Kavana Sarma Kaburlu

All Rights Reserved

స్త్రీవాది బహుకృత వేషం

with one comment

1994 part 2
నాకు అనుకోకుండా స్త్రీవాదిననే ముద్ర పడి పోయింది . నాకు కాదన లేక పోయే ధైర్యం లేక పోయింది. . ఆ ధైర్యం మా ఆవిడకు పుష్కలం గా ఉంది. "ఈ యన స్త్రీ వాదే మిటి నామొహం భార్యనే సంతోష పెట్టలేడు…ఒక ముద్దా ఒక ముచ్చటా .నెల కో చీరయినా కొనడు " అని అనసాగింది అందరి తోను. సరిగ్గా ఆ సమయం లోనే కథ 94 ఆవిష్కరణ సభ జరిగింది.

ఆ సాయంత్రం వివిన మూర్తి గారి క్వార్టర్స్ లో భోజనాలకి ముందు అందరం ఒక చోటా పోగుపడ్డాము.
పాటలు వచ్చిన వారు పాడుతున్నారు. విజయ సం గీతం నేర్చుకోలేదుగాని గొంతుకలో సహజ మాధుర్యం ఉంది. దానికి నేను పెళ్ళికి ముందే పడిపోయాను. ఎప్పుడైనా సభల్లో పాడేది ఆ విషయం పొత్తూరి విజయలక్ష్మి , వివిన , వల్లం పాటి కారా లాంటి వారికి తెలుసు. అందుకని పాడమన్నారు. " ఆవిడ సాకులు చెప్తోంది అప్పుడు ఓల్గా " శర్మ గారూ ! మీరు చెప్తే గాని ఆవిడ పాడరు అనుకుంటాను " అన్నారు.
స్త్రీవాదులందరు లోపల పక్కా స్త్రీలే. గుంపు వడ్డనల సమయం లో కొంగులు బిగించి పనుల్లో దిగి పోతారు. .వసతి గదులు సరిగ్గా లేకపోతే చీపుళ్లు పట్టేసుకుంటారు. ఓల్గా భార్యలు భర్తల మాటలు వినాలని అనుకోక పోయినా వింటారని దృఢం గా నమ్ముతారు అనిపిస్తుంది
నేను పాడ మంటే , ‘ మీ మాట నేను వినను ‘ అంటుంది మా ఆవిడ అందుకని నోరు మూసుకున్నా
" ఆయనకి నేను పబ్లిక్ లో పాడటం ఇష్టం ఉండదు ఆయన్ని మీరు స్త్రీ వాది అని ఎందుకు అనుకుంటారో గాని "అని వెంటనే తన స్వతంత్రం ప్రకటిస్తూ " మాటాడని మల్లెమొగ్గ మాదిరిగా , ఏది పెన్నా ఏది పెన్నా నిదానించి నడూ " అంటూ రెండు పాటలు పాడేసింది.
" నా తరవాతి సినిమాలో మీ చేత పాడించు కుంటాను " అన్నారు అక్కినేని కుటుంబరావు మెచ్చుకోలుగా
ఆ సాయంత్రం నుంచి నన్ను స్త్రీవాదులు సందేహ దృష్టి తో చూడ సాగారు
1994 నవంబర్ నాటికి వారి సందేహం నివృతి అయింది. .ఆ లోపల రచన హాస్య కథల పోటి నిర్వహించటం, ఆ పోటిలో బహుమతి పొందిన రచయిత తన లో ఇంకా హాస్యం మిగిలి ఉండటానికి, తనకి వివాహం కాక పోవటం ,భార్యా బాధితుడు కాక పోవటం కారణాలు గా చెప్పుకున్నాడు. ఆవిషయం కొంతమంది రచయిత్రులు నా దృష్టికి తెచ్చి విమర్శించారు . నేను మూర్ఖం గా " మీరు నవ్వ ము గాక నవ్వము అని భీష్మించుకు కూర్చోరాదు . అతను అన్నది కేవలం నవ్వించ టా నికే " అన్నాను. అప్పటికి వారు ఊ రుకున్నారు .నవంబర్ లో శ్రీ కాళీపట్నం రామారావు గారి సప్తతి జరుగుతున్న సమయంలో వీరంతా , వారి హయ్ కమాండ్ కృష్ణా బాయి గారికి ఫిర్యాదు చేసారు. వేణుగోపాల రావు గారు నాకు అన్న సమానులు . అందుచేత ఈ విడ నాకు వదిన గారు. ఆవిడ నన్ను మందలించి ఆపైన రచయిత్రుల తో " శర్మ ని పట్టించు కోకండి. అతనికా చాలా ఎదగాలి . అతను అవసరం బట్టి వేషాలు వేస్తూ ఉంటాడు ట " అన్నారు.
అప్పుడు వారు ," అవును మేమూ విన్నాము . మొన్న మే లో బెంగళూరు సభలు జరిగిన సమయం లో ఆయన పొద్దున్నో వేషం మధ్యాహ్నం మరోటి, సాయంత్రానికి ఇంకోటి వేసుకు వస్తుంటే పాపినేని ,’ఏమిటి పౌరాణిక నాటకం లో ఒకటవ కృష్ణుడు ,రెండవ కృష్ణుడు వేషాలు మార్చినట్టు ‘ అన్నాడుట తట్టుకోలేక" . అనేసారు.
ఈ విషయం మళ్లీ కోతి రాతలు పుస్తకం అప్పుడు వస్తుంది కానక అప్పుడు వివరం గా చెప్తాను
.

Advertisements

Written by kavanasarma

January 17, 2018 at 2:41 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. చదివేసాను.👌👌👌

    lokanampriya

    January 17, 2018 at 3:48 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: