Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఆత్మ కథ వ్రాయాలని ఉంది

with one comment

పాక్షిక సత్యాల ఆత్మ కథ
కవన శర్మ
నా గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుందని నాకూ తెలుసు. ఇంతో అంతో గొప్పవాళ్ళ జీవితం గురించి మనకి తెలిస్తే వారికి మనకి ఉన్న సాపత్యాలు ,ఎకాభిప్రాయాలు తెలుస్తాయి కదా . అందుకోసం మీరు నా గురించి తెలుసుకోవాలని అనుకుంటారని నాకు తెలుసు నేనూ మీలాంటి సాధారణ మానవ మాత్రుడి నే అని తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు . మీరు ఆశ్చర్య పోయేలా నా జీవిత చరిత్ర వ్రాయాలని నాకు ఎంతో కాలం గా కోరిక .
కాని ఎలా మొదలు పెట్టాలి ? ఏవి వ్రాయాలి ?ఏవి దాచాలి ? ఈ ప్రశ్నలకి జవాబులు తెలియాలి ముందు. నేను గొప్పలు చెప్పుకుంటే మీరు నమ్మరు. కొన్ని చీకటి కోణాల ని వెలుతురు లోకి తేవాల్సి ఉంటుంది. నాకు జరిగిన సత్కారాలే కాదు అయిన అవమానాలు కుడా చెప్పాలి .
జరిగిన సత్కారాలని వినయం గా వివరించటం ఒక కళ డబ్బా కొట్టుకున్నాక భగవంతుడి/ మా గురువుగారి/ నా తలి దండ్రుల చలవ ఇటువంటి పదాలు చేరిస్తే ఏమి వినయం ఏమి వినయం అని మిరే అంటారు. ఈ కళని సిని జీవులు బాగా అభ్యసించి ప్రదర్శిస్తూ ఉంటారు కదా. చూసి నేర్చుకోవచ్చు
కాని అవమానాలు చెప్పుకోవటం చాల కష్టం .వాటిని నేను ఎంత మరిచిపోదామని చూస్తుంటే అవి అంతగా గుర్తుకు వచ్చి బాధిస్తుంటాయి. అవి దాచుకోను లేము చెప్పుకోను లేము. . వాటిని చెప్పేటప్పుడు అంతిమ విజయం నాదే అనిపించేలా చెప్పాలి .అంతిమ విజయం ఎప్పుడు సత్యం దే కదా అందుకని అందరు నేను చెప్పింది సత్య మేనని నమ్ముతారు సరే అది ఎదో విధం గా చెప్పవచ్చు .
కాని మనమే సిగ్గుపడేలా ప్రవర్తించిన సందర్భాలుంటాయి కదా ! వాటిని ఎలా చెప్తే , "ఆ నేరం నాది కాదని ఆకలిది " మీరు అని నమ్ముతారు ? . ‘ఎంత సత్య సంధతో!" అని మెచ్చుకుంటారు ?.. శ్రీ శ్రీ , అనంతం లో, ఆయన కి చెడు కోరికలు కమ్మ్యునిస్ట్ రష్యాలో కలగలేదని కాపిటలిస్ట్ ఫ్రాన్సు లో దిగగానే కలిగా యని చెప్పినట్టుగా చెప్పా వచ్చేమో . గాంధి గారి ని చలాన్ని కుడా ఔపోసన పట్టి చూడాలి
శోభనం రాత్రి ఏమి జరగలేదని తరవాత కంగారు తగ్గాక దగ్గరతనం ఏర్పడ్డాక జరిగిందని చెప్పుకుంటే ఎంత చిన్న తనం . "ఇలాంటివి పబ్లిక్ గా ఒప్పుకోరాదు . మేమూ నీలాగే ఏడ్చాము . మేం చెప్తున్నామా అందరితో ? " అంటూ నాకు చివాట్లు వేసారు స్నేహితులు ఏకాంతం లో . వాళ్లకి లేని బాధ నాకేమిటి ! వాళ్ళకేమి !వాళ్ళకి ఆత్మ కథలు వ్రాయాలన్న కోరిక ఉన్నట్టు లేదు . పైగా పరిధి నవల లో భార్యా భర్తల మధ్య శృంగారం వ్రాసానని వల్లంపాటి కేకలేసాడు. అందుచేత శృంగార విషయాలు ఆత్మ కథలో ఉండ కూడడెమో .
ఎం చెయ్యాలో వ్రాసినప్పుడు చూద్దాం .

Advertisements

Written by kavanasarma

August 21, 2017 at 1:25 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Excellent fore wòrd sir!
    Bàsh on regardless!!

    severemohan

    August 22, 2017 at 9:26 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: