Kavana Sarma Kaburlu

All Rights Reserved

రక రకాల గురువులు

leave a comment »

నా ప్రకారం గురువులు మూడు రకాలు 1. మోక్షం లేక పరమ ఆనందం గురించి చెప్పేవారు
బుద్ధుడు, శంకరుడు , రమణ మహర్షి, జిడ్డు కృష్ణ మూర్తి మొదలైన వారు ఇహలోక లాభ నష్టాల గురించి కాక మోక్షం పొందటం లేక పరమానందం పాడటం పరమాత్మని దర్శించటం లాంటి విషయాలగురించి చెప్పి ఉన్నారు. గురువు అనే వాడు మార్గం చూ పిస్తాడని మనమే ఆ దారంతా నడుస్తూ పోవాలని ,వేలు పట్టుకుని గురువు నడి పించడని చెప్పే వారు మొదటి రకం. ఇందులో కొద్ది తేడాలున్నాయి . భగవంతుడిని భక్తి తో నమ్ముకుంటే ఆయనే పిల్లి, పిల్లి పిల్లలని నోట కరుచుకు పోయినట్టు పోతాడని చెప్పేవారు కొందరు ,లేదు మనమే అతగాడిని కోతి పిల్ల తల్లిని పట్టుకుని వేళ్ళాడి నట్టు వేళ్ళాడాలని చెప్పే వారు కొందరు . వీరిలో ఉన్నారు
కకృష్ణుడు అనే జగత్ గురుడు మాత్రం ని బాధ్యతలు నువ్వూ ఏ కోరికా లేకుండా నిర్వర్తిస్తూ పో అదే నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది అని చెప్పాడు. అంతే ఆని అతను కుడా నిన్ను నీ కర్మ మార్గం లో నేను నడిపిస్తాను అన లేదు
2. ఇహలోకం లో సుఖ పడటానికి మార్గాలు చెప్పేవారు
నువ్వుె ఫలానా స్తోత్రం 108 సార్లు శుచిర్భూతిడివి అయి తూర్పు వైపు తిరిగి చదువు , నీకు కోరికలు తీరుతాయి అని చెప్పేవారు , ని పడక గదిలో 3 x 4 పరిమాణం గల దిండుకి పసుపచ్చ గలీబు వేసుకుని దక్షిణ దిశలో పడుక్కో అంతా శుభమే అనో ఫలానా వ్రతం చెయ్యి ఫలానా గోడ విరక్కొట్టు అనో చెప్పే గురువు లు రెండో రకం.వీరి వలన మనకి ధన హాని మాత్రమే
3 . భయపెట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గపు గురువు మూడో రకం
మనకి జరగవలసిన మేళ్ళు జరగక పోవటానికి , జరగ కూడని హానులు జరగటానికి కారణం గ్రహాలూ ,దేవతలు దయ్యాలు లాంటి శక్తులు కారణం అని నమ్ముతూ ఉంటాము. అయితే వాటి ప్రభావాలని మనకి అనుకూలం గా మార్చు కోవటంా మానవ ప్రయత్నం ద్వారా సాధ్యమే అని నమ్ముతాము .గ్రహశాంతులు , క్షుద్ర పూజలు , భద్ర పూజలు , ఇలాంటివే నడిపించే గురువులు ఉంటారు . వాళ్ళు మనల్ని వేలు పట్టుకుని నడిపిస్తారు
మనలని నష్టాల నుంచి కాపాడటం, లాభాలు చేకుర్చటం వాళ్ళకి చేతనవును అని మనం నమ్ముతాము కదా , అప్పుడు తమకి కోపం వస్తేమనలని నాశనం చేయగల శక్తి తమ కున్నాడని మనలని భయపెడతారు ఈ దొంగ గురువులు
కృష్ణుడు , శంకరుడు లాంటి గొప్ప గురువులు, మన వేలు పట్టుకుని నడిపించాలేము అని చెప్తున్నప్పుడు ఈ దుర్మార్గపు గురువులకి ఆ శక్తీ ఉన్నాడని మనం ఎందుకు నమ్మాలి

Advertisements

Written by kavanasarma

July 13, 2017 at 6:23 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: