చుట్టూ ఉన్న గుంజుకాక మరో జీవిగా రూపు చెందగల విత్తులని తినటం కూడా చంపటమే !
నాగరికత పెరిగిన కొద్దీ మనుషులు జంతువుల్ని మచ్చిక చేసుకుని , పెంపకంలో బూటకపు భద్రత కలిపించి , వాటికి స్వీయ రక్షణ అవకాశాలు లేకుండా ,చేసి చంపి తినటమే యదార్ధమైన హింస అని నాకు అనిపిస్తుంది. ( వివాహ వ్యవస్థలో కూడా కొందరు మగవారు చేసే ‘ఈ మచ్చిక చేసుకునే దుర్మార్గం ‘ నిబిడీ కృతమై ఉన్నదని నాకు అనిపించి వ్రాసిన కథే ‘మచ్చిక’ జనవరి 2002 బహుమతి పొందినకథ )

Written by kavanasarma

February 21, 2018 at 3:11 am

Posted in Uncategorized

%d bloggers like this: