Kavana Sarma Kaburlu

All Rights Reserved

నా అవగాహనలు -2

leave a comment »

నా అవగాహనలు-2 విశ్వవీక్షణం
ఈ మధ్య డార్వినిక పరిణామ సిద్ధాంతం మీద కొంత చర్చ ఆంధ్ర రాష్ట్రం లో జరుగుతోంది . ఆ సిద్ధాంతం న్యూటనిక విశ్వవీక్షణానికి చెందినది అని చర్చించే వారికి తెలిసి ఉంటె చర్చ సవ్యంగా ఉంటుంది అని నా అభిప్రాయం . అందుకని నా అవగాహన మేరకు న్యూటనిక విశ్వ వీక్షణాన్ని వివరిస్తాను .
మనం ప్రపంచంలోని వ్యక్తులని ,సమాజాన్ని, విషయాలని ,పరిశీలిస్తూ ఉంటాము .ఆ పరిశీలన వలన మనకి వాటిగురించిన సమాచారం ( Data ) లభిస్తుంది. .ఆ సమాచారం బట్టి మనం పరిశీలిస్తున్న విషయాన్ని పాలిస్తున్న సూత్రాలు ‘ఇవి ‘ అన్న అభిప్రాయానికి వస్తాము వాటిని అనుభవం నుంచి వచ్చిన ( Empirical ) సూత్రాలు అంటాము . వాటిని వ్యక్త పరచటం సమీకరణాల తో గాని న్యాయాలతో కానీ సూత్రాలతో కానీ చేస్తాము .న్యూటనిక న్యాయాలు అటువంటివి.
పరిశీలానా విషయాన్నీ, ప్రభావితం చేసే వాటిని, పరామితులు ( Parameters ) అంటారు. అవి పరిశీలనలో ఒక ఒక శ్రేణి ( Range ) కి చెంది ఉంటాయి ఆ శ్రేణి కి పరిమితులు ఉంటాయి ‘ఇంత నుంచి అం త వరకు’ అని కానీ ‘ఇక్కడ నుంచి అక్కడ వరకు’ అని గాని వాటిని వివరిస్తారు పరిశీలకులు కొన్ని సార్లు అటువంటి పరిమితులు న్యాయాలకి లేక సూత్రాలకి ఉన్నట్టు మొదట్లో పోల్చుకోలేక పోవచ్చు. .ఉదాహరణకి న్యూటనిక న్యాయాలు,వేగాలు కాంతి వేగంతో పోల్చినప్పుడు చిన్నవిగా ఉన్నప్పుడు వర్తిస్తాయని తరవాత తెలిసింది .
మనం పరిశీలిస్తుంది కార్యం అయితే ప్రభావితం చేస్తున్న పరామితులు కారణాలు అన్న మాట . మనం వాటి మధ్య సంబంధాన్ని మన పరిశీలన ద్వారా

ఊహిస్తాము

మనం ఊహించిన సంబంధాన్ని నమూనా (Model ) అంటాము .
నమూనా అనేది ప్రాథమిక విషయా( Prototype ) న్ని వివరించటానికి మనం ఎంచుకున్న మార్గం . అది పూర్తి సత్యం కాదు. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఒక పథకం ( Plan ) గీస్తాం . అది గోడల్లో , ఎక్కడ తలుపులు వస్తాయి ఎక్కడ కిటికీలు వస్తోయో తె లియ చేస్తుంది. కానీ అదిఇల్లు పూర్తి స్వరూపం ,తెలియ చేయదు . మొత్తం ఇంటికి ఒక 3 కొలతల నమూనాని కొన్ని సార్లు తయారు చేసాం .అది పరిమాణం లో చిన్నది గా ఉంటుంది. అది తయారు చేయటానికి వాడే ముడి సరుకులు ,అసలు ఇంటికి వాడే వాటికి భిన్నంగా ఉంటాయి. అంటే నమూనా , ప్రాథమిక విషయాన్నీ కేవలం మనం గణన లోకి తీసుకున్న పరామితుల పరిమితులకి లోబడి మాత్రమే పోలి ఉంటుంది. అంతే గాని దాన్ని మొత్తం స్వరూపాన్ని తెలియ చేయదు .అని మనం గుర్తు ఉంచుకోవాలి.
ప్రపంచం ‘ఈ నమూనా ప్రకారం నడుస్తోంది’ అని మనం అన్న దృష్టి జనాలకి సాధారణం గా ఏర్పడినప్పుడు దాన్ని విశ్వ వీక్షణం అంటాము. సాహిత్యం లో దాన్ని ప్రాపంచిక దృక్పథం అంటూవుంటారు.
న్యూటను తన న్యాయాలని ప్రవచించాక ఆ నమూనా లక్షణాలే ప్రపంచం కలిగి ఉన్నదన్న దృక్పథం ఏర్పడి బలపడింది . ఇప్పటికీ అది బలంగానే ఉంది, కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నా .ఆ లక్షణాల ఆధారంగా వాదాలు వచ్చాయి
ఆ వాదాలు ఏమిటి. ?
1. ప్రపంచం ఒక యంత్రం లా నడుస్తోంది అనే యాంత్రిక వాదం 2 పరిశీలింపబడేది పరిశీలకుడు వేరు .పరిశీలింపబడేది పరమసత్యం అనే ద్వైత వాదం 3. మొత్తాన్ని ముక్కలుగా విడగొట్టి అధ్యయనాలు చేసి కలిపితే మొత్తం గురించి తెలుస్తుంది అనే తగ్గింపు వాదం (Reductionism )
4. ఈ బలాలు పనిచేస్తుంటే ‘ఇక్కడ బయలుదేరింది అక్కడకు ( గుడ్డి ఎద్దు చేలో పడినట్టు ) చేరుతుంది’ అని చెప్పే నిశ్చిత వాదం ( Determinism ).
డార్వినిక పరిణామ వాదం ఏమి చెప్తుంది అది ఎందుకు న్యూట నిక విశ్వ వీక్షణానికి చెందినది అంటారో నా అవగాహనలు -3 లో నాకు అర్ధమైనట్టుగా చెప్తాను

Advertisements

Written by kavanasarma

February 19, 2018 at 12:00 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: