Kavana Sarma Kaburlu

All Rights Reserved

నా అవగాహనలు

leave a comment »

నా అవగాహనలు

ముందు మాటలు
నాకు తెలిసినది ఇతరులకి తెలియ చేయాలన్న కోరిక నాకు ఉంది . ఆ కోరికను ప్రేరే పిస్తున్నది ఏమిటి ? నా ఉబలాటమా ? నాకు తెలిసింది ఇతర్లలో కొందరికైనా , తెలిసి ఉండదన్న భావమా ? అది తెలియ చేస్తే తెలియని వారికి ఉపయోగ పడుతుంది అన్న నమ్మకమా ? లేక మేధావి అన్న కీర్తి కోసమా ? ఇవి ఏవీ కావు .

చెప్పకుండా ఉండలేని నా స్వభావమే కారణం అనుకుంటాను . అదే నన్నుఉపాధ్యాయ వృత్తి ఎంచుకునేలా చేసింది . నాకు తెలిసింది చెప్పటం లో నాకు ఆసక్తి ఉంది. కొంత శక్తి కూడా ఉన్నదని అనుకుంటాను .
1 వ అవగాహన .
నేను ‘ఒకటి’ గమనిస్తాను . ఆ గమనించినది నా అనుభవం లోంచి నాకు ‘ఒకటి ‘లాగా అర్ధం అవుతుంది. అది మీతో పంచుకోవాలని అనుకుంటాను. అది మాటల తో ‘ఒక’ లా వ్యక్త పరుస్తాను. అది మీకు మీ అనుభవాలవలన ‘ఒక ‘లా అర్ధం అవుతుంది .ఈ అన్ని’ ఒకట్లు’ ఒకే ‘ఒకటి ‘ కావు. చెప్పేవారు చాలా శ్రమపడితే అది చేరవలసిన వారికి ఊహలకి అపార్ధాలకి లోను అయ్యే అవకాశం అతి తక్కువగా ఇస్తూ చేరుతుంది. .ఈ మాటలు, నా గురువులు శ్రీ కాళీపట్నం రామారావు గారు స్నేహితుడు ఇవటూరి సురేశ్ తో అన్న మాటలు, నాకు అర్ధమైనట్టుగా నేను చెప్పినవి.
నాకు వీలైనప్పుడల్లా నాఅవగాహనలను ఈ మాధ్యమంద్వారా చెప్పాలనుకుంటున్నాను.
మరింత ప్రయోజనం సిద్ధించటానికి ఎవరైనా వీటిని తమ పత్రికల్లో కానీ గోడల పై వ్రాతలు గా గాని ప్రకటిస్తే నాకు అభ్యంతరం లేదు . అయితే వీటిని ఏ మార్పులు చేయ కుండా ( కర్త పేరు తో సహా ) ప్రకటించటం మర్యాదా .
సత్తువ ,వయస్సు తో కొంత కాలం పెరిగి తరవాత క్షీణించటం జరుగుతుంది. అనుభవాలు పెరుగుతాయి కానీ అర్థం చేసుకునే శక్తి తగ్గవచ్చు. నాకు ప్రస్తుతం ప్రయోజన కర మైన సేవా కార్యాలు చేసే సత్తువ క్రమేపి తగ్గుతోంది. నేను చేయగలిగింది మేధో శ్రమ మాత్రమే. అందుకని అదే చేయదలుచుకున్నాను. అది ఉత్పత్తిని పెంచదు కనక వీటికి ఉపయోగం ఉండదు అనుకున్న వారు ఇవి చదివి కాలం వ్యర్థ పుచ్చుకోవద్దని మనవి
. ప్రాపంచిక దృక్పథం లేక విశ్వ వీక్షణం ( Paradigm ) అంటే ఏమిటి ?గురించి నా అవగాహన -2 త్వరలో

Advertisements

Written by kavanasarma

February 18, 2018 at 3:11 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: