Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా అవగాహనలు-3

నా అవగాహనలు-3 డార్వినిక పరిణామ సిద్ధాంతం

మాల్తోస్ 1778 లో జనబాహుళ్యాల ఆధార సూత్రాలు ( Principles of Populations ) అన్న వ్యాసం ప్రచురించాడు డార్విన్ ఆ వ్యాసం వలన ప్రేరణ పొందాడు . తాను స్వయంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొక్కలని జంతువులని చాలా సంవత్సరాల పాటు పరిశీలించాడు. (ఆ రోజుల్లో జీవరాసులని వృక్షకోటి , జంతుకోటి అంటూ రెండు సముదాయాలుగా విడ దీసే వారు . (ఈ నాడు 10 కోట్ల జీవ రాసులు ఉన్నాయని మనకి తెలుసు వాటిని 5 రకాలైన జీవకోటులుగా వర్గీకరిస్తారు ) వాలస్ అనే మరో శాస్త్రజ్ఞుడి సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి 1858 లో ‘సహజ ఏంపిక’ ( Natural Selection ) అనే ఆధార సూత్రం ( Principle ) ని తమ గొప్ప విప్లవా త్మక వ్యాసం లో ప్రతిపాదించారు.
ఈ వ్యాసానికి ప్రాతిపదిక గా 3 పరిశీలనలు ( Observations ) 2 హేతు సాధ్యాలని ( Deductions ) ని స్వీకరించారు.
పరిశీలన 1. ప్రతి జీవ రాశి ( Species Of Life ) యొక్క బాహుళ్యం లోని ప్రతి జీవి తన తదనంతరం తన స్థానం లో సగటున ఎక్కువ జీవులని భర్తీ చేయాలనిచూస్తుంది .
పరిశీలన 2. మిగతా ప్రపంచం తో సంబంధం లేకుండా విసిరి వేయ బడ్డట్టు ఉండే ద్వీపం లో లక్షల కొద్దీ సంవత్సరాలపాటు మనగలిగిన జాతుల లోని జీవుల సంఖ్య అపూర్వం గా స్థిరంగా ఉంటుంది.
హేతు సాధ్యం !. అంటే ప్రతి జీవి తన స్థానం లో ఎక్కువ జీవులని నిలపాలని చూ సినా , అవి ఒకటి కంటే ఎక్కువ వి చచ్చయినా పోతాయి. లేక పోతే పునరుత్పత్తి చేతకానివైనా అయి ఉంటాయి
పరిశీలన 3. పరిమితమైన ప్రదేశం లో అక్కడ పరిమితం గా లభిచే ఆహారం వలన ప్రతి జీవి తన జాతి లోని మిగిలిన వాటితో పోటీ పడుతుంది. .ప్రతి జాతిలోను ఒక జన్యు నిధికి చెందిన ఎన్నో రూపాలు లేక ఉప జాతులు 9 Varieties ) ఉంటాయి
హేతు సాధ్యం 2. జీవన పోరాటంలో ( Struggle For Existence ) లో ఏ వర్గం అయితే పరిసరాలకు ఎక్కువ అనుగుణం గా ఉంటుందో ఆ వర్గం తక్కువ అనుగుణం గా ఉన్న ఇతర వర్గాల కంటే ఎక్కువ లబ్ది పొందుతుంది .
ప్రపంచం లో ఉన్న జీవ జాతులు మనకి ఒకోచోట ఒకో రూపం లో దర్శనం ఇవ్వటానికి ఇదే కారణం .
జన్యు నిధి
జన్యువులు కావాలని ఓ ప్రకారం గ కాకుండా కేవలం కాకతాళీయం గ ( గుడ్డెద్దు చేలో పడ్డట్టు ) తమ జన్యు పదార్ధ విషయం లో పొందుపరివర్తన వలన కొత్త జన్యువులు ఉద్భవిస్తాయి . ఈ పరివర్తన వలన వెంటనే ఏ లాభం లేక పోగా నష్టం కలగా వచ్చు .అయితే ఒకే జాతిలో పరివర్తన పొందిన జన్యువులు కాల్ జీవులతో అదే జాతిలోని మిగిలిన జీవులు కలవటం వలన పరివర్తన చెంది ఏర్పడిన కొత్త జానువులు జన్యు నిధిలో చేరుతాయి . ఈ విధం గా జన్యు నిధిలోని సమాచారం విస్తృతం అవుతూ పోతుంది.
ఒకోసారి పరిస్థితుల్లో హఠాత్తుగా మార్పు వచ్చి ఆ మార్పు అక్కడి ప్రాణి వ్యవస్థ ( Ecology ) మీదఒత్తిడి తెస్తుంది . అప్పుడు అంతవరకు లాభ సాటిగా పునరుత్పత్తి చేస్తున్న ఉపజాతి లేక రూపం తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది . కానీ అప్పటికే జన్యు నిధిలో ఆ మార్పుకి తట్టుకుని లబ్ది పొందగలిగిన జన్యువులు కలిగిన వర్గం ఉంటె అవి విజృభిస్తాయి . జన్యు నిధిలో అంతర్నిహితంగా కార్య రూపం దాల్చే శక్తీ గల జన్యువులు సాధారణం గా ఉంటాయి అవి కొత్త రూపం దాలుస్తాయి. అల్లా కొత్త రూపాయల్ని దాల్చి మిగిలాయి కనకే మనం చూడగలుగుతున్నాము.
డార్వినికా పరిణామం ఒక ప్రాణిగాని ఒక ఉపజాతిగాని నశించకుండా ఉండే ప్రాతిపదికన కాక మొత్తం జన్యు నిధి నశించకుండా ఉండే ప్రాతిపదిక మీద జరుగుతున్నట్టు ఈ నాడు మనం గుర్తిస్తున్నాము
ఒకే జీవ జాతి ( Species)కి చెందని జీవుల అకాలయిక వలన పుట్టిన జీవాలకు పునరుత్పత్తి శక్తీ ఉండదు అని గుర్తు ఉంచు కోవాలి. గాడిదలకు గుర్రాలకి పుట్టిన కంచర గాడిదలు సంతానాన్ని కనలేవు !
చివరగా పరిణామ వాదానికి ఇంత వరకు వ్యతిరేక నిదర్శనాలు లేవు. అటువంటి పరిస్థితులు ఎదురయ్యేవరకు సైన్స్ ఆ వాదాన్ని వ్యతిరేకించదు. సాఅస్త్రజ్ఞులు వ్యతిరేక నిదర్శనాలని అలక్ష్యం చేయరు.అటువంటి వ్యతిరేక నిదర్శనాలు కనిపించినప్పుడు అంతవరకు ఉన్న సిద్ధాంతాన్ని మెరుగు పరుచుకోవటానికి ప్రయత్నిస్తారు,.అది సాధ్యం కానప్పుడు డిపాత సమాచారాన్ని కొత్త సమాచారాన్ని వివరించగల కొత్త సిద్ధాంతాల వెదుకులాటలో పడతారు

Written by kavanasarma

February 19, 2018 at 2:08 pm

Posted in Uncategorized

%d bloggers like this: