Kavana Sarma Kaburlu

All Rights Reserved

మొదటి ప్రకారం ఆత్మ కథ

with one comment

మొదటిప్రకరణం
19 39 -19 41
నేను 1939 , సెప్టెంబర్ 23, న పుట్టానుట . నాకు గుర్తు లేదు .కాని నమ్ముతాను .దీన్ని ఆప్త వాక్య ప్రమాణం అంటారుట ఈ విషయం నాకు 19 78 లో మా నాన్న గారు భారతిలో హైందవ తర్క శాస్త్రం మీద వ్రాసిన వ్యాసం చదివాక తెలిసింది అంటే ఇప్పుడు వ్రాస్తున్న భాష తో నాకు 19 39 లో పరిచయం లేదు . అసలు ఉంగా భాష ఒకటే వచ్చు .
నాకు అప్పటి దృశ్యాలను కొన్ని గుర్తుండి పోయాయి. అవి ఇప్పటి భాషలో చెప్తాను . వాటిని ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు.
ఆ ప్రత్యక్ష ప్రమాణాల ను ఇప్పటి భాషలో చెప్పటం లో కుడా ఒక ఇబ్బంది ఉంది నాకు అప్పటికి బుద్ధి వికసించలేదు కదా " ఇప్పటికీ వీడికి బుద్ధి వికసించలేదు " అని మా అక్క కామేశ్వరి ( కంచి ) మా పెద్ద నాన్న గారి పెద్ద కొడుకు మా నాన్న గారి తరవాత అంతటి వాడు సూర్యనారాయణ ( సూరి ) ఎంతో నొచ్చుకుంటూ అంటూ ఉంటారు . ఇవి ఆప్త వాక్యాలేకాని , ప్రమాణాలు కావు. అంటే అన్నీ ఆప్త వాక్యాలు, ప్రమాణాలు కావు . అటువంటి పరిస్థితుల్లో, నేను " నా బుద్ధి సంపూర్ణం గా నా చిన్నప్పుడే , మరీ చిన్నప్పుడు కాక పోయినా , వికసించింఉంటుంది "లాంటి ఉచిత మైన ఊహ ( అర్దా పత్తి ప్రమాణం ) లని అవసరం బట్టి చేసుకుంటూ సాగుతాను .
నేను , చెన్నపట్నం లోని భీమన్న పేట ఆసుపత్రిలో పుట్టానుట. అప్పటికి మా మాతామహుడు ముక్కవిల్లి సూర్యనారాయణ గారు ప్రెసిడెన్సీ కళాశాల లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు . ఆతర్వాత కొద్ది కాలానికే పింఛని పుచ్చుకుని రాజమహేంద్రవరం వెళ్ళిపోయారుట . ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరు పుట్టినాట్టే నేను అమ్మమ్మ గారి ఉళ్ళో నే పుట్టాను కాని అక్కడి అలవాటు ప్రకారం మా అన్నలు అక్కలు నన్ను ‘తంబు’ అని పిలవసాగారు .ఇప్పటికీ నాపేరు అదే పోతే కొందరు తంబు బాబా య్ అని, తంబు మావ/మావయ్య , తంబు తాత అనే పిలుస్తున్నారు .మా ఆవిడ, పిల్లలు మాత్రం బావుండదని తంబు- అని పిలవరు .
ఇంతకు మా మామ్మ , నేను కడుపులో ఉన్నప్పుడే సింహాద్రి అప్పన్న తో ఒప్పందం కుదుర్చుకుందిట ." నా కోడలికి మూడో కానుపు లోనైనా కొడుకు పుడితే " శ్వేత వరాహ శర్మ " అని పేరు పెడతాను" అని.
ఆయన వరం ఇచ్చేసాడు నేను పుట్టేసాను .కాని మా అమ్మకి ఆ పేరులో శ్వేత అన్న మాట నచ్చలేదుట. ఎందుకంటే ఇద్దరు మేలిమి బంగారం లాంటి తెల్లటి ఆడపిల్లల తరవాత నేను నల్లగా చింతపండుల పుట్టానుట . నన్ను మా అమ్మ " నా పనస పండు . నా చింత పండు" అని ముద్దు పెట్టుకోవటం " నాకు చాలా బాగా గుర్తుంది. ముద్దు పెట్టుకోవటం బాగా ఉంటుంది కాని మరి చింత పండు అనటం ఏం బావుంటుంది ?
మా అమ్మది ఆదే పాయింట్ ట . "వరాహం బాగానే అర్ధవంతం గానే ఉంది శ్వేత అంటే మరి పచ్చి అబద్ధం లా ఉంటుంది " అందిట మా నాన్నగారితో . అందుచేత కందుల వరాహ నరసింహ శర్మ గా నేను నామకరణం చేయ బడ్డాను .
మా అమ్మమ్మ కి నాలో నచ్చని విషయం నేను పెద్ద తలకాయ వేసుకుని పది నెలలు నిండాక ఆవిడ కూతురిని బాగా కష్టపెట్టి పుట్టడం . నేను పుట్టినప్పుడు మా అమ్మకి గొప్ప నొప్పులే వచ్చాయిట మరి .
అందుకో మరెందుకో గాని నన్ను మా రెండో అక్క, కనకసుందరి "ఎప్పుడైనా ప్రేమ వస్తే " ఒరేయ్ చామ దుంప గుండు" అంటూ పిలిచేది . దాన్ని నేను దాని పై వాళ్ళు అందరు పిలిచినట్టే "చెల్లీ " అని పిలిచి , కసి తిర్చుకునేవాడిని .
నా మొదటి దృశ్య జ్ఞాపకం ఏమిటంటే మా అక్కలిద్దరూ ఓ నవారు మంచం మీ ద కూర్చున్నప్పుడు నేను ఆ మంచాన్ని వాళ్ళతో సహా ఎత్తటం .
మా అమ్మ ఆ విషయం గురించి పదే పడే అందరికి చెప్పటం వలన నాకు అది దృశ్య రూపం లో ముద్ర పడి ఉండ వచ్చు .ఈ దృశ్యం నేను మాయా బజార్ సినిమా చూసాక చేసిన ఉచితమైన ఊహ హ కావచ్చు .నిజంగా గుర్తుండి ఉండవచ్చు .ఏది ఏమైనా ఆ సంఘటన నాకు ఆ తరువాతి 15 ఏళ్ల జీవితాన్ని శాసించింది .
నాకు మూడేళ్ళు నిండక ముందే ఎడం వైపు హెర్నియా వచ్చింది .దీన్ని పేగులు జారటం గా తెలుగులో చెప్పేవారు. పెల్విక్ చట్రం లోని ఖాళీల లోంచి వట్టల ( సంస్కృతం , ఇంగ్లిష్ పదాలు నాజూ కైనవి అని నేను నమ్మను ) సంచి, లోకి ,అడ్డు పొర ,పేగుల బరువుకి సాగి , వాటి కొంత భాగం తో సహా, దిగ బడటం అన్న మాట . నాకు 1942 లో జరగా వలసిన శస్త్ర చికిత్స 1956 వరకు జరగలేదు . 1942 భారత దేశ చరిత్ర లోను నా జీవిత చరిత్ర లోను ఒక సంఘట నాత్మక సంవత్సరం .

Advertisements

Written by kavanasarma

August 22, 2017 at 3:32 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. I am very happy for the good beginning. I am eagerly waiting to read the
    pending chapters as soon as I can lay my hands and eyes on them. Thanks a
    lot for sharing.

    severemohan

    August 22, 2017 at 9:26 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: